ఒకవేళ బీఆర్ఎస్‌కు 55 వరకూ సీట్లు వస్తే… మజ్లిస్ ఉండనే ఉంది… కాదంటే బీజేపీ ఉంది… మరీ కాదంటే కాంగ్రెస్‌లోని కేసీయార్ కోవర్టులు కొందరు గెలుస్తారు, వాళ్లూ ఉన్నారు… ఇవన్నీ గాకుండా బీఆర్ఎస్‌కే సరిపడా మెజారిటీ వస్తే ఇక ఏ రందీ లేదు… స్ట్రెయిట్‌గా కొత్త కేబినెట్ కొలువు తీరడమే… సో, రకరకాల సమీకరణాలు రేపటి ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి…
నో, నో, కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వస్తుంది… కాంగ్రెస్‌ను చీల్చినా సరే కేసీయార్‌కు సరిపడా మెజారిటీ రాదు, ఐనా మూడింట రెండొంతులు చీల్చడం అంత వీజీ కాదు, పైగా అధికారంలోకి వస్తున్నప్పుడు ఎవరూ కాంగ్రెస్ వీడి వెళ్లరు… ఇలాంటి చర్చలు, ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి… అంతేకాదు… ఒకవేళ కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వచ్చి, ఈసారికి ఇక పోతే పోనీ అని కేసీయార్ కూడా వదిలేస్తే…
సీఎల్పీ సమావేశం జరగాలి, లీడర్ ఎన్నిక జరగాలి… ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వచ్చినా సరే, అందరినీ కన్విన్స్ చేసి, వర్గవిభేదాలు పెచ్చరిల్లకుండా చూడాలి… ఎవరి నెత్తిన కిరీటం ఉండాలో నిర్ణయం జరగాలి… ఏమో, ఒకరు రెండున్నరేళ్లు, మరొకరు రెండున్నరేళ్లు అనే రాజీ ఒప్పందాలు… లేదంటే ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి మెడలో విజయహారం పడే అవకాశాలూ ఉంటాయి…
Ads
ఇన్ని సమీకరణాలతో… అప్పుడే ఆలూలేదు, చూలూలేదు, సీఎం పేరు సోమలింగం అన్నట్టుగా… సోషల్ మీడియా అప్పుడే కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారో కూడా తేల్చేసి, మంత్రిపదవుల పంపిణీ కూడా చేసేసింది… రాహుల్ గాంధీకన్నా ఫాస్ట్… (బీఆర్ఎస్ కేబినెట్ అయితే సీఎం, హరీష్, కేటీయార్ తప్ప మిగతా వాళ్లు ఎవరెవరున్నారో పెద్దగా ఎవరికీ తెలియదు… కానీ కాంగ్రెస్ అలా కాదు కదా… ప్రతి మంత్రీ ఓ ముఖ్యమంత్రే కదా… పైగా బీఆర్ఎస్ కేబినెట్ అంటే కేసీయార్ ఎవరి పేరు పక్కన టిక్ కొడితే వాళ్లు మంత్రులు… విధేయత అనేదే ప్రామాణికం, అంతే… కానీ కాంగ్రెస్‌లో చాలా లెక్కలు, ఈక్వేషన్లు చూడాల్సి ఉంటుంది…)
(ముస్తాబవుతున్న ప్రగతి భవన్…)
సరే, సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేబినెట్ చూద్దాం ఓసారి… (పనిలోపనిగా స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను కూడా అప్పుడే ఎంపిక చేసేశారు…)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా భట్టి విక్రమార్క
రేవంత్ సీఎం అయితే భట్టి, సీతక్కలు డిప్యూటీ సీఎంలు
భట్టి సీఎం అయితే రేవంత్ రెడ్డి, సీతక్క డిప్యూటీ సీఎంలు
సీఎం రేవంత్ రెడ్డి, సీఎం, జనరల్ అడ్మినిస్ట్రేన్, ఫైనాన్స్
రేవంత్ డిప్యూటీ సీఎం అయితే రెవెన్యూ, విద్యుత్ శాఖ– ఓసీ (రెడ్డి)
భట్టి డిప్యూటీ సీఎం అయితే రెవెన్యూ- (ఎస్సీ)
తుమ్మల- నీటిపారుదల—ఓసీ (కమ్మ)
వివేక్ – పరిశ్రమలు- ఎస్సీ (మాల)
రాజనర్సింహ- వైద్య ఆరోగ్యం- ఎస్సీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బీ (రెడ్డి)
ఉత్తమ్ – హౌసింగ్— ఓసీ (రెడ్డి)
జీవన్ రెడ్డి – అటవీ శాఖ— ఓసీ (రెడ్డి)
శ్రీధర్ బాబు- విద్యా శాఖ— ఓసీ (బ్రాహ్మిణ్)
ఫిరోజ్ ఖాన్- మైనార్టీ సంక్షేమం— ఓసీ (ముస్లిం )
సీతక్క-హోం (ఎస్టీ)
కొండా సురేఖ- బీసీ సంక్షేమం – (బీసీ)
మధుయాష్కీ- ఐటీ – (బీసీ)
మదన్ మోహన్-మున్సిపల్ వ్యవహారాలు– (ఓసీ వెలమ)
సరిత తిరుపతయ్య- స్త్రీ శిశు సంక్షేమం- (బీసీ)
కోట నీలిమ గెలిస్తే కేబినెట్ లోకి తీసుకునే అవకాశం
స్పీకర్- పొదెం వీరయ్య
డిప్యూటీ స్పీకర్- సింగాపురం ఇందిర
(ఏయే జిల్లాలకు ప్రాతినిధ్యం ఎవరితోనంటే…)
ఆదిలాబాద్- వివేక్
నిజామాబాద్- మదన్ మోహన్
కరీంనగర్ – జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు
వరంగల్- సీతక్క, సురేఖ
మహబూబ్ నగర్ – రేవంత్ రెడ్డి, సరిత
హైదరాబాద్- ఫిరోజ్ ఖాన్, మధుయాష్కీ
రంగారెడ్డి- (ఎవరూ దొరకలేదు ఊహించడానికి)
నల్గొండ- ఉత్తమ్, కోమటిరెడ్డి
మెదక్- దామోదర
ఖమ్మం- తుమ్మల
ఐనా సరే… వీళ్లలో అందరూ గెలిస్తేనే ఈ జాబితా ఖరారు… అనుకోకుండా కొన్ని కొత్త పేర్లు కూడా తెరపైకి రావచ్చు కూడా… కాంగ్రెస్‌లో ఇది ఇలాగే జరుగుతుంది అనేదేమీ ఉండదు… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… అఫ్‌కోర్స్, కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వచ్చి, ఎవరూ మెసలకుండా ఉంటేనే సుమా… ఈ లెక్కలు… ఈ కుర్చీలు…
అవునూ, ప్రగతి భవన్ ఆవరణలో అప్పట్లో ‘‘ఆధ్యాత్మిక విశ్వాస లెక్కల్లో భాగంగా’’ నాటబడిన మహాగని మొక్క ఎండిపోవడం వల్లే బీఆర్ఎస్‌కు ఈ దుస్థితి అని ఎక్కడో వార్త కనిపించింది… అసలే కేసీయార్‌కు ఇలాంటి నమ్మకాలు ఎక్కువ… రాజ్యాధికారాన్ని సాధించి పెట్టే రాజశ్యామల యాగం చేయించి మరీ ఈ మొక్క నాటారట… అదేమో ఎండిపోయిందట… మళ్లీ కేసీయార్ ముఖ్యమంత్రి అయితే ఎవడికో మూడినట్టే… అప్పట్లో పెంపుడు కుక్కకు సరైన వైద్యం అందకపోతే ఎవరో వెటర్నరీ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు వార్తలొచ్చాయి కదా… అవునూ, కరీబియన్ దీవుల్లో బాగా కనిపించే ఈ మొక్క కేరళలో బాగానే బతుకుతోంది కానీ మన ప్రగతిభవన్‌లో ఎందుకు ఎండిపోయిందబ్బా…!! ఇది అపశకున సంకేతమేనా..?!
Share this Article