దేశమంతా మళ్లీ కరోనా అలర్ట్… కేరళలో చావులు కూడా… వేలల్లోకి పెరిగిన కొత్త కేసులు… అంటూ మీడియా మళ్లీ మొదలుపెట్టింది… అవగాహన కలిగించేది తక్కువ, అదరగొట్టేది ఎక్కువ… అప్పటి కోవిడ్ భీకర వైరస్‌కన్నా పెద్ద ప్రమాదకర వైరస్ మన మీడియా… నిజంగా JN1 అనే కొత్త వేరియంట్ మళ్లీ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందా..? ఓసారి చూద్దాం… Dr Prabhakara Reddy వెర్షన్ ఏమిటంటే…
** ఒమిక్రాన్ తమ్ముడు JN 1 …. అంతగా ఆందోళన పడవలసిన అవసరం లేదు**
కరోనా వైరస్ పాండమిక్ లో ఆఖరిగా ఓమిక్రాన్ వేరియంటు వచ్చింది.. అది BA 2.86.. దానికి కొన్ని మార్పులు కలిగి ఇప్పుడు JN.1 (BA 2.86.1.1) అనేది పుట్టుకొచ్చింది.. మొదట లక్సెంబర్గ్లో కనిపించి తర్వాత యూరప్, అమెరికా మిగతా కంట్రీలలో విస్తరించింది.. మన దేశంలో కేరళలో ఈ వేరియంట్ కేసు గుర్తించబడింది..
Ads
దీని పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ.. ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇది ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది ఇప్పుడే అంచనాలకు ఎవరూ రాలేరు.. ఇది గతంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వ్యక్తులకు మరియు టీకాలు వేసిన వ్యక్తులకు కూడా వ్యాధి సోకేలా చేస్తుంది… ఇది ఇంతకుముందు కరోనా మాదిరి ప్రభావం చూపిస్తుందని కానీ లేదా ఎక్కువ మందికి వస్తుందని కానీ ఎటువంటి ఆధారాలు లేవు..
వ్యాది తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది.. జ్వరం లేదా చలి దగ్గు, తలనొప్పులు,శ్వాస ఆడకపోవుట,
సర్ది లేదా ముక్కు కారటం, గొంతు మంట,
అలసట, మరియు రుచి లేదా వాసన కోల్పోవడం
తిమ్మిరి మరియు అతిసారం లక్షణాలు రావచ్చు..
COVID-19 ఉనికిలో ఉన్నంత కాలం, కొత్త వైవిధ్యాలు ఉద్భవించవచ్చని CDC నొక్కి చెప్పింది. అయితే, ఈ వేరియంట్లలో ఎక్కువ భాగం మునుపటి వాటితో పోలిస్తే చాలా చిన్న మార్పులను కలిగి వుంటాయి..
చాలా వరకు, ఈ కొత్త వేరియంట్లు పెద్దగా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపవు.
మాస్క్‌లు, శానిటైజర్‌లు, కోవిడ్ డ్రగ్‌లు, కోవిడ్ కు ఉపయోగించిన డయాగ్నొస్టిక్ టెస్టులు RTPCR, రాపిడ్ టెస్టులు దీనికి కూడా పనిచేస్తాయి.. . మీరు టీకాలు వేసుకున్నట్లయితే లేదా కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ ముందు మీకు వచ్చి ఉంటే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది.. కావున మీరిద్దరూ సురక్షితంగా ఉన్నారు.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
వైరస్ మీ వరకు వచ్చినా చిన్న సింప్టమ్స్ జలుబు మాదిరి వచ్చి పోతుంది…. మరో మహమ్మారి వచ్చే అవకాశం లేదు.. ఆందోళన చెందవలసిన అవసరం లేదు…
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Share this Article