.
వామ్మో ఇదేం జర్నలిజం… ఎవుర్రా మీరంతా…
కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు… మనిషి కుక్కని కరిస్తేనే వార్త. జర్నలిజం బేసిక్ సూత్రంపై అప్పట్లో ఓ మేధావి అన్న మాటలివి.
Ads
ఇప్పుడు ట్రెండ్ మారింది.టెక్నాలజీ పెరిగింది. జర్నలిజం మరింత డిఫరెంట్ స్టైల్ కు వెళ్ళింది. ఉధృతంగా జనం మీదకు విరుచుకుపడుతోంది. వ్యూస్ కోసం పోటీలు పడి ఎవడ్ని పడితే వాన్ని సెలబ్రిటీలను చేస్తుంది తెలుగు మీడియా.
యూట్యూబర్స్ అంటే పోనీలే అనుకుందాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఏం మాయరోగం. ఎటు వెళ్తుంది నయా జర్నలిజం. ఎందుకీ పనికి రాని ఇంటర్వ్యూలు. ఇలాంటి జర్నలిజంతో సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి ?
అక్కడ లిక్కర్ టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమం జరుగుతుంది. లక్కీ డ్రాలో టెండర్ దక్కించుకున్న వాన్ని పోటీలు పడి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు కొందరు జర్నలిస్టులు. వాడేదో క్రికెట్ లో ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చినట్టుగా….. బార్డర్ లో యుద్ధం చేసి గెలిచినట్టుగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లిక్కర్ వ్యాపారులు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ యుద్దవీరుల మాదిరిగా ఫీలై పోతున్నారు. లిక్కర్ సేల్స్ ఎలా పెంచాలి… పెట్టిన పెట్టుబడికి లాభం ఎలా రాబట్టాలి. మద్యం కల్తీ ఎలా చేయాలి. ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న లిక్కర్ మాఫియాతో ఫేస్ టూ ఫేస్ లు.
లక్కీ డ్రాలో వైన్స్ గెలుచుకున్నారు కదా మీరు ఎలా ఫీలవుతున్నారు అనే ప్రశ్నలు. దుకాణం మీరే ఉంచుకుంటారా… ఇంకొకనికి అమ్ముతారా అంటూ మరిన్ని తిక్కమక ప్రశ్నలు. వామ్మో, ఈ అంశాలు రాస్తుంటేనే వికారంగా అనిపిస్తుంది నాకైతే. అంతేలే ఎవని స్టైల్ వానిది. కానివ్వండి సార్. తగలబెట్టండి నిరంజన్ గారూ… రేప్పొద్దున గంజాయి స్మగ్లర్లను, పెడ్లర్లను మోయండి, పర్లేదు, తీసేవాడికి చూసేవాడు లోకువ…
బోలెడు ఇష్యూస్ మన చుట్టూ… అవేవీ పట్టకుండా మద్యం షాపు లాటరీ గెలిచినవాడు తోపు అనే ఇంటర్వ్యూలను చూస్తే కలిగిన భావోద్వేగం… ఇప్పుడిక మెయిన్ స్ట్రీమ్, యూట్యూబర్ తేడా లేనేలేదు… ష్, యూట్యూబర్లే కాస్త నయమేమో………. వరకాంతం కిరణ్ రెడ్డి
Share this Article