పాత్రలు ఒక్కసారిగా పల్టీకొట్టడం అంటే ఇదే… అసలు ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే నేను, నేను లేకపోతే అది లేదు అనుకుని, జీతెలుగు వాడి కళ్లకు గంతలు కట్టి, అదిరింది అనే కాపీ కామెడీ షో స్టార్ట్ చేసి, ఏవేవో ప్రయోగాలు చేసి, చివరకు దాన్ని ఫ్లాప్ చేసి, సొంతంగా యూట్యూబ్ చానెల్‌కు పరిమితం అయిపోయాడు నాగబాబు… ఈ దెబ్బకు బజార్నపడిన కమెడియన్లను ఇప్పుడు కామెడీ స్టార్స్ పేరిట మాటీవీ ఓ కొత్త కామెడీ షో ద్వారా ఆదుకుంటోంది… శ్రీముఖి ఆడ తోపు, తిరుగులేదు అనుకుంటే, ఆ షోయే మాయమైపోయి, ఆమె ఇప్పుడు ఖాళీ… అదీ ఫేట్… అంతేకాదు… ఈటీవీ మల్లెమాల తిక్కకు, వికారానికి ఢీ షో నుంచి బయటికి వెళ్లిపోబడిన అదే వర్షణి ఇప్పుడు ఈ కొత్త కామెడీ షోకు ఎంచక్కా సింగిల్ యాంకర్ అయిపోయింది… అంటే అనసూయ, రష్మి టైపులో… నాగబాబు ఫెయిలైన టాస్క్, అదేనండీ రోజాను ఢీకొని, జబర్దస్త్ దాటి, నాణ్యమైన కామెడీ షోను అందించే టాస్క్‌ను ఇప్పుడు ఓంకార్ తీసుకున్నాడు… ఈ కొత్త ప్రోగ్రాం నిర్మాత తనే…
ఈ కామెడీ స్టార్స్ అనే షో ప్రోమో కొడుతున్నారు మధ్యాహ్నం నుంచి… ఈనెలాఖరు నుంచి ప్రసారం అవుతుంది ఇది… కాకపోతే ఆరేడు నెలలపాటు ఉంటుంది ఈ ఫార్మాట్లో, జనం స్పందన చూసి, ఏం చేయాలో నిర్ణయిస్తారు… విచిత్రం ఏమిటంటే..? ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు ప్రసారం చేస్తారట… నిజానికి ఇలాంటివి ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేస్తే రేటింగ్స్ బాగా వస్తాయి… మరి ఓంకారుడి ప్లాన్ ఏమిటో… తనే యాంకరింగ్ చేస్తూ, తనే నిర్మించే డాన్స్ ప్లస్ కూడా ఆదివారం ప్రైమ్ టైమ్‌లోనే… ఇక ఈ షో విశేషాలకు వస్తే… నానాటికీ నాన్ ఫిక్షన్ రేటింగ్స్ కేటగిరీలో చతికిలపడిపోతున్న మాటీవీ వాడికి దీనిపై బాగా హోప్స్ ఉన్నయ్… జీవాడి సరిగమపకు దీటుగా సుమతో మ్యూజిక్ ప్లస్, ఈటీవీ వాడి జబర్దస్త్‌కు దీటుగా కామెడీ స్టార్స్ అన్నమాట… అయితే అసలు విశేషం, మనం చప్పట్లు కొట్టదగిన విశేషం ఏమిటంటే..? అదిరింది షో కారణంగా బజారున పడిన కమెడియన్లకు కాస్త పని దొరికింది మళ్లీ… గుడ్…
Ads
ఈ షో అసలు విశేషాల్లోకి వెళ్తే… ఈటీవీ వాడి ఆస్థాన ఆర్టిస్టుగా మారిపోయిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఈ కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జి… తనతోపాటు పాత నటి మంజుల బిడ్డ, పాత హీరోయిన్ శ్రీదేవి కో-జడ్జి… ఫాఫం, తనను హీరోయిన్గా ప్రేక్షకుల యాక్సెప్ట్ చేయడం లేదంటూ బాధపడి, ఫీల్డు నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆమె ఈ జడ్జి పాత్రలో కాస్త కొత్తకొత్తగానే కనిపిస్తోంది… వర్షిణి సరేసరి… ఇందులో మూడు టీమ్స్… ఒకటి చమ్మక్ చంద్ర, రెండు అవినాష్, మూడు యాదమ్మరాజు బ్యాచ్… ఆషురెడ్డి, జోర్దార్ సుజాత తదితరులు కూడా కనిపిస్తున్నారు గానీ, ప్రధానంగా ఆకట్టుకున్నది కార్తీకదీపం హిమ… అసలు పేరు సహృద… ఎప్పుడూ ఏడుపుగొట్టు మొహంతో కనిపించే పాత్ర ఆ సీరియల్లో… కానీ ఈ పిల్లకు కామెడీ టైమింగ్ బాగున్నట్టుంది… పర్లేదు, ఈ ప్రొమోలో బాగానే కనిపిస్తోంది… నిజానికి సౌర్య పాత్రను పోషించే క్రితికను కూడా తీసుకొచ్చేయండి… మంచి జోడీ… ఇద్దరూ ఇద్దరే…
ఇక అసలు కథ చెప్పుకుందాం… ఈటీవీలో మల్లెమాల వాళ్లు కొత్త కొత్త కథలు పడుతున్నారు… ఆమధ్య సుధీర్‌ను ఓ స్పెషల్ నుంచి పక్కన పెట్టేశారు కదా… వర్షిణిని తీసేశారు… దాంతో హైపర్ ఆదికి కోపమొచ్చింది… తమను ఎవరు ప్రశ్నించినా తరిమేయడం మల్లెమాల టీంకు అలవాటు కదా… ఆదిని కూడా పక్కన పెట్టాలనుకున్నారు ఢీ షో నుంచి… పర్లేదు, నేను జబర్దస్త్ కూడా మానేసి పోతాను అని ఆది ఉల్టా ఝలక్ ఇవ్వడంతో మల్లెమాల టీమ్ అన్నీ మూసుకుని ఆది జోలికి పోకుండా వెనక్కి తగ్గారు… ఫాపం, ఆ ఝలక్ సుధీర్ ఇస్తే ఎలా ఉండేదో… ఢీ జడ్జిల స్థానంలో ఉన్న ప్రియమణి బదులు సంగీత కనిపిస్తోంది… ప్రియమణిని రీప్లేస్ చేయడం ఈమె వల్ల కాదు, కాదు, కాదు… పూర్ణను కూడా తీసేద్దాం అనుకుని ఎందుకో ఆగిపోయారు… సరే, ఇలాంటి మాటీవీ కామెడీ స్టార్స్ వంటి షోలు కాస్త క్లిక్ కావాలనే కోరుకుందాం… ఎందుకంటే, అదిరింది ఫ్లాప్., గాయబ్… ఆ జబర్దస్త్ మరీ నీచంగా, పేలవంగా, నాసిరకంగా మారిపోయింది… వేరే దిక్కులేదు కాబట్టి, అలవాటైన గంజాయి దమ్ములాగా ప్రేక్షకులు భరిస్తున్నారు… అందుకే కామెడీ స్టార్స్ వంటి షోలు కాస్తయినా సరే బాగుండాలని కోరుకోవడమే…!!
Share this Article