Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్‌కు మరో సలహాదారు… పార్టీ నిర్మాణం కోసమట… ఇంతకీ ఎవరాయన..?!

September 6, 2024 by M S R

కొత్త సలహాదారుడు – కొత్త సబ్జెక్ట్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్. తెలుగు వాళ్లకు బాగా సుపరిచితమైన పదాలు. జగన్ గారు సీఎం అయిన తరువాత ఒక హద్దు లేకుండా “సలహాదారుల” నియామకాలు జరిగాయి.

నిన్న ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణం మీద వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డికి నమ్మకం ఉన్నట్లుగా గత ఏడు ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యంగా 2017 నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ పెట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేసిన తరువాత నుంచి అనిపించలేదు.

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు నియామకం వాటికి బాధ్యతలు, నెలనెలా పార్టీ కమిటీల సమావేశాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఏడాదికో రెండేళ్లకో పార్టీ ప్లీనరీ/మహాసభ జరపటం లాంటివి 2017 నుంచి 2024 మధ్య ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జరిగాయి. 2017 తరువాత మళ్ళీ 2022లో పార్టీ ప్లీనరీ జరిగింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, ప్లీనరీ జరపటం మరియు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటం ఎన్నికల సంఘం నిబంధనలలో ఒకటి. అలా జరపకుంటే గుర్తింపు రద్దు చేయటానికి అవకాశం ఉంది .

Ads

2022 ప్లీనరీలో ఎవరు సలహా ఇచ్చారో కానీ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్షడిగా ప్రకటించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సి. రాంచంద్రయ్య లాంటి సీనియర్లు ఉండి కూడా ఇలా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు ఏంటి అని ఆశ్చర్యపోయినా వారి సలహా తీసుకొని ఉంటారా?అనే అనుమానం కలిగింది. శాశ్వత అధ్యక్ష పదవిని ఈసీ గుర్తించం అని చెప్పటంతో దాన్ని తొలగించారు.

పార్టీ “నిర్మాణ” సలహాదారుడు
ఎన్నికల వ్యూహాకర్తలు, పొలిటిల్ స్ట్రాటజిస్ట్లు మాత్రమే పాపులర్ అయిన ఈ రోజుల్లో “పార్టీ నిర్మాణంలో అద్యక్షుల వారికి సలహాదారుగా (Advisor to Party President on Party building)” ఆళ్ల మోహన్ సాయి దత్ ని నియమించాము అని నిన్న సాయంత్రం వైసీపీ పార్టీ కేంద్రకార్యాలయం ఒక ప్రకటన చేసింది.

ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ ఎవరు అంటూ చాలా కాల్స్ వచ్చాయి, ఇతని గురించి గతంలో వినలేదు కానీ వీరి టీమ్ 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పనిచేసిన విషయం తెలుసు, దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. వీరి టీమ్ గతంలో ఢిల్లీ లెవల్లో బీజేపీ పెద్ద నాయకుడికి ఫీడ్ బ్యాక్ టీమ్ గా కూడా పనిచేసింది.

ఎవరీ ఆళ్ళ మోహన సాయి దత్?
చెన్నై ఐఐటీలో చదివిన ఆళ్ల మోహన్ సాయి దత్ కరోనా సమయంలో రెండేళ్ల పాటు నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల వ్యూహాలు, పథకాల అమలు, పర్యటన ప్లానింగ్ సమన్వయకర్తగా పని చేశారు.2024 ఎన్నికల ముందు టీవీ9లో ఎన్నికల విశ్లేషకుడిగా చాలా డిబేట్లలో పాల్గొన్నారు.

పార్టీ నిర్మాణం అంటే?
సింపుల్ గా చెప్పాలంటే కార్యకర్తలు, నాయకులూ, కమిటీలు, బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ.. ఈ విషయం మీద 2018లో ఒకసారి 2023 నవంబర్లో మరొకసారి పోస్ట్ రాసాను.

నిర్మాణం – ఆలోచనకు ఆచరణకు మధ్యలో అంతరం లేకపోవడమే నిర్మాణం, నిర్మాణాత్మకం. వ్యవస్థ, సంస్థ నడపడటంలో నిర్మాణాత్మక ఆలోచన, నిర్మాణాత్మక పనితీరు అత్యంత కీలకం. ఇంద్రధనస్సులా నిర్మాణాత్మక పని తీరు పెరిగే క్రమం మరియు తగ్గే క్రమం ఉంటుంది.
రాజకీయ వ్యవస్థలో నిర్మాణాత్మక పని తీరు క్రమంగా తగ్గుతూ స్వల్పకాలిక లక్ష్యాల కోసం తాత్కాలిక ప్రణాళికల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది, అంతిమంగా ఎన్నికల వేళ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రాటజీ అంటే మ్యాజిక్, స్ట్రాటజిస్ట్ అంటే మేజిషియన్ భావించేలా పరిస్థితి మారిపోయింది.

పార్టీ నిర్మాణంలో పునాదిలో క్యాడర్ దాని పైన స్థానిక నాయకత్వం దాని పైన అధిష్టానం పిరమిడ్ నిర్మాణంలో ఉంటే గెలుపు ఓటములకు సంబంధం లేకుండా పార్టీ స్థిరంగా ఉంటుంది, ఎన్నికలలో గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అలా కాకుండా పునాదిలో అగ్రనాయకత్వం, దానిపై మెట్టులో స్ట్రాటజీ దాని పైన స్థానిక నాయకత్వం దాని పైన క్యాడర్ ఉంటే ఆపార్టీ నిత్యం అస్థిరతతో సతమతం అవుతూ ఉంటుంది, గెలుపు అవకాశాలు తక్కువ.

వ్యాపారులే ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగటం మొదలైన తరువాత ఎన్నికలు కూడా ఈవెంట్ మాదిరి మారిపోయాయి. వందమంది కార్యకర్తల పేర్లు గుర్తుండవు, ద్వితీయశ్రేణి నాయకత్వ హార్దిక, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు పట్టదు. ఈ ధోరణే కొందరు సీనియర్ నేతల ఓటమికి కారణం.

మార్పు వస్తుందా?
సలహాదారులతో మార్పు వస్తుందా? అది కాలం నిర్ణయిస్తుంది కానీ అధినేతలు అనుకుంటే ఏ సలహాదారులు లేకున్నా మార్పు వస్తుంది. రాజకీయ నాయకులకు తెలియని అంశాలు ఏ సలహాదారుడికి తెలియవు. సలహాదారుడైనా, వ్యూహకర్త అయినా చేసేది పార్టీ బలాన్ని, అవకాశాలను streamline & channelization మాత్రమే.

జగన్ పార్టీ నిర్మాణం కోసం సలహాదారుడిని నియమించుకోవడం కొందరు ఢిల్లీ పెద్దలతో ఉన్న మొహమాటం వలనా లేకా నిజంగానే సలహాదారుడి అవసరం ఉంది అని భావించారా? ఆళ్ళ మోహన్ సాయి దత్ పని మొదలు పెట్టిన తరువాత తెలుస్తుంది…. ( శివ రాచర్ల )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions