రేవంత్ రెడ్డితో మొన్నామధ్య అందెశ్రీ ఇంటర్వ్యూ చూశాక… తప్పకుండా జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర అధికారిక గీతం కాబోతోందని బలంగా అనిపించింది… ఎంతోకాలంగా తెలంగాణవాదులు ఈ కోరికను బలంగానే వినిపిస్తున్నా సరే కేసీయార్ దాన్ని తుంగలో తొక్కాడు… ఇప్పుడు అందెశ్రీ రాసిన అదే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది… మంచి నిర్ణయం…
ఇదేకాదు, కేసీయార్ నిర్లక్ష్యం చేసిన లేదా సరిగ్గా చేయలేకపోయిన మరికొన్ని అంశాలనూ మంత్రివర్గం డిస్కస్ చేసి ఇంకొన్ని నిర్ణయాల్ని తీసుకుంది… రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి, పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినేట్ తీర్మానం చేసింది.
తెలంగాణ అధికారిక చిహ్నాన్నికూడా మార్చాలని తీర్మానించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని పోరాటాలకు, త్యాగాల చిహ్నంగా రూపుదిద్దాలని నిర్ణయం జరిగింది. దీని కోసం కళాకారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది… ఇదీ సరైన నిర్ణయమే…
Ads
వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లలో తెలంగాణ పేరును సూచించే ‘టీఎస్’ అక్షరాలను ఇకపై ‘టీజీ’గా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ల చట్టంలో అందుకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది… కొత్త రిజిస్ట్రేషన్లకు కాబట్టి పెద్ద సమస్యేమీ రాదు… కానీ నిజానికి ఈ మార్పు పెద్దగా అవసరం లేదు కూడా… పునరాలోచన అవసరం…
అవునూ… జయజయహే తెలంగాణ గీతం ఎందరికి తెలుసు..? ఓసారి దిగువన చదవండి… దీన్ని యథాతథంగా స్వీకరిస్తారా..? ఏమైనా కుదింపులు, సవరింపులు గట్రా ఏమైనా ఉంటాయేమో ఇంకా తెలియదు… యథాతథంగా ఉండాలనేదే చాలామంది ఆకాంక్ష… ఇదుగో…
తెలంగాణ తల్లి రూపాన్ని కూడా త్యాగానికి, పోరాటానికి సూచికగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు కదా… అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అలాంటి శాంపిల్ విగ్రహాన్ని రూపొందించినట్టు వార్తలు వచ్చాయి… కేసీయార్ ఆమోదించిన నాటి తెలంగాణ తల్లి స్వరూపం బంగారు కిరీటంతో రాచరిక పోకడలకు చిహ్నంగా ఉందని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించింది… ఈ కొత్త స్వరూపంలో చేతిలో కర్ర, ‘‘అభయహస్తం’’, సిగ, చెవిదుద్దులు, నొసట బొట్టు, ముక్కుపుడక, మెడలో వెండి కడ్డీ ఉంటాయి… తెలంగాణ తల్లి కష్టజీవి, ఊరి మహిళగా కనిపించాలని కాంగ్రెస్ అప్పట్లో అభిలషించింది…
ఐతే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలేమో… ఎందుకంటే… ఇది సోనియా గాంధీని పోలి ఉందనీ, అభయహస్తం కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అనీ అప్పట్లోనే కొందరు విమర్శలు చేసినట్టు గుర్తు… ఐనా సరే, సో వాట్… ఇదే ఫైనల్ అంటారా..? ఏమో…!!
Share this Article