నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో అనూహ్యంగా సక్సెస్… ఈ టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ అవర్స్ సాధిస్తూ, ఓ సూపర్ హిట్ సినిమా స్థాయిలో రన్ అవుతోంది… ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే, వీక్షకుల ధాటిని తట్టుకోలేక ఆహా ఓటీటీ కొన్ని గంటలపాటు క్రాష్ అయిపోయిన సంగతి తెలుసు కదా… అఫ్‌కోర్స్, డిమాండ్‌కు తగినంత సాంకేతిక సన్నద్ధత, ఆమేరకు సర్వర్లు లేకపోవడం ఓ కారణం…
ఆరో తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోయే ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగంలో హీరో గోపీచంద్ కూడా జతకలుస్తున్నాడు కాబట్టి మరింత ఆసక్తిని జనరేట్ చేస్తోంది… ఇదిగిదుగో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ అంటూ ఊరిస్తున్నారు… షూటింగ్ కూడా జరిగింది… కానీ ఇప్పుడప్పుడే ఆ ఎపిసోడ్ రాకపోవచ్చు… కాస్త లేటుగా ప్రసారం అయ్యే సూచనలు ఉన్నాయి… జనవరి 13న వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ రన్ చేయబోతున్నారు… అంటే, సంక్రాంతి తరువాతే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రసారం ఉంటుందానేది సందేహం… జనవరి 12న రిలీజ్ కాబోయే వీరసింహారెడ్డి ప్రమోషన్ కోసం ఉద్దేశించిన స్పెషల్ ఎపిసోడ్‌ను భిన్నంగా రూపొందించినట్టు చెబుతున్నారు…
Ads
ఈలోపు బాలకృష్ణ తెలంగాణ యాక్టింగ్ ముఖ్యమంత్రి కేటీయార్, చిరంజీవి కొడుకు రాంచరణ్‌ను కలిపి ఓ ఎపిసోడ్ చేస్తున్నాడు… ఇంట్రస్టింగు… టాలీవుడ్ ప్రముఖ హీరోలందరితోనూ కేటీయార్‌ను సాన్నిహిత్యం ఉంది, అందరితోనూ బాగుంటాడు… కానీ రాంచరణ్‌తో కాస్త ఎక్కువ బాగుంటాడు… ఇద్దరి నడుమ దోస్తీ బలంగా ఉంది… సో, వాళ్లిద్దరినీ కలిపి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ చేయడం బాగుంది… కేటీయార్ కూడా సందర్భం వచ్చినప్పుడు రాజకీయేతర అంశాలపైనా చురుకుగా స్పందిస్తుంటాడు…
ఎలాగూ సంక్రాంతి వరకూ బాహుబలి ప్రభాస్-2 ఎపిసోడ్ ప్రసారం, తరువాత వీరసింహారెడ్డి ఎపిసోడ్… ఆ తరువాత పవన్ కల్యాణ్ షో ఉంటాయి కాబట్టి కేటీయార్, రాంచరణ్ ఎపిసోడ్ లేటుగా రావచ్చు… ఒకవేళ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా ప్రసారం చేస్తే కేటీయార్ షో ఇంకాస్త లేటుగా కూడా రావచ్చు… ఆ స్పష్టత రావల్సి ఉంది… అన్నీ బాగానే ఉన్నాయి గానీ ముందుగా ఆ సర్వర్ల కెపాసిటీని పెంచుకోవయ్యా అల్లు అరవిందూ… లేకపోతే పవన్ షోతో మళ్లీ కుప్పకూలిపోవచ్చు, అనగా క్రాష్ కావచ్చు..!! ఇప్పటికే ఆ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ క్రియేటై ఉంది… పొలిటికల్ హీట్ కూడా జనరేటవుతోంది దాని మీద… సో, స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే ఒక్కసారిగా జనం ఎగబడే అవకాశం ఉంది…!
Share this Article