ఒక విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను మెచ్చుకోవచ్చు… పుష్ప సినిమాలోని పాటలకు గాయకుల ఎంపిక తీరు… ఏదో డబ్ చేస్తున్నాం కదా, ఎవరైతే ఏమిటిలే అనుకోకుండా ఏ పాటకు ఎవరి గొంతు సూటవుతుందో కాస్త శ్రద్ధతో దృష్టి పెట్టి, ఎంపిక చేసి పాడించాడు… ఉదాహరణకు… ఊ అంటావా, ఊఊ అంటావా పాట ఇంద్రావతి గొంతులో అద్భుతంగా పలికింది… ఆమె వాయిస్ కల్చర్, ఆ పాట తీరు, ఆమె పాడిన తీరు, ఆ ట్యూన్ అన్నీ భలే సింకయ్యాయి… అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా అదే పాట…
అదే పాటను కన్నడంలో మంగ్లీ, తమిళంలో ఆండ్రియా, మలయాళంలో రెమ్య, హిందీలో కనికతో పాడించాడు… అందరివీ డిఫరెంట్ గొంతులు… మిగతా పాటలు కూడా అంతే… అయితే ఒక్క శ్రీవల్లి పాటను మాత్రం హిందీ మినహా మిగతా భాషల్లో సిధ్ శ్రీరాంతో పాడించాడు… ప్రేమ… ఆ ఊపుతో హిందీ కూడా పాడేసేవాడేమో, కానీ హిందీ ప్రేక్షకులు తిప్పికొట్టే ప్రమాదముందని చివరి క్షణంలో గ్రహించినవాడై జావేద్‌తో పాడించాడు… సరే, ఆ శ్రీవల్లి పాట దేశమంతా పాకింది…
ఎక్కడ చూసినా అదే పాట… మీమ్స్, స్పూఫ్స్, పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్లలో పాట మారుమోగిపోతోంది… అయితే దీనికి ఓ భిన్నమైన వెర్షన్ వచ్చింది… మేల్ వెర్షన్ బదులు ఫిమేల్ గొంతు… బెంగాలీలో…! ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ పాడింది… ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన వీడియో ఇంట్రస్టింగుగా ఉంది…
Ads
https://www.youtube.com/watch?v=wv8ozBEg-yY&t=1s
ఆమెది వెరయిటీ గొంతు… ప్రత్యేకించి పాప్, జాజ్, మాస్ తరహా పాటలకు ఫేమస్… నిజానికి అది కాదు చెప్పుకోవాల్సింది… 74 ఏళ్ల వయస్సులో కూడా అదే గొంతు… 40 ఏళ్ల క్రితంలాగే… ఏ తేడా లేదు… ఆ పాటకు సరిగ్గా సరిపోయింది… ఆ గొంతులో వినిపించే ఓరకం జీర పాటకు కొత్త ఆకర్షణను తెచ్చింది… గ్రేట్… కొందరుంటారు… మందిరా బేడీ, ఉషా ఉతుప్, మిథాలీ రాజ్… కొందరు ఇలాంటి వాళ్లకు వయస్సు అనేది నథింగ్… మొన్నమొన్నటివరకు ఎస్పీ బాలు, లతా మంగేష్కర్… అన్నట్టు అసలు తెలుగు పాట కూడా ఓసారి చూసేయండి… 30 కోట్ల వ్యూస్ నమోదయ్యాయట…
Share this Article