చమ్మక్ చంద్ర… టీవీ కమెడియన్లలో తన రేంజే వేరు… జబర్దస్త్‌కు ఓ పెద్ద అస్సెట్‌లా ఉండేవాడు… అలాంటోళ్లు ఈటీవీకి పనికిరారు కదా, పొగబెట్టారు… దాంతో కాస్త ఎక్కువ పేమెంట్ కోసం ప్లస్ ఈటీవీ నుంచి మార్పు కోసం నాగబాబు వెంట వెళ్లిపోయాడు… జబర్దస్త్ డైరెక్టర్లే జీటీవీలో అదిరింది కామెడీ షో చేసినా అది అట్టర్ ఫ్లాపయింది… తరువాత మాటీవీ కామెడీ స్టార్స్‌కు అడ్డా మారింది… ఆ షోకు తను మంచి అస్సెట్ అవుతాడు అనుకున్నారు…
పైగా నాగబాబు కూడా అక్కడికే వచ్చి చేరాడు కదా… ఇక చంద్రకు మంచి ప్రయారిటీ అనుకున్నారు… కానీ జరిగిందేమిటి..? చమ్మక్ చంద్ర ఔట్… హేమిటో ఆ షో… జడ్జిలు, హోస్టులు, కమెడియన్లు చకచకా మారిపోతూనే ఉన్నారు… ఇప్పుడు చమ్మక్ చంద్ర… తనతోపాటు చురుకుగా కామెడీ చేసే లేడీ కమెడియన్ సత్యశ్రీ ఈ కామెడీ బాట వదిలేసి, ఎంచక్కా హెచ్‌ఎంటీవీలో ‘వీఐపీ’ (వెరీ ఇన్‌స్పయిరింగ్ పర్సన్) పేరిట ఇంటర్వ్యూల ప్రోగ్రాం ఒకటి చేసుకుంటోంది…
చమ్మక్ చంద్ర తాజా ప్రోమోల్లో కనిపించడం లేదు… తీరా ఆరా తీస్తే… అబ్బే, ఎవరూ వెళ్లిపొమ్మనలేదు తనను… సినిమాల్లో బిజీ అయిపోయాడు, డేట్లు అడ్జస్ట్ కావడం లేదు, అంతే అని చెబుతున్నారు… అంతేలెండి, అలాగే చెబుతుంటారు… నిజానికి సినిమాల్లో బిజీగా ఉన్నా సరే, పాడిగేదె వంటి టీవీ ప్రోగ్రాముల్ని ఎవరూ వదులుకోరు… గెటప్ సీను, హైపర్ ఆది, అనసూయ, రష్మి, సుమ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ తదితరులు కూడా సినిమాల్లో చేస్తున్నారు… కానీ ఎవరూ టీవీని వదిలేయరు… అది రెగ్యులర్ ఈఎంఐలను ఆదుకునే తల్లి… సో, చంద్రకు మాటీవీకి ఎక్కడో తేడా కొట్టి ఉండవచ్చు…
Ads
కానీ ఈ రావడాలు, పోవడాలు ప్లస్ రేటింగ్స్ గట్రా వదిలేయండి కాసేపు…. జబర్దస్త్ షో మీద మాటీవీ కామెడీ స్టార్స్ అప్పర్ హ్యాండ్ సాధిస్తోంది… లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తేనే అర్థమైపోతోంది… వెరయిటీ స్కిట్స్ ట్రై చేస్తున్నారు… ఎక్కడా బూతుల వాసన లేదు… అశ్లీలం లేదు… పైగా అందరూ సీనియర్లు… భలే టైమింగ్ మెయింటెయిన్ చేసేవాళ్లే అందరూ.., అన్నింటికీ మించి పాపులర్ స్టార్లను అనుకరిస్తూ, హిట్ సినిమాల స్పూఫ్స్ చేయడానికి చాలా జాగ్రత్త అవసరం… తేడా వస్తే ఫ్యాన్స్‌తో ఇరకాటం…
నిజానికి ఒక ప్రోమోను బట్టి ఒక షో నాణ్యతను అంచనా వేయగలమా..? పూర్తిగా వేయలేం… కానీ ఆ షో పోకడలు, అది పయనిస్తున్న దిశ అర్థమవుతాయి… ఆమధ్య పూర్ణ గెస్ట్ జడ్జి… ఇప్పుడిక శేఖర్ మాస్టర్ వచ్చి తన కుర్చీలో సెటిలైపోయాడు… ఇక మార్పులేమీ ఉండకపోవచ్చు… బూతుల్లేకుండా కంటిన్యూ చేస్తూ, జబర్దస్త్ టైమ్‌లోనే దీన్ని కూడా ప్రసారం చేస్తే ఇంకాస్త పాపులర్ అయ్యే చాన్సుంది… తాజా ప్రోమో ఒకసారి పరిశీలిస్తే…
పుష్ప స్పూఫ్‌తో… తనను వదిలేసి వేరే టీంతో వెళ్లిన రియాజ్‌ను నిందిస్తూ సద్దాం… అందులోనే అఖండ వేషంలో వచ్చిన ముక్కు అవినాష్,.. హరి కూడా ఉన్నాడు… నేను అడుగేస్తే పూనకాలే అంటాడు అవినాష్… పూనకాలు కాదు, తేడా వస్తే ఫోన్ కాళ్లు అంటాడు సుద్దాం… గతంలో సీఎం జగన్‌ను అనుకరించి ఇదే హరి, రియాజ్ చేదు అనుభవాల్ని మూటగట్టుకున్నారు కదా… అది మరోసారి గుర్తు చేసుకోవడం అన్నమాట ఇది… ఇదే స్కిట్‌లోకి అభి చిరంజీవిని అనుకరిస్తూ, ఆచార్య వేషంలో వచ్చాడు…
ఇక్కడ స్కిట్ మెరిసింది… బన్నీ వేషంలో ఉన్న సద్దాం ఓ ప్లేట్ తెచ్చుకుని, ఆచార్య వైపు చూస్తాడు… ఇదేమిటి అనడిగితే… ‘‘సంక్రాంతికి మిస్సయ్యారు కదా, దోసెలు వేస్తే తింటాం… అనే డైలాగ్ విసిరాడు సద్దాం… (చిరంజీవి తరచూ ఖాళీ టైంలో దోసెలు వేసి కొడుక్కి, పెసరట్టు వేసి తల్లికి పెడుతుంటాడు కదా…) సరదాగా నవ్వుకునేలా ఉంది… మొత్తం ఎపిసోడ్ హిలేరియస్‌గా వచ్చి ఉండవచ్చు… అసలు జబర్దస్త్‌లో ఎన్నాళ్లైంది ఇలాంటి స్కిట్లు చూసి… (మొన్న సుధీర్ టీం తామే రాసుకుని, తమ మీదే వేయించుకున్న పంచుల స్కిట్ బాగుంది…)
మరో స్కిట్‌లో శేఖర్ మాస్టర్‌ను టీజ్ చేస్తూ… యశ్ మాస్టర్, ఆడవేషంలో అవినాష్, యాదమ్మరాజు… అండర్ కవర్ ఆపరేషన్ అంటూ ఆర్పీ… అసలు మరింత మంచి రేంజులో ఉన్నది బిత్తిరి సత్తి, ధనరాజ్, వేణు చేసిన స్కిట్… ఊ అంటావా, ఊఊ అంటావా సాంగును పాత సంప్రదాయ ట్యూన్లలోకి మార్చి పాడి కామెడీ పండించారు… సేమ్, నాటు నాటు పాటను కూడా… బూతులు నిండిన కామెడీ తప్ప ప్రేక్షకులు ఇంకేమీ ఇష్టపడరనే మల్లెమాల చీప్ టేస్ట్‌ను, ఈటీవీ భ్రమల్ని బద్దలు కొట్టాలంటే… కామెడీ స్టార్స్ ఇలాగే బూతురహిత ధోరణితో కొనసాగాలి…!!
Share this Article