.
చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్… (సీపీ రాధాకృష్ణన్)… పక్కా ఆర్ఎస్ఎస్… ఆయన ఈ దేశ ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు… అవును, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, హైకమాండ్ ఇదే నిర్ణయం తీసుకుంది…
ముందే చెప్పుకున్నాం కదా… ఆమధ్య రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వాలు… గవర్నర్ల ఎంపికలు… పంద్రాగస్టు ఎర్రకోట వేడుకల్లో ఆర్ఎస్ఎస్ మీద మోడీ ప్రశంసలు… అన్నీ బీజేపీ మీద మళ్లీ ఆర్ఎస్ఎస్ పట్టు పెరిగిందనీ… మోడీషా నాగపూర్ ఆఫీసు ఆదేశాలను శిరసావహిస్తున్నారని చెబుతూనే ఉన్నాయి… కొన్నాళ్లుగా మోడీషా క్యాంపుకీ ఆర్ఎస్ఎస్‌కూ నడుమ అగాధం నెలకొన్న సంగతి తెలిసిందే…
Ads
ఇప్పుడు తాజాగా మరో ఉదాహరణ ఇది… ఆయన వయస్సు 67 ఏళ్లు… చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ కార్యకర్త… సౌత్‌లో, మరీ ప్రత్యేకించి తమిళనాడు మీద కన్నేసిన బీజేపీ అదే తమిళనాడు నుంచి ఏకంగా ఉపరాష్ట్రపతికే అవకాశం ఇస్తోంది… స్ట్రాటజీ…
ఒక దశలో జేపీ నడ్డా పేరును, రాజనాథ్ సింగ్ పేరును కూడా పరిశీలించారట… రాజనాథ్ సింగ్ సున్నితంగా తిరస్కరించాడు… ఎలాగూ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక చేసుకోవాలి కాబట్టి జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవి తీసుకోవాలని అడిగినట్టు సమాచారం… కానీ ఎందుకో ఆ పేరు వర్కవుట్ కాలేదు… ఆమధ్య బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అవసరం ఏముంది అనడిగాడు కదా… ఆ దెబ్బ పడినట్టుంది…
ఈమధ్య వెంకయ్యనాయుడు ఢిల్లీ వెళ్లి, మోడీతో, ఆర్ఎస్ఎస్ ఆఫీసుతో సంప్రదింపులు జరిపాడు… ఎవరి కోసమో తెలియదు గానీ… రాధాకృష్ణన్ పార్టీలో చాలా సీనియర్… కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచాడు… మరో మూడుసార్లు పోటీచేశాడు… నాలుగేళ్లు తమిళనాడు పార్టీ శాఖ అధ్యక్షుడు కూడా… కేడర్ తనను తమిళనాడు మోడీ అని పిలుస్తుంటారు…
జార్ఖండ్ గవర్నర్‌గా చేశాడు, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నాడు… మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో రాత్రికిరాత్రి రాజీనామా చేయించిన సంగతి తెలుసు కదా… ఇప్పుడిక ఇండికూటమి తన అభ్యర్థి ఎవరో వెల్లడించాల్సి ఉంది… కావాలనే ఎన్డీయే అభ్యర్థి ఖరారు ప్రకటన దాకా ఆగుతోంది అది…
తెలంగాణతో కూడా కొద్దిగా టచ్ ఉంది ఈయనకు… తమిళిసై సౌందర్‌రాజన్ తరువాత కొన్నాళ్లు ఆయనకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్ బాధ్యతలు ప్లస్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు…!!
Share this Article