.
మా అమ్మాయి బ్రాహ్మణిని తన సినిమాలో తీసుకోవడానికి మణిరత్నం అడిగాడని బాలయ్య నిన్న ఏదో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు… తన కొత్త సినిమా డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ మీట్లలో బిజీగా ఉంటూ, ఓ విలేఖరి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మీ ఎక్కువ గారాబం అనే అసందర్భ ప్రశ్నకు… బాలయ్య ఈ జవాబు చెప్పాడు…
ఇద్దరూ గారాబమే అంటూనే బ్రాహ్మణి సినిమా ఆఫర్ చెబుతూ… ఆమే నో చెప్పింది అన్నాడు… బ్రాహ్మణి అంటే కాస్త భయమనీ అన్నాడు సరదాగా… ఎస్, వర్తమాన స్టార్ తారలకన్నా ఆమె అందగత్తె… నో డౌట్… మణిరత్నం చేతుల్లో పడి ఉంటే బాగానే షైన్ అయ్యేదేమో…
Ads
ఉన్నత విద్యావంతురాలు, తనే హెరిటేజ్ సంస్థను మేనేజ్ చేస్తోంది… వ్యాపార దక్షత ఉంది… తనే సినిమా ఆఫర్ వద్దన్నదో, బాలయ్యే వద్దన్నాడో తెలియదు గానీ… ఆ చంచలమైన, కృత్రిమ ఆకర్షణలు, ఆ సినిమా కంపు, మోస్ట్ హిపోక్రటిక్ లోకం బదులు ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్‌గా ఉండాలనే ఆమె నిర్ణయం సరైనదే… (బాలయ్య ఫ్యాన్స్ కూడా అంగీకరించేవారు కాదేమో…)
ఐతే ఈ వార్తలతోపాటు మరో వార్త కనిపించింది ఏవో సైట్లలో… ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ అనే చిట్‌చాట్ షో ఒకటి చేస్తుంటాడు కదా… బాగా పాపులర్… ఐతే ఈ షోకు గెస్టులుగా ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా సరే, ప్రత్యేకించి సినిమా గెస్టులు ఎవరూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని ఖచ్చితంగా చెప్పాడట… ఆహా టీమ్ స్ట్రిక్టుగా దాన్ని పాటించాలట…
చంద్రబాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, నాని, శర్వానంద్, సూర్య, దుల్కర్ సల్మాన్, గోపీచంద్, నవీన్ పొలిశెట్టి, శ్రీలీల, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి చాలా మంది స్టార్స్ వచ్చారు ఆ షోకు… రామ్ చరణ్ ఎపిసోడ్ వచ్చే వారం… జూనియర్ వచ్చాడా..? రాలేదు, రాడు, ఈయన పిలిచే సవాలే లేదు…
నాగార్జున, చిరంజీవి కూడా రాలేదు, కారణాలు తెలియవు… ఐతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనే రావద్దని ఆదేశించాడు అనే వార్తను నమ్మకపోవడానికి కారణాలు ఏమీ లేవు… జూనియర్ మీద తన కోపాన్ని బాలయ్య ఎప్పుడూ పెద్దగా దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు, చేయడు…
అప్పుడెప్పుడో చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం జూనియర్‌ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసే ప్రయత్నం చేశాడు గానీ అంతకుముందు జూనియర్‌ను ఆ కుటుంబం పూర్తిగా దూరం పెట్టిందే కదా… తరువాత చంద్రబాబు తత్వం అర్థమై జూనియర్ తనకు, తెలుగుదేశానికీ దూరమయ్యాడు… సోదరుడు కల్యాణ్‌రామ్‌తో మాత్రం బంధం గాఢంగానే ఉంది ఇప్పుడు… సోదరి సుహాసిని పోటీచేస్తే ప్రచారం కూడా చేయలేదు జూనియర్… అంత డిటాచ్‌డ్‌గా ఉంటున్నాడు…
తాజాగా అన్‌స్టాపబుల్ షోలో డాకూ మహారాజ్ ప్రమోషన్ ఎపిసోడ్ జరిగితే, సహజంగానే దర్శకుడు బాబీ హాజరవుతాడుగా… వచ్చాడు… ఆయన రవితేజ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు మాత్రమే చెప్పాడు… ఎన్టీఆర్ పేరు చెప్పలేదు… జూనియర్‌తో `జైలవకుశ` సినిమా చేశాడు… ఐనా సరే, ముగ్గురు హీరోల గురించి చెప్పి జూనియర్ పేరు స్కిప్ చేశాడు… కారణం… బాలయ్య ఆదేశాల్ని ఆహా టీం బాబీకి ముందు చెప్పడం..!
నిజమే… చంద్రబాబు వాడుకోవడానికి జూనియర్ కావాలి, కానీ తన రాజకీయ వారసుడు, తెలుగుదేశం భావి అధినేత లోకేష్ మాత్రమే… పొలిటికల్ యాంబిషన్స్, పాపులారిటీ, దూకుడు ఉన్న జూనియర్‌ను చేరదీస్తే, ప్రోత్సహిస్తే ఏకు మేకవుతాడు… సో, నో జూనియర్, వోన్లీ లోకేష్…
లోకేష్ తన సొంత అల్లుడు కాబట్టి పొలిటికల్ కోణంలో జూనియర్‌ను బాలయ్య ఏమాత్రం ఇష్టపడడు, దగ్గరకు రానివ్వడు… అలాగే ఎన్టీఆర్ పోలికలతో ఉన్న జూనియర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో స్టార్ అయిపోయాడు, ఆ నటన ప్రతిభ కూడా బాగా ఉంది… అయితే గియితే తన తరువాత ఎన్టీఆర్ నటవారసుడు తన కొడుకు మోక్షజ్ఞ కావాలే తప్ప జూనియర్ ఎవరు అనేది బాలయ్య ఫీలింగ్…
హరికృష్ణ కుటుంబం, అంటే తన కుటుంబం కాబట్టి జూనియర్ వాళ్లతో బాగా ఉంటున్నాడు తప్ప మిగతా నందమూరి కుటుంబసభ్యులతో ప్రస్తుతం తనకు సత్సంబంధాలు ఏమీ లేనట్టున్నాయి… సో, బాలయ్య అసహనానికీ, ఆగ్రహానికీ కారణాలున్నాయి… మానవ సహజ కారణాలు… అసాధారణం ఏమీ కాదు..!!
Share this Article