Prasen Bellamkonda……… జర్నలిస్టుల గురించి బాగా తెలిసిన, జర్నలిజం మీద బాగా కోపం వున్న వ్యక్తి తీసినట్టుంది ఈ న్యూసెన్స్ వెబ్ సిరీస్. విలేకరుల మనస్తత్వం యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ అవగాహన బాగా ఉన్న వ్యక్తి తీసినట్టుంది ఈ సిరీస్.
జర్నలిజంతో దగ్గరి అనుబంధం ఉన్న వారికి బాగా నచ్చే సిరీస్ ఇది. కుక్క బిస్కెట్ల ప్రస్తావన, విలేకరుల ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే వ్యవహారం, కలిసి తిరుగుతూనే ఎవరికి వారు ఎక్స్క్లూజివ్ వార్తలు ఇచ్చుకోవడం, కవర్లు కవరేజ్ లింకేజ్ అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.
అయితే కథ 1973 లో జరుగుతున్నట్టు చెప్పారు కదా ఆ కాలంలో కవర్ల సంస్కృతి లేదే. శివ ప్రింట్ కు వార్తలు ఇస్తున్నట్టు చూపించి ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వార్తలు ఇస్తున్నట్టు చూపారు. అదెలా సాధ్యం. అతను రిపబ్లిక్ అనే పేపర్ కు పనిచేస్తున్నట్టు చెప్పి, రిపబ్లిక్ టివికి వార్తలు ఇవ్వడాన్ని కూడా చూపించారు. పైగా అతనిచ్చిన వార్తలు సిటీ కేబుల్ లోగో ఉన్న ఛానల్ లో ఎయిర్ అవుతుంటాయి. అదెలా…
Ads
అసలు 1973లో విజువల్ మీడియా పూర్తి స్తాయిలో లేదు. ఉన్నా మరీ మరీ నామమాత్రం. మదనపల్లి లాంటి ఊళ్ళో రంగుల ప్రసారాలు, అదీ లోకల్ కేబుల్ లో ఉత్త మాట. ప్రింట్ కి టివి కి ఒక్కరే విలేకరిగా ఉండడం అనేది అప్పటికి ఆలోచనల్లో కూడా ఉండి ఉండదు.
ఇప్పుడు మనం హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నాం అని చెప్పే రిపోర్టింగ్ మదనపల్లె లాంటి పల్లెలకి అప్పటికి చేరనే లేదు. అసందర్భంగా దర్శకుడు ఇప్పటి వాతావారణాన్ని తీసుకెళ్లి 1973 కాలానికి అతికించేసాడు. ఒకటి రెండు చోట్ల 2003 ప్రస్తావన ఉంది. అదీ కన్ఫ్యుజనే. నవదీప్ చాలా బాగా చేసాడు. బిందు మాధవి బాగుంది. నటులందరూ బాగా చేసినట్టే. సంభాషణలు గుడ్. కెమెరా వర్క్ అన్నింటికంటే అచ్చా హై.
ఒకేసారి స్ట్రీం చేసి ఉంటే కచ్చితంగా హిట్ అయుండేది. అసలెటూ కొలిక్కి తేకుండా ముగించి రెండో సీజన్ త్వరలో అనడం విడ్డూరం…
Share this Article