అప్పుడేం జరుగుతుందీ అంటే… సౌర్య ఆటోడ్రైవర్‌గా బతుకుతూ ఉంటుంది కదా… ఓసారి ఇద్దరు ముసలోళ్లు ఆటో ఎక్కడానికి వస్తారు… మొదట వాళ్లను సౌర్య గుర్తించదు… ఎప్పుడైతే వాళ్లు కార్తీక్, దీప అని గుర్తిస్తుందో అప్పుడు షాక్‌కు గురవుతుంది… బతికే ఉన్నారా అని విస్తుపోతుంది… వాళ్లేమో సౌర్యను గుర్తుపట్టరు… వాళ్లను కౌగిలించుకుని ఏడ్చేస్తుంది సౌర్య… తనెవరో చెబుతుంది… వాళ్లు షాక్… హిమను ద్వేషిస్తూ, ఇంటి నుంచి కోపంతో వచ్చానని చెబుతుంది…
‘‘మా కారు లోయలోకి దొర్లిపడింది, పడేముందు హిమను బయటికి నెట్టేశాం… తీవ్రంగా గాయపడి, స్పృహలోని మమ్మల్ని అక్కడి ఆదివాసీలు కొందరు గమనించి, తమ గూడెం తీసుకుపోయారు… అక్కడ ఓ ముసలాయన మూలికలతో వైద్యం చేశాడు… చాలా నెలలపాటు కోమాలోనే ఉన్నామట… ఎట్టకేలకు బతికిబట్టకట్టాం… కొన్నాళ్లకు గతం గుర్తొచ్చి, ఇంటికి బయల్దేరాం’’ అని జరిగిన కథ చెబుతారు వాళ్లు…
హిమను అకారణంగా ద్వేషించానంటూ సౌర్య పశ్చాత్తాపంలో నెత్తీనోరు కొట్టుకుంటుంది… తరువాత ముగ్గురూ కలిసి వాళ్ల ఇంటికి వస్తారు… సౌర్యకు ఎదురుపడలేక హిమ దాక్కుంటుంది… సౌందర్య కనిపించడంతో అమ్మా అంటూ కార్తీక్, అత్తయ్యా అంటూ దీప వెళ్లి బావురుమంటారు… అన్నీ వదిలేసి వెళ్లిన మోనిత కూడా తిరిగి వస్తుందేమో అంటుంది సౌందర్య… ఇదంతా విన్న హిమ బయటికి వస్తుంది… ఈలోపు ఓ యువకుడు అక్కడికి వస్తాడు…
Ads
తనను చూసి హిమ, సౌర్య ఇద్దరూ సిగ్గుపడిపోతారు… విషయం ఏమిటంటే… ఇద్దరూ ఆ ఒక్కడినే లవ్ చేస్తుంటారు… ఈ కథ ఇలా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది… మరికొన్ని వేల ఎపిసోడ్లు… ఛిఛీ, ఇదేం కథ, ఇలా ఉంటుందా..? అని తిట్టేయకండి… కార్తీకదీపంలో మలుపులు ఇక్కడ రాసి ఉన్నదానికన్నా చిల్లరగానే ఉన్నయ్… అసలు తెలుగు సీరియల్ అంటేనే ఏదో సీరియస్ ఇన్సిడెంట్ చూపించాలి… చివరకు ఎవరో కలగన్నట్టు చూపించాలి… ట్రెండ్…
తెలుగు సీరియళ్ల పైత్యానికి పరాకాష్ట కార్తీకదీపం… కారు ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డు మలుపుల్ని మించిన ట్విస్టులు… చెత్త కథనం… డైరెక్టర్, కథారచయితకు ఎప్పుడు ఏది తోస్తే అది సీరియల్లోకి తోసేయడమే… జనం నవ్వుతారురా బాబూ అంటే, నవ్వితే పాపులర్ స్టార్ హీరోల సినిమాల్ని మించి మాకు రేటింగ్స్ ఎలా వస్తున్నాయ్ అని ఎదురు ప్రశ్నిస్తారు… ఎస్, అందుకే ‘‘కార్తీకదీపం సీరియల్’’ అయిపోదు అని ‘‘ముచ్చట అప్పుడే తేల్చేసింది… పిచ్చిపిచ్చిగా డబ్బులు, యాడ్స్, రేటింగ్స్ వచ్చే సీరియల్‌ను అర్థంతరంగా ముగించడానికి వాళ్లేమైనా పిచ్చోళ్లా..!!
ఎస్, పైన చెప్పినట్టే కాదు, అంతకన్నా చిల్లర మలుపులతో కథ నడిపిస్తారు చూడండి… మహాభారతంలో ఎన్ని పాత్రలుంటయ్..? ఒకటీరెండు అటూఇటూ కార్తీకదీపంలో కూడా సేమ్.., అదే నిరుపమ్, అదే ప్రేమి, అదే శోభశెట్టి మళ్లీ సీరియల్లో కనిపిస్తే హాశ్చర్యపోకండి… నిజానికి ఒకప్పుడు ఈ సీరియల్‌ను టీవీ ఉన్న ప్రతి ఇల్లూ ప్రేమించింది, అభిమానించింది… అదే ప్రజలు ఇప్పుడు దానిపై జోక్స్ వేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, ఏ సీరియల్ మీద లేనంత నెగెటివిటీ ఆవరించింది…
బోలెడు మీమ్స్, పోస్టులు, జోకులు, కథనాలు… తెలుగు నెట్ ప్రపంచం కార్తీకదీపం మీద చురకల్ని భలే ఎంజాయ్ చేస్తోంది… ఇప్పటికే ప్రేక్షకులు చీదరించుకుంటున్న ఈ సీరియల్‌కు ఇకపైనా అలాగే రేటింగ్స్ వస్తాయా..? వేచిచూద్దాం… ఈలోపు కొన్ని మీమ్స్ చూసి నవ్వుకొండి… పర్లేదు, ఇవన్నీ తెలుగు నెటిజన్లు ఆల్రెడీ ఏదో ఓచోట చదివినవే… కాకపోతే ఒక్కచోట చూసి, చదివి, ఒకేసారి నవ్వేయండి… ఓ పనైపోతుంది…
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
Share this Article