ఒక చిన్న డిస్‌క్లెయిమర్… పార్టీలు, నాయకులు తెర మీద మాత్రమే డిష్యూం డిష్యూం… తెరవెనుక అవసరాన్ని బట్టి కౌగిలింతలు, స్నేహాలు… ఎప్పుడూ సగటు వోటరే బకరా… వాడికి తెలిసిందేమీ నిజం కాదు… నిజాలేమీ తెలియనివ్వరు…
నిజానికి ఫలానా పార్టీ మా మిత్రపక్షం… అని వోట్లు అడుక్కుంటారు కదా ఏ ఎన్నికల్లోనైనా… అంటే దోస్తీ అనేది ఓ పాజిటివ్ ప్రచారం, పనికొచ్చే అంశం… వోట్ల లబ్ధికి ఉపయోగపడే ఫ్యాక్టర్… కానీ గ్రేటర్ ఎన్నిక రూటే వేరు… ‘‘ఎహె, వాడు నా దోస్త్ కాదు’’ అని డిస్ ఓన్ చేసుకోవడం… ‘‘అబ్బే, వాళ్లిద్దరూ దోస్తులే’’ అంటూ బురదజల్లడం కనిపిస్తోంది… ఇక్కడ దోస్తీ అనేది నెగెటివ్ పాయింట్‌గా చిత్రితమవుతోంది… ఎలాగంటే..?
బీజేపీ, జనసేన దోస్తులే… కానీ అంత బహిరంగంగా ప్రచారం చేసుకోనక్కర్లేదు… ఎందుకు..? పవన్ కల్యాణ్ తెలంగాణ ద్వేషి అని తెలంగాణ జనంలో ఏర్పడిన భావన… అందుకని పదే పదే పవన్ మా దోస్త్ అని చెప్పుకుంటే ఎదురుతన్నే ప్రమాదముంది… అదేసమయంలో సిటీలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం చెప్పుకోవాలి… కాపు, సెటిలర్స్ వోట్లు కావాలి కదా…
Ads
టీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీ అందరికీ తెలుసు… కానీ ఈ ఎన్నికల్లో దోస్తులం కాము అని చెప్పుకోవాలి… నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను నిన్ను తిట్టినట్టు చేస్తా… వీళ్లిద్దరూ ఒకటే అంటూ బీజేపీ చేసే ప్రచారాలకు టెంపరరీ విరుగుడు అన్నమాట… ఎస్, మజ్లిస్ మా దోస్తు పార్టీయే, సోవాట్ అని ఎందుకు చెప్పుకోవడం లేదు గతంలోలాగా..? నో, ఈ ఎన్నికల్లో అది నష్టం చేస్తుంది కాబట్టి, తాత్కాలికంగా కటీఫ్… అదేదో అంటరాని పార్టీ అయినట్టుగా…
… మేం ఎవరినైనా కూల్చగలం, కుర్చీ ఎక్కించగలం, ఆఫ్టరాల్ కేసీయార్, మేం తలుచుకుంటే రెండు నెలల్లో ఫసాక్ అని మజ్లిస్ ఎమ్మెల్యే అన్నాడంటే… అది తెర మీద డిష్యూం డిష్యూం ఫేక్ పోరాటమే…
మొన్నటి ఎన్నికల దాకా కాంగ్రెస్, తెలుగుదేశం దోస్తులు… కలిసి ప్రచారం చేసుకున్నారు… కానీ ఇప్పుడు కథ వేరు… కాంగ్రెస్ పేరు చెబితేనే కంపరం చంద్రబాబుకు… అవసరార్థం స్నేహాలు, వైరాలు… ప్రస్తుతం తెలుగుదేశానికి తెర వెనుక ఏ దోస్తులూ లేరు, తెర ముందూ లేరు… అసలు ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉండీలేనట్టు… అచ్చం, జగన్ పార్టీలాగే… సో, వాళ్ల దోస్తీ ఎవరితో ఎలా ఉన్నా ఎవరికీ ఏమీ ఫికర్ లేదు…
మరి కాంగ్రెస్… ఏం చెప్పుకోవాలి… మేం దోస్తులం కాదు మొర్రో అని టీఆర్ఎస్, మజ్లిస్ ఓ ఉత్తుత్తి ఫైట్ నటిస్తున్నాయి… కానీ మజ్లిస్‌ను ఏమీ అనలేదు కాంగ్రెస్… అలా అంటే మరి సెక్యులర్ పాతివ్రత్యం మంటకలిసిపోతుంది కదా… అందుకని టీఆర్ఎస్, బీజేపీని తిట్టాలి… ఏమనీ..?
మీరూ మీరూ ఒకటేరోయ్, ఏదో జనాన్ని మభ్యపెట్టడానికి బయట తిట్టుకుంటున్నారు అని మరోరకం పాట అందుకుంది… ఇలా…
…. నిజంగా బీజేపీకి అంత దమ్ముంటే కేసీయార్ మీద కేసులేవీ..? చర్యలేవీ..? తెర వెనుక దోస్తానా… తెర ముందు దుష్మనీయా..? ఛల్ హట్, ఆపేయండి అని హూంకర్తిస్తున్నాడు రేవంతుడు… బీజేపీలోకి పోతుందో లేదో, కాంగ్రెస్‌లోనే ఉంటుందో లేదో, అసలు తనది ఇప్పుడు ఏ పార్టీయో తెలియని విజయశాంతి కూడా అదే చెబుతోంది… టీఆర్ఎస్-బీజేపీ సయామీ ట్విన్స్ అని సర్టిఫికెట్టు కూడా ఇచ్చింది… ఏదోలెండి… కాంగ్రెస్‌కు ఓ ఎజెండా లేదిప్పుడు… ఏదో ఒకటి, ఆరోపించుకోనివ్వండి ఫాఫం…
ఒక బీహార్, ఒక మధ్యప్రదేశ్, ఒక మహారాష్ట్ర… రేప్పొద్దున బెంగాల్… వేరే రాష్ట్రాలయితే ఒక విమర్శ ఏదో ఒకవైపు నుంచి వినవచ్చేది… ఏమిటంటే..? అసలు మజ్లిస్, బీజేపీ నిఖార్సయిన దోస్తులు అని…! బీజేపీ ప్రయోజనాల కోసమే మజ్లిస్ పోటీలు పెడుతూ ఉంటుంది, వోట్లు చీలుస్తుంది, సాయం చేస్తుంది అని…! కానీ గ్రేటర్ సిట్యుయేషన్ వేరు కదా… ఆ విమర్శలు ఇక్కడ పనికిరావు… సో, ఆ దోస్తీ ఆరోపణలు ఇక్కడ కుదరవు… సో, ఇదీ… పార్టీల దోస్తానాలు, అవసరార్థం టెంపరరీ ఫేక్ ఫైటింగుల కథ… ష్… చాటుమాటుగా పార్టీలకు సహకరించే ప్రత్యర్థి పార్టీ నాయకుల సంగతి తరువాత ఎప్పుడైనా చెప్పుకుందాం… అనగా కోవర్టు దోస్తీ కథలు…!!
Share this Article