ఆహాలో అన్‌స్టాపబుల్ రియాలిటీ షో మొదట్లో సూపర్ హిట్… నో డౌట్… బాలకృష్ణ వంటి స్టార్, వెటరన్ హీరో హోస్ట్ చేయడంతో ఆ క్రేజ్ వచ్చింది… ఆ చాట్ షో మొదట్లో సరదాగా సినిమా సెలబ్రిటీలతో సాగింది… ఎప్పుడూ ఫ్యాన్స్‌ను కొడుతూ, తిడుతూ… బ్లడ్డు, బ్రీడు కామెంట్లతో… ఓ తరహాలో కనిపించే బాలకృష్ణను మరో కోణంలో ఆవిష్కరించింది ఆ షో…
మొదటి రెండు సీజన్లూ పర్లేదు… ఒకటీరెండు సినిమా ప్రమోషన్ల కోసం ఒక్కో ఎపిసోడ్ కూడా ప్రసారం చేశారు… కానీ ఎప్పుడైతే చంద్రబాబును, లోకేష్‌ను పట్టుకొచ్చి పొలిటికల్ చాట్ మొదలుపెట్టాడో… అక్కడి నుంచి ఆ షో దారి తప్పింది… చిత్రమైన కాంబినేషన్లతో గెస్టులను పిలుస్తూ మరింత చిరాకు తెప్పించారు ఆహా క్రియేటివ్ టీం సభ్యులు…
బాలకృష్ణ పిలిస్తే కాదనలేక, ఇలాంటి చాట్ షోలకు వెళ్లని స్టార్లు కూడా కొందరు తప్పనిసరై వచ్చారు… తరువాత షో మీద తెలుగు సినిమా సెలబ్రిటీలకు ఆసక్తి తగ్గిపోయింది… ఈలోపు సుడిగాలి సుధీర్ సర్కార్ ఆగిపోయింది… కామెడీ సర్కస్ సీజన్ అయిపోయింది… తెలుగు ఇండియన్ ఐడల్ షో గత సీజన్‌ను చెడగొట్టారు… మరే రియాలిటీ షో లేదు… ఇప్పుడు అర్జెంటుగా ఆహా ఓటీటీకి మళ్లీ అన్‌స్టాపబుల్‌ను తెర మీదకు తీసుకురావాలనే ఇంట్రస్టు, అవసరం పెరిగింది…
Ads
అల్లు అరవింద్ కోసమే ఈ షో కంటిన్యూ చేస్తున్నాను అన్నాడు బాలకృష్ణ ఎక్కడో… నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ అల్లు అర్జున్‌తోనే స్టార్టవుతుందీ అని వార్తలు… షూటింగ్ కూడా అయిపోయిందట… దుల్కర్ సల్మాన్ గెస్టుగా మరో ఎపిసోడ్ కూడా అయిపోయిందట… ఈనెల 24 నుంచి షో నాలుగో సీజన్ స్టార్ట్ అన్నారు… బాలకృష్ణ మళ్లీ తన బావ, ఏపీ సీఎంతోనే మళ్లీ ఈ సీజన్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాడు…
అల్లుడు లోకేష్ సరేసరి… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వస్తే… షో మొదటి రెండు భాగాలు వీళ్లతోనే నడిపిస్తే అదిరిపోతుందని అనుకున్నారు ఆహా ప్లస్ బాలకృష్ణ… పవన్ కల్యాణ్ మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించకపోయినా చివరకు వస్తాను అన్నాడట… ఈరోజు షూట్ స్టార్ట్ చేస్తున్నారట… ఏముందీ..? అవే పాలిటిక్స్, ఏవో ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రత్యేక కథనాల్లా ఉంటాయేమో… ఆ తరవాతే అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్… అవునూ, అల్లు అర్జున్ గెస్టుగా వచ్చే చాట్ షో ఎపిసోడ్‌లో… పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ నడుమ వివాదం గురించి బాలకృష్ణ అడిగి ఉంటాడా..? ప్చ్, పవన్ కల్యాణ్‌ను చంద్రబాబుతో గాకుండా అల్లు అర్జున్‌తో కలిపి కూర్చోబెడితే కథ బాగా రక్తికట్టేదేమో..!!
Share this Article