.
థియేటర్ల సమస్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది… పనిలోపనిగా ఇండస్ట్రీ సమస్యలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి… ఫాఫం, ప్రేక్షకుడి పర్సు విషయం తప్ప, సరే, వాళ్లు వ్యాపారులు… తమ గల్లాపెట్టే తమకు ప్రధానం కదా… దాన్నలా వదిలేస్తే…
ఓ వార్త ఇంట్రస్టింగు… ఆలోచించతగింది కూడా… అదేమిటంటే… అమీర్ ఖాన్ తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ బిజినెస్ మోడల్‌ను వర్తమాన ట్రెండ్‌కు భిన్నంగా ప్రకటించాడు… అది చర్చనీయాంశం కూడా…
Ads
తను ఏమంటాడంటే..? ‘‘నేను నా సినిమాకు ఓటీటీలో రిలీజ్ చేయను… ఎనిమిది వారాల దాకా థియేటర్లలోనే నడిపిస్తాను… తరువాత యూట్యూబులో పేపర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగుకు పెడతాను’’…
ఇంట్రస్టింగు… సరే, ఎనిమిది వారాల దాకా సినిమా ఆడితే ఆ థియేటర్ వసూళ్లు చాలు నిజానికి… అయితే ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు, అదీ చర్చనీయాంశం… మన తెలుగువాళ్లకు చేతకానిది ఈ సాహసమే… అదెలాగో కాస్త చెప్పుకుందాం…
కొంతకాలంగా ఓటీటీల పెత్తనం ఇండియన్ సినిమా మీద బాగా పెరిగిపోయింది… వాళ్లిచ్చే డబ్బు కోసం పెద్దా చిన్నా నిర్మాతలందరూ వాళ్లు పెట్టే షరతులకు తలొగ్గుతున్నారు… సినిమా నిర్మాణ వ్యయం దగ్గర నుంచి సినిమా రిలీజు, ఓటీటీ స్ట్రీమింగుకు ఇచ్చే వ్యవధి దాకా వాళ్లు అనేక షరతులు పెడుతున్నారు, కాదు, శాసిస్తున్నారు…
టీవీల్లో ఎవడూ పెద్దగా సినిమాలు చూడటం లేదు… కాబట్టి ఆ రైట్స్‌కు పెద్దగా విలువ లేదు ఇప్పుడు… ఆడియో రైట్స్ అంతంతమాత్రమే… థియేటర్లకు జనం రావడం లేదు… ఆ వసూళ్లూ తక్కువే… ఒకటీరెండు బ్లాక్ బస్టర్లు తప్ప… ఇక మిగిలింది ఓటీటీ వాళ్లు ఇచ్చే డబ్బులే…
ఇదిలాగే కొనసాగితే… ఈ ఆధిపత్యాన్ని బ్రేక్ చేయకపోతే కష్టమనే భావన ఇండస్ట్రీలో ఉంది… కానీ డేర్ చేసేవాడు లేడు… ఒక కమలహాసన్ థగ్ లైఫ్ సినిమాకు సంబంధించి ఆమీర్ ఖాన్ చెబుతున్న బిజినెస్ మోడలే ఆలోచిస్తున్నాడు, చెబుతున్నాడు…
ఈ రెండు సినిమాలు వాళ్లే తమ కంపెనీల ద్వారా నిర్మిస్తున్నారు… తమ నిర్ణయాల లాభనష్టాలకు రెడీ అవుతున్నారు… ఎవరో ఒకరు ముందుకు రావల్సిందే… ఆమీర్ ఖాన్, కమలహాసన్‌లను మించి సాధనసంపత్తి ఉన్న కంపెనీలు సైతం ఇలా రిస్కీ మోడల్‌కు సాహసించడం లేదు…
ఐతే యూట్యూబులో పేపర్ వ్యూ (డబ్బు చెల్లించి సినిమా చూడటం) వర్మ కూడా ఒకటీరెండు సినిమాలకు ప్లాన్ చేశాడు, అమలు చేశాడు, తనది లోబడ్జెట్ కాబట్టి వర్కవుట్ అయ్యింది… కానీ ఆమీర్‌ఖాన్, కమలహాసన్ సినిమాలు భారీ బడ్జెట్లు… కాబట్టే ఎంతమేరకు వర్కవుట్ అవుతుందనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది…
నిజానికి యూట్యూబ్ ప్రీమియంలో పేపర్ వ్యూ చాన్నాళ్లుగా ఉంది… మన దేశంలో అలా పే చేసి వీక్షించే జనం చాలా తక్కువ, విదేశాల్లో కాస్త ఎక్కువే… సో, మనవాళ్లు ఇంకా అలవాటుపడాల్సి ఉంది… మన జనాభా రేంజ్‌ను బట్టి రెండు శాతం మంది ఓ సినిమా చూస్తే అది పుష్ప-2 లాగా ఏ 1800, 2000 కోట్లో రీచ్ అవుతుంది…
కానీ ఏడాదికి ఒక్కటి కూడా ఆ రేంజ్ సినిమా రావడం లేదు కదా… అంత హిట్ కనిపించడం లేదు కదా… కానీ థియేటర్ వసూళ్లు గాకుండా యూట్యూబు ప్రీమియంలో పేపర్ వ్యూ కనీసం 20 లక్షల మంది చూసినా ఆమీర్ ఖాన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందనేది అంచనా…
తనకు గల్ఫ్ కంట్రీస్ మార్కెట్ కూడా ఎక్కువే కాబట్టి ఈ పేపర్ వ్యూ సక్సెస్ అవుతుందనే ఆశ ఉంది తనలో… ఇక్కడే మరొకటి చెప్పుకోవాలి… ఓటీటీలు తమ మార్కెటింగ్ పద్ధతుల్ని కూడా వేగంగా, దూకుడుగా అమలు చేస్తున్నాయి… యాడ్స్ రెవిన్యూ పెంచుకునే దిశలో పరుగులు పెడుతున్నాయి…
ఉదాహరణకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 1499… యాడ్స్ వద్దంటే మరో 699 చెల్లించమంటున్నాడు… డిజిటల్ యాడ్ రెవిన్యూలో ఐపీఎల్ తదితర ప్రధాన యాడ్ రెవిన్యూ తీసేస్తే 4 వేల కోట్ల యాడ్ రెవిన్యూ ఈ వీడియో స్ట్రీమింగులకు ఉంటుందేమో… దాన్ని కొల్లగొట్టే దిశలో పరుగులు ఇవన్నీ…
అయితే ఇప్పుడున్న ఐపీఎల్ రైట్స్ జియోవి… ఈ ఒప్పందం గడువు ముగిశాక గూగుల్, అమెజాన్ వంటి పెద్ద ప్లేయర్లు పోటీపడబోతున్నారు… రెడీ అయిపోయి సన్నాహాలు చేసుకుంటున్నారు… అప్పుడిక మార్కెట్ మరింత హాటుగా ఉండబోతోంది…
ప్రైమ్ వాడు తన ఇతర సేల్స్‌కు, డిస్కౌంట్ ఆఫర్లకూ ఈ యాడ్స్‌కూ సరైన మేళవింపుతో కొత్త ఈ-కామర్స్ పోకడల్ని ఆలోచిస్తున్నాడు… అది సక్సెసయితే వాడు గేమ్ ఛేంజర్ అవుతాడు… సో, సినిమా వీక్షణం, వ్యాపార మోడల్స్ చాలాా మార్పులు చూడబోతున్నాయి అని అర్థం…!!
Share this Article