తెలుగు సినిమా జర్నలిజాన్ని ఆ కొత్త హీరోయిన్ ఈడ్చి లెంపకాయ కొట్టింది… అసలే ఆమధ్య ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో ఒకాయన రాజమౌళి ఆహా, రాజమౌళి ఓహో అని కీర్తనలు పాడాడు కదా, అది కాస్తా వైరల్ అయిపోయి, నెటిజనం తిట్లపర్వానికి పూనుకోవడంతో మిగతా జర్నలిస్టులంతా తలలు దించుకున్నారు… ఇప్పుడు ఏమిటంటే..? డీజేటిల్లు అనే సినిమా వస్తోంది… అందులో జొన్నలగడ్డ సిద్ధు హీరో, నేహా శెట్టి హీరోయిన్… విమల్ కృష్ణ దర్శకుడు…
టీజర్ రిలీజ్ పెట్టుకుని బుధవారం మీడియాను ఆహ్వానించారు… ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడానికి నటీనటులు, ఇతర టెక్నికల్ సిబ్బంది రెడీగా ఉన్నారు… (సినిమా వాళ్ల మీడియా కష్టాలు ఎంత చెప్పినా తరగవు… ఫాఫం… అది ఓ పెద్ద కథ…) ఆ టీజర్లో హీరో హీరోయిన్ను నీకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నయ్ అనడగుతాడు… ఆమె 16 అని చెబుతుంది… అదొక సీన్…
ఓ జర్నలిస్టు (చాలా పెద్ద జర్నలిస్టు అట, అవార్డులు ఇస్తాడట, ఇండస్ట్రీ అంతా హడల్ అట, ఓ పెద్ద హీరోకు పీఆర్వోనట…) ‘‘హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా, రియల్‌గా తెలుసుకున్నారా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలున్నవో…’’ అని హీరోకు ఓ ప్రశ్న వేశాడు… అందులోని వెకిలితనం అర్థమైంది కదా… పైగా ‘‘హబ్బ, ఎంత గొప్ప ప్రశ్న వేశానో కదా’’ అన్నట్టు ‘‘సంతోషం’’గా మొహం పెట్టాడు…
Ads
ఆమె కన్నడ నటి… ఓ సంవత్సరం మిస్ మంగుళూరు, మరో సంవత్సరం మిస్ సౌతిండియా రన్నరప్… ఓ కన్నడ సినిమాలో కూడా నటించింది… తెలుగు రాదు, ఈ ప్రశ్న ఏమిటో అర్థం కాలేదు… సిద్ధూ మాత్రం ఇబ్బందిగా మొహం పెట్టి… ‘‘ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం సార్’’ అన్నాడు వినమ్రంగా… ఇది ఇక్కడే ముగిసిపోలేదు…
ఆ వీడియో ఈ ట్వీట్లో ఉంది చూడండి… సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… నెటిజనం నెగెటివ్‌గా రియాక్టయ్యారు… ఇక నెట్లో ట్రోలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా…
https://twitter.com/SaRath_Tweetss/status/1488847414329249794?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1488862525756088322%7Ctwgr%5E%7Ctwcon%5Es3_&ref_url=https%3A%2F%2Fwww.gulte.com%2Fmovienews%2F151383%2Fdj-tillu-heroine-blasts-at-journalist-for-his-insensitive-question
ఈ ప్రశ్న గురించి ఆమెకు ఎవరో కాస్త వివరంగా చెప్పినట్టున్నారు… బాగా హర్టయ్యింది… ఇండస్ట్రీలో అందరికీ లేడీ ఆర్టిస్టులంటే చీపే కదా… చివరకు జర్నలిస్టులకు కూడా…! ఏమీ అనలేదు, దాచుకోలేదు… ఓ ట్వీట్ పెట్టింది… ఇలా…
This question was very unfortunate at the trailer launch today. But I must go on to add that it simply simplifies the respect he has for himself and for the women force around him at his work place and at home. https://t.co/XRDdIXaOZL
— Neha Sshetty (@iamnehashetty) February 2, 2022
తెలుగు సినిమా జర్నలిజాన్ని ఈడ్చి చెంప మీద కొట్టినట్టుగా ఉంది… ‘‘ఆ ప్రశ్న దురదృష్టకరం… తన చుట్టూ పనిచేసే మహిళలు, ఇంట్లో మహిళలను తను ఎంత గౌరవిస్తున్నాడో సింపుల్‌గా చెప్పినట్టుగా ఉంది’’ అని రెండే వాక్యాల్లో ట్వీటింది… ఆమె రియాక్షన్‌కు నెటిజనం సానుభూతి, మద్దతు లభిస్తోంది… దర్శకుడికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు… నేహా సారీ అని ఆ ట్వీట్‌కు స్పందించాడు… మరి జర్నలిస్టులంటే మజాకా..?
అయితే ఇక్కడ వేంఠనే సినిమా జర్నలిస్టులందరూ ఘట్టిగా ఖోపం తెచ్చేసుకుని, ఆయ్ఁ అని ఆమె మీదో, సదరు నిర్మాత మీదో, దర్శకుడి మీదో ఎగబడకండి… కక్ష తీర్చుకోకండి, అసలే ఘొప్ఫ జర్నలిస్టంటున్నారు… ఇండస్ట్రీలో హడల్ అంటున్నారు… కానీ మిగతా జర్నలిస్టులు తమకు వెన్నుపూసలు ఉన్నాయని గుర్తుతెచ్చుకుని… ఈ విషయంలో ఆమెకు సపోర్టుగా నిలవండి…
అవసరమైతే తను ఏటా ఇచ్చే అవార్డుల్లో ఉత్తమ గ్రేట్ గొప్ప జర్నలిస్టు అవార్డు తనకే ఇచ్చుకొమ్మని చెప్పండి… సినిమా సంబంధీకులు ఎవరూ మాట్లాడరు, అందరి వెన్నెముకలూ వంగిపోయాయి కదా… ఇదీ ఆ టీజర్… (అన్నట్టు, ఈ జర్నలిస్టు కొమ్ముకాసే ఇండస్ట్రీ పెద్దమనిషి ఏమైనా స్పందించాడా..? అత్యంత దయార్ద్ర హృదయుడు కదా… పోనీ, ఇంకెవరైనా సంస్కారులు స్పందించారా..?)
Share this Article