.
- వావ్… ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మాత్రమే రాజకీయాల్లో సనాతన ధర్మం చాంపియన్ అనుకున్నాం కదా… ఇప్పుడిక బాలయ్య దాన్ని దాటేసేట్టున్నాడు… అవును, సరికొత్త సనాతన ధర్మం చాంపియన్ బాలయ్య…
ఇప్పుడు సినిమాల సీజన్ ఏమిటి..? కాస్త పౌరాణికం, కాస్త దేశభక్తి, కాస్త యాక్షన్, కాస్త ఎమోషన్… హీరో హైపర్ యాక్టివ్ ఎలివేషన్… మోత మోగిపోయే బీజీఎం… అంతే కదా… ఎస్, బాలయ్య అఖండ-2 తాండవం టీజర్ చూస్తే అదే జానర్ స్ట్రిక్టుగా ఫాలో అయిపోయినట్టున్నాడు బోయపాటి… తోడుగా విలన్‌కు తాంత్రిక శక్తులున్నట్టు కూడా గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి… ఇంకేం, అన్నీ రంగరించినట్టున్నారు…

Ads
అసలే అఖండ హిట్… దాని సీక్వెన్స్ ఇది… సో, అలాగే ఉంటుంది కథ కూడా… కాకపోతే ఈసారి దేశం, ధర్మం తాలూకు ఎమోషన్లను బాగా దట్టించారు… ఆపరేషన్ సింధూర్, మహా కుంభమేళా ఇన్‌స్పిరేషన్లు కూడా పనిచేసినట్టున్నాయి… కుంభమేళా ఒరిజినల్ ఫీడ్ వాడుకున్నట్టున్నారు… కథలో ఎక్కడో ఇరికిస్తారు…
- అసలే బాలయ్య, ఆపై బోయపాటి… అసలు మామూలు సినిమాల్లోనే మానవాతీత శక్తులున్నట్టుగా ఉంటాయి బాలయ్య యాక్షన్ సీన్లు… ఇక దైవిక శక్తలు పాత్ర ధరించాక ఇక ఆకాశమే హద్దు… ఈ టీజర్ సీన్లూ అలాగే ఉన్నాయి… హింస, బీభత్సం… మరీ ఓ షాట్‌లో త్రిశూలాన్ని కడుపులో గుచ్చి ఓ మనిషిని గిరగిరా చక్రంలా తిప్పుతున్నాడు…

అఖండలో ప్రధానబలం పంచ్ డైలాగులు… భలే పేలాయి… ఈ టీజర్‌లో కొన్ని బాగున్నాయి… ‘‘కష్టమొస్తే దేవుడొస్తాడని నమ్మే జనాన్ని కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి… అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది…’’ ‘‘ఈ ప్రపంచంలో ఏ దేశమేగినా మీకు కనిపించేది అక్కడి మతం, కానీ ఈ దేశంలో ఎటుచూసినా మీకు కనిపించేది ఓ ధర్మం… సనాతన హైందవ ధర్మం’’…
- ‘‘దేశం జోలికొస్తే మీరు దండిస్తారు, ధర్మం జోలికొస్తే మేం ఖండిస్తాం… మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రయిక్స్…’’ ‘‘ఇప్పటివరకూ ప్రపంచపటంలో మా దేశం రూపాన్నే చూసి ఉంటావు, ఎప్పుడూ మా దేశం విశ్వరూపాన్ని చూసి ఉండవ్, మేం ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం…’’
బాగున్నయ్… దేశభక్తి, తాంత్రికశక్తి, దైవశక్తి కలగలిపిన కథ… ఐతే ఇంతకుముందు విడుదల చేసిన ఓ ఐటమ్ సాంగ్ థమన్ స్టయిల్‌లో లేదు, బాలయ్యకు అస్సలు నప్పలేదు… ఆమె ఎవరో గానీ ఆ స్టెప్పుల్లోనూ జోష్ లేదు… పైగా నందమూరి మోగించిన థమన్ డబ్బాలో గులకరాళ్ల మోతలో కాసర్ల శ్యామ్ ఏం రాశాడో సాహిత్యమే వినిపించలేదు, అదేదో జాజికాయ అనే పదం తప్ప…
ఆ పాటలోలాగే థమన్ దడదడ మోతలో బాలయ్య యాక్షన్ పంచ్ డైలాగులు కూడా సరిగ్గా వినిపించడం లేదు… హిమాలయాల్లో సీన్ల చిత్రీకరణ , శ్రీచక్రం తిరుగుతున్న ఒకటీరెండు గ్రాఫిక్కులు కూడా…! ఆ ఐటమ్ సాంగ్ చూసి… ఇప్పుడు టీజర్ ఎలా ఉందో అనుకున్నారు గానీ, ఇంప్రెసివ్‌గానే ఉంది…!! సో, సరికొత్త సనాతన ధర్మ సారథి గారూ, మీరిక కుమ్మేయండి సార్..!!
Share this Article