.
యాంటీ హిందూ కుట్రదారుల తదుపరి టార్గెట్స్ ఉడిపి, శృంగేరీ..? ఇప్పుడు ఈ చర్చ కర్నాటకలో బలంగా సాగుతోంది… ఎందుకు..? కాస్త వివరంగా చెప్పుకోవాలి…
ఎవడో వచ్చాడు… అమ్మతోడు, వందల ఆడవాళ్ల శవాల్ని పూడ్చేశాను, ధర్మస్థల యాజమాన్యం బెదిరించి ఈ పని చేయించింది… పశ్చాత్తాపంతో నిద్రపట్టడం లేదు, ఇదుగో శాంపిల్‌గా ఓ పుర్రె అని పోలీసుల దగ్గరకు వచ్చాడు… కమాన్ రండి, తవ్వండి, అన్నీ చూపిస్తా అన్నాడు…
Ads
ఇన్నేళ్లు ఎక్కడో తలదాచుకుంటున్న వ్యక్తి నిజాలు చెబుతున్నాడా..? ఏదైనా భారీ కుట్రకు స్కెచ్ వేశారా..? ఇది ముందుగా ఖరారు చేసుకోకుండా ది గ్రేట్ సిద్ధరామయ్య ప్రభుత్వం ఏకంగా ఓ సిట్ వేసి తవ్వండిరా, తరువాత చూద్దాం అనేసింది… కోట్ల ఖర్చు…
అంతే, అది చాలు… కుట్రదారులకు… ధర్మస్థలను టార్గెట్ చేసి, హిాందూ ధర్మాన్ని, కర్నాటక పీఠాల్ని కొట్టాలనుకున్న కుట్రదారులు రెచ్చిపోయారు… అసంఖ్యాకంగా యూట్యూబ్ చానెల్స్, సైట్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు అదుగదుగో వందల శవాలు అని పాట ఎత్తుకున్నారు… విస్తృతంగా దాడి…
సహజంగానే హిందూ ద్వేషులైన కమ్యూనిస్టులు జతకలిశారు… చివరకు మన సీపీఐ నారాయణ కూడా… తనకు ఏదో పెద్ద తెలుసునన్నట్టు… ఫాఫం సీపీఐ పార్టీ… ఒకరు వంద శవాలు దొరికాయి అంటాడు, మరొకడు 500 అంటాడు… లేదు, లేదు, 1000 అంటాడు మరొకడు… ఇండియా వ్యతిరేకతకు పక్కా తార్కాణ మీడియాగా పేరుతెచ్చుకున్న బీబీసీ కూడా కావల్సినంత పెట్రోల్ పోసింది…
ఈ భారతీయ వ్యతిరేక మీడియాను అడ్డుకోలేనంత అసహాయతలో ఉందా మోడీ ప్రభుత్వం, అదీ పిటీ… సమీర్ అనే యూట్యూబర్ వందల హత్యాచారాలు జరిగాయి అంటూ AI వీడియోలు విడుదల చేశాడు…వాడిపై జనాగ్రహం పెరగడంతో చివరికి కేసు పెట్టారు… ఏ పోలీసుకు సోయి లేదు, ప్రభుత్వానికి అసలే బుద్ధి, సిగ్గు లేవు…
తీరా ఏం జరిగింది..? సదరు విజిల్ బ్లోయర్ (?) కాదు, కాదు, కుట్రలో భాగస్వామి చెప్పిన చోటల్లా తవ్వారు… 16 సైట్లలో… ఒకచోట 15 బొక్కలు, ఓ పుర్రె ముక్క, రెండు దంతాలు దొరికాయి… అవి మగవి… 13 వ సైటులో 50, 60 పీనుగులను పూడ్చాడు అన్నాడు కదా… 8 అడుగుల లోతు దాకా తవ్వినా ఏమీ దొరకలేదు…
మరోచోట ఓ చీరె, కొన్ని బొక్కలు… ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు… మరోచోట ఓ డెబిట్ కార్డు, ఓ పాన్ కార్డు దొరికాయి… అవేమో మొన్నటి మార్చిలో జాండీస్‌తో మరణించిన మగవాడివి… అంతే ఇక… తవ్వకాల దగ్గరకు ఎవరినీ రానివ్వకుండా నిషేధం పెట్టేశారు… తరువాత సదరు విజిల్ బ్లోయరే సిట్ ఎదుట తను ఎవరో పన్నిన కుట్ర ప్రకారం వ్యవహరించానని చెప్పేశాడు…
ఈ కేసుకు ప్రధాన లింకులుగా చెబుతున్నవి మూడు కేసులు… 1, పద్మలత, హత్యాచారం కేసు, 1986-87… 2, సౌజన్య, హత్యాచారం, 2012… 3, అనన్య భట్, అదృశ్యం కేసు, 2003… హఠాత్తుగా అనన్య తల్లి సుజాతా భట్, గత ఏడాది తెరమీదకు వచ్చి, నా బిడ్డ శవాన్ని ఇప్పించండి, అంత్యక్రియలు చేసుకుంటాను అని కోరింది… 20 ఏళ్ల తరువాత..!!
చివరకు ఆమె కూడా ఈ కుట్రలో భాగస్వామి అనీ, ఆమె చెబుతున్నవి ఎలా అబద్ధాలని తేలిందో కూడా మనం నిన్న చెప్పుకున్నాం వేరే కథనంలో…
సో, తెరలు తొలగిపోయాయి… కుట్ర బట్టబయలైంది… కుట్రదారులు అనుకున్నది సాధించేశారు… వాళ్లు అనుకున్నది, కోరుకున్నది విషప్రచారం… చేసేశారు… అప్పుడే అయిపోలేదట, ఇంకా ఏ వ్యూహంతో ముందుకెళ్దాం అని కర్నాటకలో మీటింగులు పెడుతున్నారు…
ధర్మస్థల యాజమాన్యం హెగ్గడే కుటుంబ వారసత్వం… 800 ఏళ్ల నాటి గుడి… ప్రస్తుత ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే … పద్మవిభూషణ్, రాజ్యసభకు నామినేట్ చేయబడిన వ్యక్తి… తనను టార్గెట్ చేయడంతోపాటు గుడిని సర్కారు పెత్తనం కిందకు తీసుకురావాలని మరో గ్రూపు ఈ దుష్ప్రచారాన్ని ప్రమోట్ చేసింది…
కర్నాటకలో చాలా పీఠాలు, ఆశ్రమాలున్నాయి… అన్నదానం, విద్యాదానం ప్రధానమైనవి… ఆధ్యాత్మిక వ్యాప్తి, ధర్మప్రచారం… అవీ యాంటీ హిందూ సెక్షన్ల టార్గెట్స్… అందులో ఫస్ట్ టార్గెట్ ధర్మస్థల… ఇక ప్రధానమైనవి మరో రెండు శృంగేరీ, ఉడిపి… అందుకే అవి నెక్స్ట్ టార్గెట్ అనే చర్చ నడుస్తోంది కర్నాటకలో…
మరొకటీ చెప్పుకోవాలి… శశికాంత్ సెంథిల్ అని ఓ రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి… ఆర్టికల్ 370, సీఏఏ వంటి కారణాలు చెప్పి సర్వీస్ నుంచి వైదొలగగానే, కాంగ్రెస్ తమిళనాడులో ఓ టికెట్ ఇచ్చింది, తను ఎంపీ అయిపోయాడనీ, ఈ ధర్మస్థల కుట్ర వెనుక తనే ఉన్నాడని అక్కడి బీజేపీ ప్రజాప్రతినిధులు (ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే) చెబుతున్నారు…
తను సిద్ధరామయ్యకు కూడా క్లోెజ్ అట… ఇప్పుడు సిట్ తేల్చాల్సింది అసలు కుట్రదారులు ఎవరు..? మోటివ్ ఏమిటి..? సరే, సిట్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతుంది కాబట్టి ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోనక్కర్లేదు… అవునూ, ఈ మొత్తం కుట్రలో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వ్యవహారం ఏమైనా ఉందా..? డీకే శివకుమార్ హఠాత్తుగా ఆర్ఎస్ఎస్ గీతం పాడటం వెనుక ఏమైనా కథ ఉందా..? ఎవరు చెప్పాలి..!?
(కర్నాటకలో ప్రచారంలోకి వస్తున్న కథనాలు, సోషల్ మీడియా విశ్లేషణలు, సందేహాలు ఆధారంగా ఈ కథనం...)
అవునూ, బండి సంజయ్ ధర్మస్థలకు ఎందుకు వెళ్లడం లేదు..?!
ఈ కథనం రాయడం పూర్తయ్యేసరికి ఓ తాజా అప్‌డేట్… ఇదుగో…
(మీకు ఎగువన ఉన్న మహారాష్ట్ర పోలీసులకు అప్పగించండి, అన్ని కథలూ కక్కిస్తారు)
Share this Article