Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్య మార్క్ దంచుడులోనూ మెరిసిన శ్రీలీల… కాజల్ శుద్ధ దండుగ పాత్ర…

October 19, 2023 by M S R

బాలయ్య సినిమా అంటే… సారీ, తెలుగు స్టార్ సినిమా హీరో అంటేనే… దంచుడు సినిమాలు కదా… దంచుడు అంటే ఏదో వింత ఆయుధం చేతబట్టి రౌడీలను దంచుడు మాత్రమే కాదు… ఆ దంచుడు అంటే నరుకుడు… నెత్తురు పారి, థియేటర్ కమురు కంపు వాసన రావల్సిందే… ముందే చెప్పాను కదా, నాట్ వోన్లీ బాలయ్య… కాకపోతే బాలయ్య ఇందులో అగ్రగణ్యుడు…

అదేదో చిరంజీవి సినిమాలో నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు అనే ఓ బూతు పాట ఉంటుంది… అక్కడ ఆ సందర్భంలో హీరోయిన్‌ను రొమాంటిక్‌గా దంచే పాట అది… ఇదే బాలయ్య మరో సినిమాలో దంచవే మేనత్త కూతురా అని ఓ హిట్ పాట… (అలాంటి పాటలే హిట్ అవుతుంటాయి ఎందుకో మరి)… అదీ దంచుడు పాటే… అవునూ, ఈ పాట రీమేక్ చేసి, బాలయ్య తాజా దంచుడు సినిమా నేలకొండ భగవంత్ కేసరిలో పెట్టారన్నారు… ఏమైందో మరి… ఆ దంచుడు కూడా యాడ్ అవుతే ఇంకాస్త దంచింగ్ ఎఫెక్ట్ వచ్చేది కదయ్యా అనిల్ రావిపూడీ…

బాలయ్య అలాంటి పాత్రలకే సూటవుతాడనేది కరెక్టు కాదు, తను అన్ని పాత్రలూ చేయగలడు, మెప్పించగలడు… ఎటొచ్చీ తనను కన్విన్స్ చేసి, ఆ పాత్ర వైపు నెట్టేయగలగాలి… దర్శకుడు అనిల్ రావిపూడి ప్రధానంగా కామెడీ కథల్ని బాగా డీల్ చేయగలడు… బాలయ్య మార్క్ ఊరమాస్ దంచుడును ఇంకాస్త పైకి ఎలివేట్ చేయగలిగేది బోయపాటి వంటి దంచుడు దర్శకులే… కానీ అనిల్ రావిపూడి ఎంతో కొంత ఇమేజీ ఎలివేట్ కసరత్తు చేశాడు కానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు…

Ads

మరీ వెటరన్ అయిపోయాడు బాలయ్య… అందుకని కాస్త డిఫరెంట్ కథను తీసుకున్నాడు… ఈమధ్య తెలంగాణతనం అద్దాలి కదా… అందుకని ఆదిలాబాద్ జిల్లావాసిగా చూపించి కాస్త తేడా తీసుకొచ్చాడు… ఎంతసేపూ ఆ రొడ్డుకొట్టుడు పిచ్చి కథలేనా, కాస్తయినా కొత్తదనం లేకపోతే వీరసింహారెడ్డికీ భగవంత్ కేసరికీ తేడా ఏముంది అనుకున్నట్టున్నాడు… ఓ జైలర్, ఓ బిడ్డ, ఓ విలన్… ఆ బిడ్డకు అనుకోని కారణాలతో హీరో గార్డియన్ అవుతాడు… చిచ్చా (కాకా, బాబాయ్) అని పిలుస్తుంది సెకండ్ హీరోయిన్… అంటే హీరో వెంబడి పిచ్చిగెంతులేసే రొమాంటిక్ సెకండ్ హీరోయిన్ కాదు… కథలో మరో ఫిమేల్ ప్రధాన పాత్రధారి…

ఆమెను ఆర్మీలో జాయిన్ చేయాలనేది హీరో లక్ష్యం, వెంటపడే విలన్… హీరోకూ వాడికీ పడదు… ఇలా ఓ కథ వండుకున్నాడు దర్శకుడు… కానీ పలుచోట్ల బోరింగ్ ప్రజెంటేషన్… అసలు బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి..? ఫస్ట్ నుంచే ఓ దంచుడు మూడ్ క్రియేటైపోవాలి… అది లేదు… అబ్బా, ఇలాంటి సినిమాల్ని ఎన్నాళ్లు చూస్తామయ్యా బాబూ అంటారా..? తప్పదు, ఆ సినిమాలే నడుస్తున్నయ్ మరి… అందులోనూ బాలయ్య… సో, కొద్దిగా డిఫరెంట్ కథను పెట్టుకున్నారు… కానీ అదే విలనీ… రొటీన్… అవే ఫైట్లు…

పేరుకు ఓ హీరోయిన్… బహుశా తెలుగు వెటరన్ హీరోలకు కుర్ర హీరోయిన్లు టైమ్ ఇవ్వరు కాబోలు… క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరిట ఇచ్చిన కాల్‌షీట్లను కూడా రద్దు చేసుకుంటారు… అలాంటి హీరోలకు కాజల్ ఒక్కతే కనిపిస్తోంది… ఆమెకూ అంతకుమించి ప్రయారిటీ రోల్స్ వచ్చే సీన్ కూడా లేదిప్పుడు… ఉందంటే ఉంది… కాస్త ఫన్, కాస్త కామెడీ, కాస్త లవ్… అంతే, నిజానికి ఈ సినిమా శ్రీలీలది… అనిల్ రావిపూడికి వరుసకు కోడలు అవుతుందట కదా… మంచి రోల్ ఇచ్చాడు తనకు…

ఏదో డాన్సులు బాగా చేస్తుంది, అందంగా, యాక్టివ్‌గా ఉంటుంది, ఇప్పుడు తన గాలి వీస్తోంది… వీలైనన్ని సినిమాల్ని ఒడిసిపట్టుకుని దుమ్మురేపుతోంది అని అందరూ అనుకుంటున్నారు కదా… కానీ తనలో మంచి నటి కూడా ఉంది… ఈ బాలయ్య సినిమాలో దత్తత బిడ్డ పాత్రను బ్రహ్మాండంగా వాడుకుంది… అనేక సీన్లలో బాలయ్యకు దీటుగా చేసింది… (ఆమె డాన్స్ వాడుకోకపోతే ఎలా అనుకుని ఏదో పాటలో గెంతులు కూడా వేయించారు ఆమెతో…)

బాలయ్యదేముంది..? ఇలాంటి పాత్రలు మంచినీళ్లు తాగినంత వీజీగా చేసేస్తాడు… పైగా బాలయ్య సినిమా అంటే దాదాపు ప్రతి సీనూ తన చుట్టే తిరుగుతుంది… బాలయ్య చేత, బాలయ్య కోసం, బాలయ్య వల్ల… అన్నట్టుగానే ఉంటయ్ బాలయ్య సినిమాలు… ఆ పరిమితుల్లో కూడా శ్రీలీల పాత్రకు ప్రయారిటీ ఉంది, బాగా చేసింది కూడా… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది బాలయ్య సినిమా మాత్రమే కాదు, శ్రీలీల సినిమా కూడా..!  చెప్పాల్సింది అర్జున్ రాంపాల్ గురించి… ఈ నేషనల్ అవార్డ్ విన్నర్, బాలీవుడ్ యాక్టర్‌ తెలుగులో ప్రవేశం దీంతోనే… బాలయ్యకు విలన్ అంటే ఓ రేంజ్ ఉండాలి… ప్చ్, ఆ పాత్ర అలా లేదు, రాంపాల్ నిల్ ఇంపాక్ట్… బాలయ్య ముందు తేలిపోయాడు…

థమన్ కాపీ ట్యూన్లయినా సరే ఈమధ్య బాగా పాపులర్… డీఎస్పీకి బలమైన పోటీ… అఖండలో తను ఇచ్చిన బీజీఎం వేరే లెవల్… బాలయ్య ఫ్యాన్ కదా, కష్టపడతాడు కాస్త… కానీ భగవంత్ కేసరిలో ఆ జోష్ కనిపించలేదు… ఇంతకీ సినిమా చూడొచ్చా అంటారా..? బాలయ్య మార్క్ అతిని భరించడం అలవాటైనవాళ్లు మాత్రమే వీజీగా చూసేయొచ్చు… శ్రీలీల కోసమైనా ఓసారి చూస్తాం అంటారా..? మీ ఇష్టం..! బిగ్‌బాస్ రతిక కూడా ఓ చిన్న పాత్రలో కనిపించింది… (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా…) అవునూ, బాలయ్య బాబు గారూ… ఇంత వయస్సొచ్చింది, అంతటి బలమైన సినీనేపథ్యం ఉంది, సుదీర్ఘమైన అనుభవం ఉంది, మస్తు సంపద సంపత్తి ఉంది… కాస్త డిఫరెంట్ పాత్రలు చేయలేవా..? నువ్వూ చిరంజీవి టైపేనా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions