సాధారణంగా లెఫ్ట్ పార్టీలు అనగానే వయోవృద్ధుల సారథ్యం… ఎన్నేళ్లొచ్చినా పార్టీ పదవుల్ని వదలరు… పాతదనం తొలగిపోతూ కొత్తరక్తం ప్రవహించడం అరుదు… లెఫ్ట్ పతనావస్థ కారణాల్లో ఇదీ ఒకటి… కొత్తతరం కూడా వాటిల్లో చేరడానికి ముందుకురావడం లేదు… దానికీ బోలెడు కారణాలు… కానీ మార్పు అనివార్యమని గ్రహిస్తున్నయ్ ఈ పార్టీలు కూడా..! నమ్మశక్యం కాని గుణాత్మక నిర్ణయాల వైపు కేరళ సీపీఎం మొగ్గుతున్న తీరే దీనికి ఉదాహరణ…
తిరువనంతపురం మేయర్‌గా ఇరవై ఒక్క సంవత్సరాల ఓ విద్యార్థి ఆర్య రాజేంద్రన్ ఎన్నిక కాబోతోంది… వెరీ ఇంట్రస్టింగు… బీఎస్సీ మ్యాథ్స్ సెకండియర్ చదువుతున్న ఈమెది ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం… తండ్రి ఎలక్ట్రిషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్… అయితే ఆర్య రాజకీయాలకు మరీ కొత్తేమీ కాదు… పార్టీ అనుబంధ బాలసంఘంలో ఆరేడేళ్ల వయస్సులోనే సభ్యురాలు… ప్రస్తుతం పార్టీ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు…
Ads
అప్పుడెప్పుడో అలహాబాద్ మేయర్‌గా 23 ఏళ్ల యువనాయకుడు ఎన్నికైతే… ఆర్య 21 ఏళ్లకే ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతోంది… ఆహ్వానిద్దాం… కొత్త ఆలోచనలు, కొత్త రక్తం, కొత్త మొహాలు, కొత్త అడుగులు… అసలు ఆమే కాదు… మరో విశేషం చెప్పుకోవాలి… ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బోలెడు మంది యువ అభ్యర్థులకు అవకాశాలిచ్చింది… అందులో ఎక్కువగా మహిళలు… జనరల్ సీట్లలో దళిత అభ్యర్థులు… మంచి ప్రయోగాలు చేసింది పార్టీ… వారిలో చాలామంది గెలిచారు…
ఇంకో ఇంట్రస్టింగు ఉదాహరణ… ఈమె పేరు శరుతి… లా స్టూడెంట్… కొజిక్కోడ్ జిల్లా, ఎలవన్న గ్రామ పంచాయతీలో ఓ వార్డుకు సీపీఎం నిలబెట్టింది… రోజూ ఇదుగో ఇలా మోటార్ సైకిల్ తీసుకుని, ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేసుకుంది… ఒక్కసారి ఊహించండి… కేరళ రాజకీయ ముఖచిత్రం రాబోయే రోజుల్లో ఎలా మారబోతున్నదో… ఇలాంటి వాళ్లు ఎందరో… సవాల్‌ను స్వీకరించారు… తలపడ్డారు…
తిరువనంతపురమే తీసుకుంటే సీపీఎం 100 సీట్లకు గాను 70 సీట్లలో పోటీచేసింది… అందులో 46 సీట్లు మహిళలకే ఇచ్చారు… చాలామంది 30 ఏళ్లలోపు వాళ్లు, విద్యార్థులు, యువతులు కావడం విశేషం… సీపీఎం మాత్రమే కాదు, సీపీఐ కూడా దాదాపు అంతే… తను 30 సీట్లలో పోటీచేస్తే 18 సీట్లు మహిళలకే ఇచ్చింది… ఈ ట్రెండ్ గమనించిన బీజేపీ కూడా దాదాపు 54 సీట్లలో మహిళలను నిలబెట్టింది… ఓవరాల్‌గా ఈ వంద సీట్లలో సీపీఎం 52 గెలిస్తే, బీజేపీ 35 గెలిచింది…
ఎందుకిదంతా చెప్పుకోవాలీ అంటే… ఇదొక ఉదాహరణ… ఈ మార్పు విస్తరించకతప్పదు… పార్టీలు యువతరాన్ని ఎక్కువగా తెరపైకి తీసుకురాక తప్పదు… ఎస్, ప్రాథమిక స్థాయిలో కొన్ని చిక్కులుంటయ్… పాలన విధానాలు, రాజకీయాల్లో ఎత్తుగడలు గట్రా… సో వాట్..? యూనివర్శిటీ రాజకీయాల్లో నిలబడి, కలబడటం లేదా ఏం..? మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోనూ తట్టుకుంటారు… వెల్ కమ్ న్యూ జనరేషన్స్…!
Share this Article