Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఇంటి పేరు పెట్టుకుంటేనే ఆ ఇంటి మనిషి అయిపోతాడా..?

January 30, 2025 by M S R

.

ఎవరో రాసుకొచ్చారు సోషల్ మీడియాలో… ‘‘ఆ ఇంటి పేరు పెట్టుకున్నంతమాత్రాన ఆ ఇంటి మనిషివి కాలేవు’’ అని…

సందర్భం ఏమిటంటే…? బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించారు కదా… ఏదో చంద్రబాబు అడిగాడు మోడీ ఇచ్చాడు, అందులో పెద్ద విశేషమేముంది..? ఎన్టీయార్‌కు భారతరత్న గట్టిగా అడగడు గానీ, ఆయనకు జస్ట్, పద్మశ్రీ అయితే కొడుక్కి పద్మభూషణ్ ఇప్పించాడు అంటూ చంద్రబాబును ఆడిపోసుకున్నారు చాలామంది…

Ads

కావచ్చు, చంద్రబాబు కన్నెర్ర చేస్తూ కూలిపోయే కేంద్ర ప్రభుత్వం కదా మరి… ఈయనేమో వియ్యంకుడాయె… మోడీని అడిగే ఉంటాడు, ఒక పద్మమే కదా అని ఆయనా ఇచ్చి ఉంటాడు… ఇదేమీ బనకచర్ల ప్రాజెక్టు కాదు కదా, అడిగిన వెంటనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి…

సరే, ప్రకటించారు… మెయిన్ స్ట్రీమ్ పెద్ద పత్రికల్లో ఫస్ట్ పేజీ యాడ్ వచ్చింది… బాలయ్యకు అభినందనలు చెబుతూ… అది నందమూరి, నారా కుటుంబసభ్యుల పేరిట వచ్చింది… అందులో చాలాపేర్లున్నాయి… కానీ జూనియర్ ఎన్టీయార్ పేరు లేదు, కల్యాణరామ్ పేరు లేదు…

బాలయ్య పంతం అంటే పంతమే… జూనియర్‌ను ఎట్టి పరిస్థితిలోనూ సహించడు… తోడుగా ఇప్పుడు తనతో తిరిగే కల్యాణ్‌రామ్‌ను కూడా మినహాయించాడు… ఇక జన్మలో జూనియర్ నందమూరి ఇంటి మనిషి కాలేడు అని బోలెడు వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో…

కానీ ఈ కోణం కరెక్టు కాదనిపించింది కాస్త తరచి చూస్తే… అందులో పేరుకు నారా కుటుంబసభ్యులు అని రాసుకున్నా సరే… మొత్తం ఎన్టీయార్ కుటుంబంలోని వాళ్ల పేర్లే… అంటే బాలకృష్ణ సోదరీసోదరులు, వాళ్ల జీవిత భాగస్వాములు…

బాలకృష్ణ ఇద్దరు బిడ్డలు, కొడుకు పేర్లు… అల్లుళ్లు, మనవడి పేరు… అంతే… మిగతా సోదరుల పిల్లల పేర్లు గానీ, వాళ్ల పిల్లల పేర్లు గానీ ఆ ప్రకటనలో లేవు… వెరీ లిమిటెడ్… అదీ ఆ కుటుంబానికే పరిమితమైన పెద్దల పేర్లు… అలా అందరి పేర్లూ ప్రస్తావించాలంటే మొత్తం ఫ్యామిలీ ట్రీ ప్రచురించాల్సి వచ్చేది సెకండ్ పేజీలో…

nbk

సో, జూనియర్ పట్ల వివక్ష అనే వాదన ఇక్కడ అర్ధరహితం… నిజంగా వివక్ష లేదా అంటే, ఉంది… కానీ ఈ ప్రకటన విషయంలో అది వర్తించదు… జూనియర్ ఎన్టీయార్ ఎప్పటికైనా థ్రెట్ అన్నట్టుగా ఫీలవుతాడు బాలయ్య… ఎన్టీయార్ నట వారసత్వం నాది, రాజకీయ వారసత్వం తన అల్లుడిది… అంతే…

బాగా ప్రేక్షకాదరణ, పొలిటికల్ యాంబిసన్స్ ఉన్నాయి కాబట్టి… ఎన్టీయార్ పోలికలు, పేరు కూడా ఉన్నాయి కాబట్టి… ఇంటి పేరూ అదే కాబట్టి… జూనియర్ ఎప్పటికైనా దూరం ఉంచాల్సినవాడే అనేది బాలకృష్ణ నిశ్చితాభిప్రాయం… ఎన్టీయార్ సమాధి దగ్గర జూనియర్ ఫ్లెక్సీలు పెడితేనే సహించలేదు బాలయ్య… ఇంకా దగ్గరికి రానిచ్చి, చేరదీసి, అలుముకుంటాడా…? నెవ్వర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • రేవంత్‌రెడ్డి కార్పెట్ బాంబింగ్! కేసీయార్ మార్క్ భారీ భూకుంభకోణం!
  • నాన్ సెన్స్-ఆర్ … ఆ మెదళ్లు శుష్కించిన బీళ్లు … ఉదాహరణకు ఏమంటే…
  • Space War – ట్రంపు చెప్పిన స్పేస్ వెపన్స్ ఏరకం? ఏవి టార్గెట్స్?
  • 2 కోట్ల నుంచి ₹300 కోట్లు… ఈ మ్యాజిక్ తులసీదాస్ రిపీట్ చేయగలడా ?
  • గజల్ శంకర్ ! టాలీవుడ్ పెద్దగా గుర్తించని ఓ ‘స్వరముత్యం’…
  • మోదీ కాదు… షా కాదు… బెంగాల్ బీజేపీ జోష్ వెనుక ఏదో ‘మార్మిక శక్తి !!
  • కథ నమ్మేలా లేదు! … AI 1980 ఫోటోలు పాత రూపురేఖల్ని పట్టివ్వవు !!
  • కాలేజీలోనే ప్రత్యేకంగా ‘OYO’ రూమ్స్ – ఇది మరీ అరాచకం !!
  • ఔను, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు – అందుకే బీజేపీకి ఒకేఒక వోటు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions