Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…

September 10, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. NEPO KIDS … నేపాల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న విధ్వంసానికి కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే కాదు కారణం . అవినీతి , నిరుద్యోగం వంటి అంశాలే కాకుండా ఈ Nepo Kids ఇష్యూ కూడా .

నిన్నటిదాకా డొక్కు సైకిళ్ళ మీద , సెకండ్ హేండ్ స్కూటర్ల మీద తిరిగిన రాజకీయ నాయకుల పిల్లలు , ప్రభుత్వ అధికారుల పిల్లలు కొద్ది రోజుల్లోనే లక్షలు చేసే కార్లలో తిరగటం , క్లబ్బుల్లో పబ్బుల్లో గర్ల్ ఫ్రెండ్సుని బాయ్ ఫ్రెండ్సుని వేసుకుని తిరిగే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే మామూలు జనం కడుపులు కాలవా !? అదే/అదీ జరిగింది నేపాల్లో .

Ads

nepal
ఇండియాలో కూడా చూస్తుంటాం . ఓ అంటే ఢం రాదు , చీమిడి ముక్కేసుకుని బేకారుగా తిరిగే వాడి/దాని అయ్యో అమ్మో MLAనో , MPనో , మంత్రో కాగానే సంతానం హడావుడి అంతాఇంతా కాదు . వాళ్ళ చుట్టూ జనం . వాళ్ళ పుట్టినరోజులకు కేక్ కట్టింగులు , పెద్ద పెద్ద హోర్డింగులు , ఒకటేమిటి . ఊరంతా పండగే .

nepokids
ఉత్తరప్రదేశ్ లో చూసాం . ఓ మంత్రి గారి కుమారుడు అశీష్ మిశ్రా నిరసనకారుల మీదకు బండి తోలి చంపేసాడు . క్రికెట్ బేట్ పట్టుకోవటం కూడా చేతకానోడు క్రికెట్ బాడీలకు ప్రెసిడెంట్ అవుతాడు . వీళ్ళను మించిపోయారు పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు .

రాజకీయ ప్రతినిధుల పిల్లల్ని మించిపోయారు ఆఫీసర్ల పిల్లలు . కాలేజీల్లో , స్కూళ్ళల్లో వాళ్ళ దబాయింపులకు లిమిటే ఉండదు . లంచాల , అవినీతి డబ్బుతో Nepo kids కులుకుతుంటే మామూలు పిల్లలకు కడుపు కాలదా !? అదే కాలింది నేపాల్లో . లోహ గంటలు మోగుతున్నాయి . జాగ్రత్త పడండి పెద్దోళ్ళారా !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions