Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా పాటలో కృష్ణను ఎన్టీయార్ ఆవహించేస్తాడు… కాంచనను కూడా…!!

February 1, 2024 by M S R

Subramanyam Dogiparthi……   1968 లో వచ్చిన ఈ నేనంటే నేనే సినిమాలో కృష్ణ , కాంచనలకు పాటల షూటింగులో NTR ఆవహించాడు . గుంతలకిడి గుంతలకిడి గుమ్మా పాటలో మాట వీర పాపులర్ ఆరోజుల్లో . ఈ పాటలో కృష్ణ కాంచన పిర్రల్ని వాయించి వదలి పెట్టాడు . చివర్లో కాంచన కూడా కృష్ణ పిర్రల్ని వాయించేసింది . కృష్ణ , కాంచన ఇద్దరూ నటనా విహారం చేసారు . చాలా ఎనర్జిటిక్ గా , చలాకీగా నటించారు . బాగా ఆడటమే కాకుండా , కృష్ణకు పాపులారిటీని పెంచింది .


ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నాగభూషణం తల్లి , కొడుకు ద్విపాత్రాభినయం . ఫుల్ లెంగ్త్ లేడీ పాత్ర నాగభూషణం తప్ప మరెవరూ వేసి ఉండరు . మాట్లాడితే గరిటతో డొక్కలో పొడుస్తా అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా పట్టింది . జనానికి ఊతపదం అయింది కూడా . కృష్ణంరాజు నెగటివ్ పాత్రలో కనిపిస్తారు . ఈ పాత్ర వేయటానికి తటపటాయిస్తుంటే కృష్ణనే కన్విన్స్ చేసి వేయించారట .
1967 లో రిలీజయిన నాన్ అనే తమిళ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాను తీసారు . తమిళంలో రవిచంద్రన్ , జయలలిత లీడ్ రోల్సులో నటించారు . తర్వాత హిందీలో కూడా వారిస్ అనే టైటిల్ తో జితేంద్ర , హేమమాలిని , ప్రేమ చోప్రాలు లీడ్ రోల్సులో నటించారు . మూడు భాషల్లోనూ సక్సెస్ అయింది .

కృష్ణ , కాంచన , కృష్ణంరాజు , శ్రీరంజని , నాగభూషణం , చంద్రమోహన్ , సంధ్యారాణి , సూరేకాంతం , కె వి చలం , రావి కొండలరావు , రాధాకుమారి , రామచంద్రరావు , నెల్లూరి కాంతారావు ప్రభృతులు నటించారు . అల్లూరి సీతారామరాజు , అసాధ్యుడు వంటి కృష్ణ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి రామచంద్రరావే ఈ నేనంటే నేనే సినిమాకూ దర్శకులు .

Ads

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . చాలదా ఈ చోటు, రాదులే ఏ లోటూ… , నువ్వే నువ్వే నన్ను చేరుకోవా… , భలె భలె నరసింసింహస్వామినిరా, నిన్నూ నంచుకు తింటునురా… , ఒకే ఒకా గులాబిపై వాలిన తుమ్మెదలెన్నో… , అంబవో శక్తివో పాటలు బాగుంటాయి . పేరడీ పాట సరదాగా ఉంటుంది .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడింది . రెండు మూడు సార్లు చూసి ఉంటా . ఈమధ్యనే టి వి లో కూడా ఏదో చానల్లో చూసా . యూట్యూబులో ఉంది . మంచి కాలక్షేపం సినిమా . కొసమెరుపు నాగభూషణం సి ఐ డి ఆఫీసర్ అనే రగస్యం చివర్లో తెలుస్తుంది . ముందే చెపుతారా ఏంటి !!

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugucinema #TeluguCinemaNews #telugureels

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions