.
మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి సందేహాలు… మిస్టరీగా మరణం… కేటీయార్, మాగంటి సునీత విలన్లు… సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులకు తల్లి ఫిర్యాదు… అసలు గోపీనాథ్ -సునీత పెళ్లే చట్టబద్ధం కాదు… తహశిల్దార్ ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లదు… ఆమె నామినేషనే చెల్లదు…
.
Ads
ఇలా.,. రకరకాల అంశాలతో పాటు మాగంటి గోపీనాథ్ మరణం కూడా జుబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో ఓ ప్రచారాంశం, ఎన్నికలాంశంగా మారింది… మరీ రెండుమూడు రోజులుగా బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారనేతలు అందరూ ఈ అంశాన్ని టచ్ చేస్తున్నారు… ప్రజల్లోకి వెళ్తోంది ఈ ప్రచారం… ఎందుకంటే..?
ఈ ఎన్నిక వచ్చిందే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా… ఆ సానుభూతిని వోట్లుగా మార్చుకోవడానికే బీఆర్ఎస్ ఆయన భార్యకు టికెట్టిచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది… ఆ సానుభూతే గట్టెక్కిస్తుందని ఆశపడుతోంది… కానీ ఆ సానుభూతికే బాగా గండికొట్టే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు… ఎలాగంటే..?
బీజేపీ, కాంగ్రెస్ పదే పదే తమ ప్రచారంలో మాగంటి మరణం, వారసత్వం అంశాల్లో సునీతను కూడా విలన్‌గా చూపిస్తున్నాయి… బీఆర్ఎస్ ఏకైక స్టార్ క్యాంపెయినర్, ప్లానర్ కేటీయార్ పాత్ర ఏమిటని ప్రశ్నిస్తున్నాయి… దీనికి గోపీనాథ్ తల్లి వ్యాఖ్యల్ని ఉదహరిస్తున్నాయి… ఇప్పుడిక ఏకంగా ఆ తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులనే ఆశ్రయించింది…

- మా అబ్బాయి మాగంటి గోపీనాథ్ మరణం వెనుక నేరపూరిత కుట్ర దాగి ఉంది… లోతుగా దర్యాప్తు జరిపించాలి… సునీత పాత్రపైనే కాదు, గోపీనాథ్ గన్‌మెన్ల పాత్ర కూడా ఏమిటో తేలాలి… కన్నతల్లిని నాకు హాస్పిటల్లో అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ ను ఎలా కలవనిస్తారు..?’’
ఇన్నాళ్లూ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, ఆమె కొడుకు ఏవేవో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా… సునీత ఎన్నికల అఫిడవిట్ మీద ఫిర్యాదులు చేస్తున్నా… వాళ్లను ఎవరు అడ్డుకుంటున్నా సరే… అదంతా ఏదో వారసత్వం, ఆస్తుల గొడవలు అనుకున్నారు ప్రజలు… ఎప్పుడైతే సాక్షాత్తూ గోపీనాథ్ తల్లి అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నదో అప్పటి నుంచి సునీత మీద నెగెటివిటీ పెరుగుతోంది ప్రజల్లో… అది బీఆర్ఎస్ వోట్లకు గండికొట్టబోతోందా..?
ఇప్పుడిక ఏకంగా పోలీసు దర్యాప్తు, కేసు… సరే, ఇదంతా రాజకీయం, ఎవరో ఆడిస్తున్నారు, ఈ ఎన్నికల తరువాత ఈ కేసును ఎవరు పట్టించుకుంటారు అంటారా..? సునీత గెలిస్తే ఈ కేసు మళ్లీ ప్రముఖంగా వార్తల్లోకి రాబోతోంది… ఇదేకాదు, ఆమెకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా..! సహజీవనం చట్టబద్ధతపై కూడా చర్చ కొనసాగొచ్చు… సహజీవనం చేసే మహిళలకు ఉండే హక్కులు, బాధ్యతలపై కూడా..!
- మరి సునీత ఓడిపోతే..? ఇక ఎవరూ పట్టించుకోరు ఆమెను… చివరకు బీఆర్ఎస్ సహా… రాజకీయాలంటే అంతే..!!
Share this Article