Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీట్ మీద దుమార ప్రచారంలో స్పీకర్ బిర్లా బిడ్డనూ లాగుతున్నారు..!!

June 29, 2024 by M S R

సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది… అదేమిటంటే..? లోకసభ స్పీకర్ బీఎం బిర్లా చిన్న బిడ్డ అంజలి బిర్లా గురించి… ఆమె ఒక మోడల్ అట… హఠాత్తుగా యూపీఎస్సీ (సివిల్స్)కు హాజరైందట, దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాసైపోయి ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖలో కొలువు చేస్తోందట…

‘ఇదంతా చదివితే ఆమె ఇంటలిజెంట్ అనిపిస్తోంది కదా’… అని ముగించి… అబ్బే, ఇది నీట్ స్కామ్, పేపర్ లీక‌తో సంబంధం లేని వార్త సుమా… అని చివరలో చిన్న ట్విస్టు… ఇదంతా ఓ నెగెటివ్ క్యాంపెయిన్… నీట్ విషయంలో బీజేపీ ప్రభుత్వం దొరికిపోయింది కదాని ఇక అందరినీ బదనాం చేసే ప్రచారం… మొన్న ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలకు ఎక్కువ సీట్లు వచ్చి, బీజేపీకి తక్కువ సీట్లు వచ్చేసరికి ఇదుగో ఈ తరహా ప్రచారం…

Anjali birla

Ads

Meet Anjali Birla, Daughter of Om Birla.. She started her career as a model & then suddenly she appeared for UPSC and cleared the toughest exam of this country in her first attempt and is now working in the Ministry of Railways. Looks like she is very intelligent..  PS: This tweet has nothing to do with NEET_SCAM & PaperLeak..


ఇదొక దుష్టపన్నాగం గాకపోతే… ఆమె 2019 బ్యాచ్… 12 స్టాండర్డ్‌లో డిస్టింక్షన్… కోటాలో ఐఏఎస్ శిక్షణ తీసుకుంది… కావాలనే సైన్స్ గాకుండా ఆర్ట్స్ తీసుకుంది ఐఏఎస్ కోసమే… తల్లి డాక్టర్, అక్కడ సీఏ… రోజుకు 10 గంటలు కష్టపడింది… నీట్, ఎట్సెట్రా ఎగ్జామ్స్ సరే, యూపీఎస్సీ లీకుల గురించి ఎప్పుడూ వినలేదు… మరెందుకు తాజా నీట్ లీకులతో ఆమెను అవమానించడం..?

నీట్ వేరు, యూపీఎస్సీ వేరు… నిజానికి అప్పట్లోనే ఆమె మీద బోలెడు విమర్శలొచ్చాయి… కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు కావాలనే ఆమె మీద క్యాంపెయిన్ రన్ చేశాయి… అసలు ఎగ్జామ్స్ కూడా రాయకుండానే యూపీఎస్సీ క్రాక్ చేసిందంటూ…! అదెలా సాధ్యం..?

Anjali birla

సరే, స్పీకర్ బిడ్డ కదా, ఇంటర్వ్యూల్లో ఏవో రాగద్వేషాలు చూపించారు అనుకుందాం, కానీ మెయిన్స్ ‌లో ఆమెకు వచ్చిన మార్కుల్ని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది… అప్పట్లోనే తన విమర్శల మీద సమాధానం ఇస్తూ… ‘‘నన్ను అవమానించండి, నా తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి తప్పదు అనుకుంటాను, కానీ యూపీఎస్సీని అవమానించడం దేనికి..? మెరిట్‌ను అవమానించడం దేనికి..?’ అని బదులిచ్చింది ఆమె…

అప్పట్లో రిజర్వ్ కోటా కింద 89 మందిని ప్రకటించారు, అందులో ఈమెది 67వ ర్యాంకుగా చూపించారు అనేది విమర్శ అప్పట్లో… కానీ రిజర్వ్‌డ్ కోటా వేరు, ఈ రిజర్వ్ కోటా వేరు… మెయిన్ లిస్టు వేరు, రిజర్వ్ కోటా లిస్టు వేరు… ఇక్కడ రిజర్వ్ కోటా అంటే సెకండ్ మెరిట్ లిస్టు… ఐనా ఆమె రిజర్వ్‌డ్ కేటగిరీ కూడా కాదు… సరే, ఈ చర్చ లోతుల్లోకి వెళ్లడం లేదిక్కడ… కానీ నీట్, యూజీసీ పరీక్షపత్రాల లీకేజీలకు నాటి యూపీఎస్సీ పరీక్షలకూ లింకేమిటి అసలు..?

నెగెటివ్ క్యాంపెయిన్ చేసేవాడికి నిజానిజాలతో సంబంధం ఉండదు, జస్ట్, అలా బురద జల్లేస్తాడు… కడుక్కునే బాధ్యత బాధితుడిది… అప్పట్లో సెన్సిటివ్‌గా ఫీలయిన అంజలి బిర్లా ఏదో సమాధానాలు చెప్పుకుంది కానీ… ఇప్పుడు ఇలా నీట్ లీకేజీతో లింకు పెట్టి బదనాం చేస్తే… సింపుల్… నవ్వి వదిలేస్తుంది… అదే చేస్తోంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions