మీకు ‘కింగ్ ఫిషర్’ బిర్యానీ, ‘కింగ్ ఫిషర్’ ఛాయ్ అంటే తెలుసా?
బిర్యానీ తిన్నప్పుడు కస్టమర్లు వదిలేసిన బిర్యానీ రైస్, ముక్కలు, బొక్కలు అన్నింటిని ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెడతారు. రెండు మూడు గంటల్లోనే పెద్ద గిన్నె నిండా ఎంగిలి బిర్యానీ, ముక్కలు తయారవుతాయి.
అలాగే ‘ఛాయ్’ కప్పులలో మిగిలిన కొన్ని ఛాయ్ చుక్కలను ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెడతారు.
Ads
తర్వాత, ఈ బిర్యానీ రైస్ ను ప్లేట్లలోకి సర్ది దాని పైన కొంచం ఫ్రెష్ బిర్యానీ రైస్, ఓ రెండు మూడు చికెన్ ముక్కలు కనపడేటట్టుగా సర్ది, పైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీరా చల్లి సిద్ధంగా ఉంచుతారు.
అలాగే, అన్ని ఎంగిలి కప్పులలో నుండి కలెక్ట్ చేసిన ఛాయ్ ను మరిగించి కొన్ని పాలు, కొంత ఛాయ్ పత్తా, కొంచెం పంచదార వేసి మరిగించి ఒక కెటిల్ లో సిద్ధంగా ఉంచుతారు.
భయపడకండి! ఇవన్ని మన కోసం కాదు.
హోటళ్ళ మీద పడి తేరగా తినే మున్సిపాలిటీ, పోలీస్, కరెంట్ డిపార్టుమెంట్ ఉద్యోగులు, లోకల్ గూండాలు రాగానే, క్యాష్ కౌంటర్లోని వ్యక్తి,
“అరేయ్! సారొచ్చారు. సారుకు స్పెషల్ ‘కింగ్ ఫిషర్’ బిర్యానీ పార్సెల్ కట్టు. ఒక ‘కింగ్ ఫిషర్ ఛాయ్’ తీసుకుని రండి.” అని అరవగానే,
వందల మంది తిన్న ఎంగిలి బిర్యానీ, వందల మంది తాగి వదిలేసిన ఎంగిలి ఛాయ్ చుక్కలతో తయారయిన ఛాయ్ సర్వ్ చేయబడుతుంది.
దాన్నే ‘#కింగ్ఫిషర్బిర్యానీ’; ‘#కింగ్ఫిషర్ఛాయ్’ అంటారు.
కాబట్టి, బహు పరాక్…!
(యదార్థ సంఘటన)
డా. ప్రభాకర్ జైనీ
Share this Article