టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది… కరోనా వంటి ప్రాణాంతక వైరసులు ఉప ఉత్పత్తుల్లాగా ప్రపంచం మీద విరుచుకుపడుతున్నా సరే… ఆ దుష్ట చైనీయుడు ప్రపంచానికే ఓ శాపంగా మారినా సరే… టెక్నాలజీ ఆగదు… మనిషి రోజురోజుకూ కొత్తది కనిపెడుతూనే ఉంటాడు… అదే మనిషి ప్రగతికి బాటలు వేస్తోంది… దాన్నెవడూ ఆపలేడు… అయితే ప్రకృతి ఇవన్నీ బ్యాలెన్స్ చేసేలా రోజురోజుకూ కొత్త విపత్తుల్ని ప్రయోగిస్తూనే ఉంటుంది… అది వేరే సంగతి…
ఆమధ్య మనం ఓ వార్త చదివాం… మన దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పట్టదు కానీ… చైనావాడు కృత్రిమ సూర్యుడిని సృష్టించాడు… కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను పుట్టించాడు… అందులో నుంచి వాడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాడు… అవసరమైతే అదే టెక్నాలజీని విధ్వంసానికీ వాడతాడు… అసలు వాడి ఉద్దేశమూ అదే… వాడి ప్రథమ లక్ష్యమూ ఇండియాయే…
Ads
అయితే చైనావాడే ప్రథమం ఏమీ కాదు… కృత్రిమంగా సూర్యుడిని సృష్టించుకుని మనిషి అవసరాలు తీర్చుకునే దిశలో… దక్షిణ కొరియా కూడా ముందంజలోనే ఉంది… అసలు ఎప్పుడో అది ప్రయోగాలు స్టార్ట్ చేసింది… ఇప్పుడు తాజాగా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను పుట్టించారు… 20 సెకండ్లపాటు నిలిపి ఉంచారు… గ్రేట్…
అదింకా ప్రగతి దశలో వెళ్లనుంది.,. ఇది ఇప్పటిదాకా ఉన్న థర్మల్, హైడల్, ఆటమిక్ ఎట్సెట్రా అన్నిరకాల ఇంధనాల్ని పక్కకు నెట్టేసి, ఆ స్థానంలోకి రాబోతోంది… క్లీన్ పవర్… చీప్ పవర్… ఈ దెబ్బకు సంప్రదాయ శిలాజ ఇంధనాలన్నీ ఆవిరైపోయినా సరే… ఇంధన అవసరాలు మరో వంద రెట్లు పెరిగినా సరే, ఈ కొత్త విధానం కేటర్ చేయగలదు…
Top Ten Technologies of 2020….. ఇది Inshorts క్రోడీకరించిన కొత్త టెక్నాలజీల సమాహారం… అనేక అంశాల్లో ప్రపంచగతిని మార్చేవి… వాటిని మించి పోవచ్చు కూడా… కానీ ఈ కృత్రిమ సూర్యుడిని అది అర్థం చేసుకోలేదు…
రిస్కులున్నయ్… ఉంటయ్… కానీ తప్పదు… మొదట దక్షిణ కొరియా… ఇప్పుడు చైనా… రేపు మరో దేశం… కానీ ఇంధనం అధ్యాయమే మారిపోబోతోంది… ఇది అన్నింటికీ మించిన ఆవిష్కరణ… మనిషి ఆగడు… ఆగితే మనిషే కాదు… ఇంకా ముందుకు వెళ్తాడు… ప్రకృతిని సవాల్ చేస్తూ, అది విసిరే విపత్తుల్ని కాచుకుంటూ… ముందుకు వెళ్తూనే ఉంటాడు… అదీ అసలు కథ… ఈ దిశలో అమెరికా, ఇండియా ఎక్కడ ఉన్నాయి అని అడక్కండి…
దక్షిణ కొరియా సక్సెస్ అయితే చాలు… అది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇండియా, ఇజ్రాయిల్ తదితర దేశాలన్నింటికీ చేరినట్టే…. చైనా సక్సెస్ రష్యా తదితర దేశాలకూ విస్తరించినట్టే… వెరసి ప్రపంచం ఓ కొత్త ఇంధన టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది… ఈ పెట్రోల్, డీజిల్ దశలను దాటేసి………… ఇస్లామిక్ ప్రపంచానికి వెన్నుదన్నుగా ఉంటున్న ఆ గల్ఫ్ శిలాజ ఇంధన ఆస్తిని వదిలించుకుని ప్రపంచం వేరే దిశకు పరుగులు తీయనుంది… అవును, ప్రపంచం కొత్త దిశలోకి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతోంది… అది ప్రపంచ రాజకీయాల్ని, సంస్కృతిని, మతాన్ని, ఆధిపత్య ధోరణుల్ని సమూలంగా మార్చేయబోతోంది…!!
Share this Article