.
ఈరోజు వార్తల్లో ప్రధానంగా ఆసక్తిని రేపింది ఒకటుంది… ‘‘200 రోజుల శిక్షణ తీసుకున్నాను, అధ్యక్షపదవి చేపట్టడానికి నేను ఇప్పుడు రెడీ’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటన…
అంటే, ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆల్రెడీ అమెరికా ఉన్నతాధికార యంత్రాంగం ఓ క్లారిటీకి వచ్చేసినట్టేనా..? ప్రస్తుతం తను ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలు, ప్రతీకారాలు, పిచ్చి రాజకీయ వ్యాఖ్యలు… ఏమాత్రం హుందాతనం లేని వాచాలత్వం వేగంగా క్షీణిస్తున్న ట్రంప్ ఆరోగ్య స్థితిని పట్టిస్తున్నాయా..?
Ads
మన తెలుగు ఉష ప్రథమ మహిళ కాబోతోందా..? సకల ఆదేశాలను, అవసరమైతే అణుప్రయోగాలకూ మీటలున్న ఆ ప్రత్యేక సూట్‌కేసు వాన్స్ చేతికి రాబోతోందా..? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలజడికి కారణమవుతున్న ట్రంప్ నిర్ణయాలకు తెరపడుతుందా..?
అసలు చాలా వార్తలొస్తున్నాయి… తన చేతిపై ముదురు రంగు చారలు, తూలుతూ నడవడం, ప్రసంగాల్లో రిపిటెన్సులు, స్థిమితం లేని వ్యాఖ్యలు, కాళ్లపై వాపులు… ఇలా బోలెడు… నిజానికి ట్రంప్ గత అరాచక జీవనశైలికి 79 ఏళ్లపాటు దుక్కలా బతకడమే గ్రేట్… అమెరికాయే కాదు, ఏ దేశ పాలకుడి ఆరోగ్యంపై అసలు నిజాల్ని ఆయా దేశాల యంత్రాంగాలు ఎప్పుడూ బయటపెట్టవు…
చివరకు పుతిన్ వంటి గూఢచార పాలకుడు ఎక్కడికి వెళ్లినా తన మలమూత్రాల్ని కూడా వదిలేయడు అక్కడ… కారణం, తన అనారోగ్యాల్ని గూఢచారులు పట్టేసుకుంటారని సందేహం… మరి ట్రంప్ ఆరోగ్యం…?
జూలై 2025లో, వైట్ హౌస్ ప్రకటించిన ప్రకారం, ట్రంప్‌కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ (CVI) అనే వ్యాధి నిర్ధారణ అయింది… ఈ పరిస్థితి కాళ్లలోని సిరలు రక్తాన్ని గుండెకు తిరిగి పంపడంలో విఫలమవడం వల్ల రక్తం కాళ్లలో చేరడానికి కారణమవుతుంది, దీనివల్ల వాపు ఏర్పడుతుంది… అయితే ఇది 70 ఏళ్లు దాటిన వ్యక్తులలో సాధారణమే అని వైట్ హౌజ్ కొట్టిపారేసింది…
CVI వల్ల కాళ్లలో బరువు, నొప్పి, దురద లేదా తీవ్ర సందర్భాలలో చర్మంపై మార్పులు లేదా పుండ్లు ఏర్పడవచ్చు… బహుశా ట్రంపు చేతులపై, కాళ్లపై కనిపిస్తున్న మచ్చలు, వాపులకు ఇదే కారణం కావచ్చు…
ట్రంప్ చేతులపై గాయాలు (బ్రూయిసెస్) గుర్తించబడ్డాయి, ఇవి జూలై మరియు ఆగస్టు 2025లో ఫోటోలలో కనిపించాయి… వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, ట్రంప్ వైద్యుడు కెప్టెన్ సీన్ బార్బబెల్లా ఈ గాయాలు తరచూ హ్యాండ్‌షేక్‌ల వల్ల, ఆస్పిరిన్ వాడకం వల్ల (ఇది గుండె సంబంధిత నివారణ కోసం తీసుకుంటారు) సంభవించిన స్వల్ప చర్మ ఇరిటేషన్‌గా వివరించారు…
ఇవి రెండూ ఫేకే… ఆస్ప్రిన్ వాడితే గాయాలు, ఇరిటేషన్ గానీ, హ్యాండ్ షేకులతో గాయాలు, మచ్చలు గానీ అబద్ధం అని ట్రంప్ విమర్శకులు అపహాస్యం చేశారు.,. ఈ లక్షణాలకు సీవీఐతో కూడా సంబంధం లేదు… అంటే ఇంకేదో అనారోగ్య కారణం ఉండి ఉంటుంది…
స్మోక్ చేయడు, మందు తాగడు… కొంతమేరకు ఒబేస్… వ్యాయామం చేయడు, గోల్ఫ్ ఆడతాడు అప్పుడప్పుడూ… ఇదీ తన వ్యక్తిగత ఆరోగ్యనిపుణులు చెప్పేమాట… అన్నింటికీ మించి ట్రంప్ దైహిక స్థితి కాదు ఇప్పుడు… ప్రపంచమంతా అనుమానిస్తున్నది తన మానసిక ఆరోగ్యం, అభిజ్ఞా సామర్థ్యం…
2018లో, ట్రంప్ మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్ (MoCA) పరీక్షలో 30/30 స్కోరు సాధించినట్లు చెప్పబడింది… ఇది అసాధారణ మెదడు పనితీరును సూచిస్తుంది… అయితే, 2024లో, ఈ పరీక్ష ఫలితాలు పాతవని, ప్రస్తుత స్థితిని సూచించబోవని ఈ పరీక్ష సృష్టికర్త జియాద్ నస్రెడ్దీన్ అంటున్నాడు…
కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణుల విశ్లేషణ వేరు… ట్రంప్ మాటలు, ప్రవర్తనలో అసంగతత, ఆలోచనలలో తడబాటు, పునరావృతాల ప్రసంగం వంటి లక్షణాలను గమనించారు.., ఇవి మానసిక అనారోగ్యానికి సంకేతాలు కావచ్చనంటున్నారు…
సూచించారు. అయితే, ఈ విశ్లేషణలు వివాదాస్పదంగా ఉన్నాయి, ఎందుకంటే అవి వ్యక్తిగతంగా పరీక్షించకుండా చేసినవి, ఇది అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ యొక్క గోల్డ్‌వాటర్ రూల్‌ను ఉల్లంఘిస్తుంది.
తను రోసువాస్టాటిన్, ఈజెటిమిబ్ (కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం), ఆస్పిరిన్ (గుండెపోటు, రక్తం పలుచన కావడం కోసం), మోమెటాసోన్ క్రీమ్ (చర్మ పరిస్థితి కోసం) తీసుకుంటున్నట్టు వైట్ హౌజ్ క్లారిటీ… గతంలో కోవిడ్-19 సోకింది (2020లో).., రోసేసియా (చర్మ వ్యాధి).., బెనైన్ కొలోన్ పాలిప్ వంటి వైద్య చరిత్ర తనది…
హైపర్ కొలెస్ట్రోలెమియా (అధిక కొలెస్ట్రాల్) ఉంది, కానీ పెరగకుండా చూస్తున్నారు… (పాలకులు- అధిక కొవ్వు అనేది వేరే విషయం)… రాత్రికి 4- 5 గంటలు మాత్రమే నిద్రిస్తాడు… అతను వ్యాయామం శరీర శక్తిని వృథా చేస్తుందని నమ్ముతాడు, అందుకే నో ఎక్సర్‌సైజెస్… ఓన్లీ గోల్ఫ్, అదీ టైం దొరికినప్పుడు…
పాపం శమించుగాక… ప్రపంచదేశాలన్నీ ట్రంప్ వైపే చూస్తున్నాయి… ఏమైంది తనకు అని..! ఒకవేళ ఏమైనా జరిగినా.,. జేడీ వాన్స్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించినా… బాధపడే దేశం ఒక్కటైనా ఉండదు… ఒక్క పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు మినహా… వాడు ట్రంప్ కొత్త వ్యాపార భాగస్వామి, దోస్త్..!!
Share this Article