Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనాతో నేపాల్‌కూ తలబొప్పి… ఆ రెండు హైడల్ ప్రాజెక్టులూ ఇండియా చేతికి…

September 1, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… చైనాది ఎంత విషకౌగిలో హంబన్‌తోట పోర్టుతో శ్రీలంకకు అర్థమైంది… నాసిరకం ఆయుధాలతో బంగ్లాదేశ్‌కు అర్థమవుతోంది… ఇప్పుడు నేపాల్‌కు కూడా అర్థమైపోయింది… చైనా అర్థంతరంగా వదిలేసిన రెండు విద్యుత్ ప్రాజెక్టుల పనుల్ని భారత్ కి ఇచ్చింది నేపాల్ ! నేపాల్ దేశం కోసం రెండు విద్యుత్ ప్రాజెక్ట్స్ ని నిర్మించమని భారత్ తో ఒప్పందం చేసుకున్న నేపాల్ ప్రభుత్వం…

హిమాలయ రాజ్యం అయిన నేపాల్ పశ్చిమ భాగంలో సేటి హైడ్రో పవర్ ప్రాజెక్టు [West Seti Hydropower Project] మరియు సేటి రివర్ హైడ్రో ప్రాజెక్ట్ [Seti River Hydropower Project] ల నిర్మాణం కోసం భారత్ కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ [National Hydro power Corporation [NHPC] మరియు ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ నేపాల్ [Investment Board Nepal ] ల మధ్య ఒప్పందం కుదిరింది ఆగస్ట్ 23 వ తేదీన…

నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ నేబ [Sher Bahudur Deuba ] సమక్షంలో రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. నేపాల్ కి సంబంధించి విద్యుత్ రంగం ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. 750 మెగా వాట్ల పశ్చిమ సేటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మరియు 450 MW సేటి రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు కలిపి మొత్తం $2.4 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అని అంచనా!

Ads

ఈ రెండు ప్రాజెక్టుల కోసం నాలుగేళ్ల క్రితమే చైనాకి చెందిన రెండు సంస్థలు సర్వే చేసి నేపాల్ ప్రభుత్వంతో MoU చేసుకున్నాయి. కానీ అప్పటి నుండి ఈ రెండు ప్రాజెక్ట్ లని మొదలుపెట్టడంలో పలు ఇబ్బందులు ఎదురవడంతో వాయిదాలు వేస్తూ వచ్చాయి. చివరకి ఈ రెండు ప్రాజెక్టులు మేము చేపట్టలేము అంటూ వెనక్కి వెళ్లిపోయాయి.

ఇప్పటికే నేపాల్ లో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన SJVL [Satluj Jal Vidyut Nigam] 900 MW విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నది. మరో 679 MW ప్రాజెక్ట్ ని గత సంవత్సరమే SJVL కి ఇచ్చింది నేపాల్ ప్రభుత్వం… భారత్ కె చెందిన మరో ప్రైవేట్ సంస్థ GMR నేపాల్ లోని అచ్చం, దాయిలేక్ మరియు సురక్హేట్ [Achham, Dailekh and Surkhet districts] జిల్లాలలో ఉన్న అప్పర్ కర్నాళీ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ [Upper Karnali Hydro Electricity project] లో నిమగ్నం అయిఉంది.

గత ఏప్రిల్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు నేపాల్ ప్రధానుల మధ్య జరిగిన చర్చలలో భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య విద్యుత్ రంగానికి చెందిన పలు అభివృద్ధి కి సంబంధించి ఒప్పందాలు జరిగాయి.

1. భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య విద్యుత్ రంగానికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి.

2. భారత్ లోని పవర్ గ్రిడ్ తో నేపాల్ పవర్ గ్రిడ్ ని అనుసంధానం చేస్తారు. దీని వల్ల గ్రిడ్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఎవరికి అవసరం అయితే వాళ్ళు ఉభయ దేశాల విద్యుత్ ని వాడుకోవచ్చు. దీనికోసం భారత్ మరియు నేపాల్ దేశాల సరిహద్దుల్లో విద్యుత్ లైన్లు వేయడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

3. నేపాల్ దేశంలోని హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులలో భారత్ పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల నేపాల్ లో ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్ ని ఉమ్మడి గ్రిడ్ ద్వారా భారత్ వాడుకోవచ్చు అలాగే నేపాల్ లో కనుక విద్యుత్ డిమాండ్ పెరిగితే అదే గ్రిడ్ నుండి భారత్ ద్వారా నేపాల్ విద్యుత్ వినియోగించుకుంటుంది.

4. విద్యుత్ ధరని మధ్యేమార్గంగా నిర్ణయిస్తాయి రెండు దేశాలు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేపాల్ భారత్ కి రూపాయలలో చెల్లింపులు చేసే వెసులుబాటుని ఇచ్చింది. ఇప్పటికే మన రూపే కార్డుని నేపాల్ ఆమోదిస్తున్నది. అలాగే మన UPI ని నేపాల్ వాడుతున్నది ఇప్పటికే. కాబట్టి చెల్లింపుల సమస్య ఉండబోదు. నేపాల్ కి డాలర్ రూపంలో ఉండే ఇబ్బందులు ఉండవు.

గత ఏప్రిల్ నెలలో రెండు దేశాల ప్రధానుల మధ్య జరిగిన ఒప్పందం మంచి ఫలితాలని ఇవ్వడం మొదలయ్యింది. ప్రధానంగా మన రూపే కార్డ్ ని నేపాల్ లో అనుమతించడం, అలాగే డిజిటల్ UPI ని నేపాల్ ఆమోదించడమే కాదు వాడుతున్నది కూడా… వీలున్నంత వరకు చైనాని పక్కన పెట్టె ప్రయత్నం చేస్తున్నారు మోడీ.. దీర్ఘకాలంలో కానీ వీటి ఫలితాలు ఏమిటో మనకి తెలుస్తాయి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions