.
మునుపెన్నడూ లేని వ్యతిరేకత అల్లు అర్జున్ మీద కమ్ముకుంటోంది… అది పుష్ప-2 సినిమాకు సంబంధించి… పనిలోపనిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వ్యతిరేకతలో కొంత తనూ మూటగట్టుకుంటోంది…
అబ్బే, చిన్న విషయం, తెలంగాణ ప్రభుత్వం మీద ఇదేం పనిచేస్తుంది అనేవాళ్లూఉంటారు… నో, చిన్న చిన్న అసంతృప్తులు, వ్యతిరేకతలే అక్యుములేట్ అవుతాయి…
Ads
1) సన్నీ లియోన్ ప్రోగ్రాం రద్దు చేసిన పోలీసులు పుష్ప-2 ప్రిరిలీజ్ ఫంక్షన్ కోసం సాగిలబడుతున్నారు… ఇదేం న్యాయం..?
2) ట్రాఫిక్ ఆంక్షలు… భారీగా పోలీసులు మొహరింపులు… బందోబస్తు… ఏ జనహిత కార్యక్రమం కోసం ఈ పాట్లు..? ఎందుకీ సాగిలబాట్లు..?
3) ఇంకా నయం… పరేడ్ గ్రౌండ్స్‌లో జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు… ఒకరిద్దరు మంత్రులు కూడా వస్తామని చెప్పలేదు… సంతోషం…
బన్నీ మొన్నటి ఎన్నికల్లో ఎవరో తన దోస్త్, వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లాడు… అది మెగా క్యాంప్ కోపం… పైగా తను మెగా క్యాంప్ అయిఉండీ జనసేన పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేయలేదు, పట్టించుకోలేదు…
అసలు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కూ బన్నీ ఫ్యాన్స్‌కూ నడుమ చాన్నాళ్లుగా ఏదో కనిపించని వైరం ఉండేది… ఇప్పుడది బహిరంగంగా పెద్దదయిపోయింది… చిరంజీవి బావమరిది కొడుకును ఐనంతమాత్రాన నేను మెగా క్యాంపా..? నాది అల్లు క్యాంప్, సొంతంగానే ఎదుగుతాను, అసలే పాన్ ఇండియా స్టార్‌ను అనే ధోరణి బన్నీలో కనిపిస్తోంది…
ఆ మెగా మర్రి నీడ నుంచి బయటపడే ప్రయత్నాలు… ఇప్పుడు పుష్ప-2 సినిమా మీద మెగా ఫ్యాన్స్ ఫుల్లు వ్యతిరేకతను స్ప్రెడ్ చేస్తున్నారు… బాయ్‌కాట్ పుష్ప-2 క్యాంపెయిన్ ఫుల్లు నడుస్తోంది…
నెటిజనుల్లో చర్చ జోరుగా సాగుతోంది… అది ఎక్కడి దాకా వెళ్లిందంటే… బన్నీ భార్య రెడ్డి (స్నేహలతారెడ్డి), బన్నీ రెడ్డింటి అల్లుడు, సో వైసీపీ మనిషి… మనకు పడదు… మనం బన్నీ సినిమాలు చూడొద్దు… ఇలాంటి వ్యాఖ్యల దాకా వెళ్లింది…
ఏపీ అంటే అంతే కదా… ప్రతిదీ కులానికే లింకు… ఆ సినిమా ఇన్నేళ్లుగా ఆగీ ఆగీ… బోలెడు రీషూట్లు కూడా చేయించుకుని… హీరోకు దర్శకుడికీ గ్యాప్… దర్శకుడికీ సంగీత దర్శకుడికీ గ్యాప్… కొత్త సంగీత దర్శకుల ఎంట్రీ… దాదాపు మూడున్నర గంటల సినిమా నిడివి… అన్నీ అసాధారణమే…
గతంలో ఏ సినిమాకూ లేనంతగా రేట్లను, షోలను పెంచింది తెలంగాణ ప్రభుత్వం… అరాచకం… వారం పది రోజులు కాదు, అంతకుమించి, ఎంత రేట్లయినా పెట్టుకో, ఎంతయినా దోచుకో… అంత ఖర్చు ఎవడు పెట్టమన్నాడు..? ప్రేక్షకుల మీద ఇంతగా ఎందుకు రుద్దాలి అనే వ్యతిరేకత మరోవైపు ఎక్కువైంది…
అవును, అంతే రేట్లు… సరికాదు అనుకుంటే మీ ఇష్టం, ఎవడు చూడమన్నాడు అనే వ్యాఖ్యలూ కనిపిస్తున్నాయి… సినిమా సక్సెస్ అవుతుందేమో, వందల కోట్లు వస్తాయేమో… ఆ క్రేజ్ ఉంది బన్నీ మీద… కానీ జరుగుతున్న పరిణామాలు, ప్రబలుతున్న వ్యతిరేకత ఇండస్ట్రీకి మంచిది కాదు… తెలంగాణ ప్రభుత్వానికీ మంచిది కాదు… అది అర్థమయ్యే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు..!!
Share this Article