సుప్రీంకోర్టు ఏం చెబుతోంది… స్వలింగ వివాహాలను నేరంగా పరిగణించలేం అంటోంది… అలాగే ఇష్టమున్న వ్యక్తుల సంభోగాన్ని కూడా నేరంగా చూడలేం అంటోంది… స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377 ను కొట్టిపారేసింది కూడా… సేమ్, వ్యభిచారాన్ని తప్పుగా చూసే ఐపీసీ సెక్షన్ 497 ను కూడా కొట్టేసింది… ఈ రెండు సెక్షన్లు రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణాలకు వ్యతిరేకమనీ అభిప్రాయపడింది…
ఐనా ఇప్పటికీ వ్యభిచారం కేసులు పెడుతూ కాలర్లు ఎగరేస్తూనే ఉంటారు పలుచోట్ల పోలీసులు… అదేదో ఘనత సాధించినట్టు, దాన్నేదో ఆపేసినట్టు..! పైగా హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అని మీడియాలో రాతలు, కూతలు… ఏదో టెర్రరిస్టుల నెట్‌వర్క్ చేధించినట్టు ఫోటోలు, వీడియోలు… సరే, విషయానికొస్తే… వ్యభిచారం, స్వలింగ వివాహాలపై సుప్రీం వైఖరికి భిన్నంగా వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించే దిశలో అడుగులు పడుతున్నాయి…
సుప్రీందేముంది..? మనం చట్టాలే చేస్తే సరి అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటికే నేరస్మృతుల సవరణకు, ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత ముసాయిదా బిల్లులు ప్రవేశపెట్టింది కదా… అవి స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయబడ్డాయి కూడా… ఇప్పుడు ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే ఈమేరకు ప్రభుత్వానికి సూచించబోతున్నదట…
Ads
ఈ కమిటీకి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నాయకత్వం వహిస్తున్నాడు… ఆగస్టు నుంచే ఈ కమిటీ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంత బిల్లుల్ని అధ్యయనం చేస్తోంది… అది సిఫారసు చేయబోతున్న అంశాలు…
- స్వలింగ సంపర్కాలు, వివాహాలు నేరాలు..
- వ్యభిచారం శిక్షార్హమైన నేరం…
ఐతే ట్రాన్స్‌జెండర్లు, సేమ్ జెండర్ల నడుమ సంపర్కాన్ని బ్లాంకెట్‌గా నేరంగా ప్రకటించరట… సమ్మతి లేకుండా జరిగే సంభోగాన్ని మాత్రమే నేరంగా గుర్తిస్తారట… వాటితోపాటు మైనర్లలో సంపర్కం, ప్రకృతి విరుద్ధంగా జరిగే అసహజ సంపర్కాలను, అంటే జంతువులతో సంభోగాలను కూడా నేరాలుగా గుర్తిస్తారు…
సమగ్ర అధ్యయనానికి ఇప్పుడిచ్చిన గడువు సరిపోదని, దీన్ని పొడిగించాలని ఎంపీలు కోరుతున్నారు… నిజానికి ఈ గడువు నిన్నటితోనే ముగిసింది… కానీ చాలా కీలకమైన బిల్లుల అయినందున ఇంకా లోతైన అధ్యయనం అవసరమని ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు… ఒక వివాహితతో ఎవరైనా ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటే అవి శిక్షార్హమేనా..? ఆ ఇద్దరూ శిక్షించబడాలా అనే విషయంలోనూ స్టాండింగ్ కమిటీ పరిశీలన సాగిస్తోందట… ఈ కమిటీ ఇచ్చే సిఫారసులు మళ్లీ మనల్ని పాత కాలంలోకి తీసుకుపోతున్నాయని అభిప్రాయపడే మేధావులు కూడా ఉన్నారు… నో, నో, ఇలాంటి కఠిన చట్టాలు అవసరమనే వాళ్లూ ఉన్నారు…
Share this Article