Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!

November 12, 2026 by M S R

.

Siva Racharla … కొన్నిసార్లు అంతే, ఎంతో ఆలోచించి స్ట్రాటజీ చేసినా ఫలితం ఆకట్టుకోదు…  విజయ సాయిరెడ్డి  గారి పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (PRP) …పేరు రాజకీయ, మీడియా వర్గాలను ఆకట్టుకోలేదు. చిరంజీవి గారు PRP ని పెట్టారు కదా? మళ్ళీ అదే పేరు ఎందుకు అని ప్రశ్నించిన Big Tv రిపోర్టర్ ప్రశ్నకు సాయిరెడ్డి గారు అది “ప్రరాపా” మాది “పరాపా ” అని వివరణ ఇచ్చారు. కానీ ప్రరాపా అనో పరాపా అనో అనరు PRP అనే అంటారు అన్న ఆలోచనను సాయిరెడ్డి గారి టీమ్ చేయలేకపోయింది… పేరు మీదనే ఇంత వివరణ ఇవ్వవలసి వస్తే విధి విధానాల మీద ఇంకెంత వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుందో!

2026 ఎన్నికల్లో తమిళనాడులో ఒక స్థానంలో పాండిచ్చేరిలో ఒక స్థానంలో పరివర్తన రాజనీతి పార్టీ పోటీ చేసింది , అది నాకు తెలిసే జరిగిందని సాయిరెడ్డి గారు అన్నారు కానీ 2023లోనే ఢిల్లీలో ముకేశ్ అనే అతను అధ్యక్షుడిగా పరివర్తన రాజనీతి పార్టీ రిజిస్టర్ అయిన విషయం సాయిరెడ్డి గారికి తెలిసినట్లు లేదు , ఆ పరివర్తన రాజనీతి పార్టీ ప్రతి సంవత్సరం తమ పార్టీ నిధుల వివరాలను ఎన్నికల కమీషన్ కు సమర్పిస్తుంది, ఈ ఏడు కూడా 27 వేల రూపాయలు తమ పార్టీ ఖాతాలో ఉన్నట్లు ప్రకటించింది. మరొక పరివర్తన రాజనీతి పార్టీ ఉత్తరాఖండ్ లో ఉంది కానీ వారి యాక్టివిటీస్ ఏమి లేవు…

Ads

ఇప్పుడు ఢిల్లీ పరివర్తన రాజనీతి పార్టీ సాయిరెడ్డి గారి పరివర్తన రాజనీతి పార్టీకి అభ్యంతరం చెప్పొచ్చు కానీ రికగ్నైజ్డ్ పార్టీనే కాబట్టి సాయిరెడ్డి గారి పార్టీ పేరు పక్కన పరివర్తన రాజనీతి పార్టీ (ఆంధ్రప్రదేశ్) అని పెట్టి రిజిస్టర్ చేయటానికి వీలుంది. కానీ ఢిల్లీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం చాలా గందరగోళం ఏర్పడుతుంది… సాయి రెడ్డి గారి టీమ్ పార్టీ పేరు మీద తగిన exercise చేసినట్లు లేదు …

new prp

ఉత్తరాది పార్టీలకు ముఖ్యంగా ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే పార్టీలకు మంచి పేరు లేదు, కేవలం చందాల కోసం పార్టీలు పెడతారు అని చెడ్డపేరు ఉంది. షెల్ కంపినీల మాదిరే షెల్ పార్టీలు అంటారు. గుజరాత్ లో ఊరు పేరు లేని ఒక పార్టీకి 1800 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.

పార్టీ ప్రకటనలో సాయిరెడ్డి గారి కుటుంబం మొత్తం హాజరయ్యారు.. తప్పేమి లేదు, కానీ నాది కుటుంబ పార్టీ కాదు , టీడీపీ వైసీపీల మాదిరి కాదు , నా పార్టీలో కుటుంబ పాత్ర ఉండదు అని చెప్పిన సాయిరెడ్డి గారు నిన్నటి ఆవిర్భావంలో కూడా కుటుంబాన్ని వేదిక మీదకు పిలవకుండా పేక్షకుల మధ్యకే పరిమితం చేసి ఉండవలసింది.

సాయిరెడ్డి గారి ప్రసంగం వింటే కొన్ని వేల సార్లు ఇవే మాటలు విన్నది గుర్తొస్తుంది… 1998 నుంచి 2009 మధ్య ప్రతి బీజేపీ నాయకుడు చెప్పిన మాటలనే సాయిరెడ్డి గారు చెప్పారు, కొత్తదనం లేదు .. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చనిపోతాను, ముస్లిం & క్రైస్తవులను గౌరవిస్తాను అని సాయిరెడ్డి గారు చెప్పారు. అక్రమ సంపాదనలతో చర్చ్ & మసీదుల నిర్మాణాన్ని జరగనివ్వను అని కూడా సాయిరెడ్డి గారు చెప్పారు.. నిన్న కొంత మంది మిత్రులు అప్పుడే విమర్శలు ఎందుకు? ఆయన alternet politics చేస్తారేమో చూద్దాం అని, కానీ అలాంటి వారినందరిని సాయిరెడ్డి గారు నిరుత్సాహపరిచారు.. కొత్త సీసాలో పాత సారా అనేలా ఉంది .

కదిరి, మదనపల్లి, రాయచోటి , హిందూపురం , కర్నూల్ లాంటి స్థానాల్లో ముస్లిమ్స్ కు టికెట్స్ ఇస్తాను అని కూడా సాయిరెడ్డి గారు ప్రకటించారు.. ఇప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వటానికి కులం / మతం ఓట్లు ఎక్కువ ఉన్నాయనే ప్రాతిపదికనే ఇచ్చాయి. ఒక పార్టీ ఒక కులానికి ఇస్తే మరో పార్టీ ఓట్ల పరంగా రెండో పెద్ద కులానికి చెందిన వారికి టికెట్స్ ఇచ్చాయి. సాయిరెడ్డి గారు కూడా అదే విధానం పాటిస్తాను అని చెబుతున్నారు..

సాయిరెడ్డి గారి ప్రసంగంలో బాగా సర్ప్రైజ్ . క్రిస్టియన్ రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారం అనుభవించారు , హిందూ రెడ్లు, ఇతర కులాల వారికి అవకాశం రాలేదు అని అన్నారు.. నీలం సంజీవ్ రెడ్డి , కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి , కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను కన్వీనియంట్ గా మర్చిపోయినట్లున్నారు.

సాయిరెడ్డి గారు చెబుతున్న అవకాశం రాని కులాలు అంటే హిందూ రెడ్లు అనుకోవాలా?. అదే నిజం అయితే కులాలలో ఇది అతి కులవాదన ఇది.. ఇప్పటి వరకు అవకాశం రాని కులాలు అని చెబుతూ మళ్ళీ అవే కులాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం..

ఇప్పటి వరకు అవకాశాలు రాని కులాలు అంటే కుమ్మరి, కమ్మరి, వడ్డెర, రజక, మంగలి , ఈడిగ, శెట్టిబలిజ, బోయ , కురుబ .. ఇలా అనేక వెనకపడిన కులాల గురించి చెప్పేవారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు ఈ లిస్టును మార్చేశారు..

ఏమైనా సాయిరెడ్డి గారి పార్టీ ఆవిర్భావం అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు , PR టీమ్ మరింత గట్టిగా పనిచేయవలసింది.. ఈనాడు మొదటి పేజీలో చిన్న వార్త, ఆంధ్రజ్యోతి పన్నెండో పేజీలో వార్తలు వేసాయి, సాక్షిలో లోపలి పేజీలో సింగిల్ ఐటమ్ వేశారు.. ప్రధాన పత్రికల్లో కనీసం బ్యానర్ ఐటమ్ వచ్చేలా పనిచేయవలసింది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • *మైనస్ పాయింట్స్‌గా చెప్పబడుతున్నవన్నీ నిజానికి ప్లస్ పాయింట్సే*
  • ఆస్కార్ బరిలోకి ‘రామాయణం’… రాజమౌళి ఆర్ఆర్ఆర్ బాటలోనే!
  • సహస్రకంఠ రావణుడిని సీత చంపుతుంది ! అదే అద్భుత రామాయణం !!
  • ఏవేవో కవరింగులు-! నీ జ్ఞాపకాల దొంతర ‘నిజాయితీ’గా లేదమ్మా..!
  • Pyre … మీకు వీలైతే మేం కూడా వెళ్లిపోకముందే చచ్చిపొండి..!!
  • ఇజ్రాయిల్ రాజకీయాల్లో మలుపు? జాతీయ ప్రభుత్వం ఏర్పాటు?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions