నిజమే… ఒక వార్త కలిచివేసినట్టయింది… హైదరాబాద్ నిమ్స్‌కు బోలెడంత ప్రతిష్ట ఉంది… ఇతర దేశాలు సహా, ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తారు… అత్యంతాధునిక సౌకర్యాలు, వీవీఐపీలకు కూడా ట్రీట్‌మెంట్లు, నిపుణులైన డాక్టర్లు… వాట్ నాట్..? ఏ ప్రఖ్యాత కార్పొరేట్ హాస్పిటల్‌కు ఏమాత్రం తీసిపోదు… కానీ దాని అధిపతే తన చికిత్స కోసం అపోలో హాస్పిటల్‌లో చేరాడు… తద్వారా ఆ హాస్పిటల్ ప్రతిష్టను, అక్కడి డాక్టర్ల నైపుణ్యాన్ని, ఉద్యోగుల ప్రతిభను, స్థూలంగా ప్రభుత్వం పరువును కూడా నిలువెత్తు లోతులో పాతేశాడు…
నిమ్స్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు Madivada Rama Brahmam ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టి కడిగేశాడు… తన ఆవేదనలో, తన ఆరోపణలో తప్పేమీ లేదు… ఒక ఫేమస్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌ను సాక్షాత్తూ దాని బాసే దెబ్బతీయడం దారుణం… తనే వేరే ప్రైవేటు హాస్పిటల్‌లో చేరితే, ఇక తన హాస్పిటల్‌కు వచ్చే రోగులకు ఏం సందేశం ఇస్తున్నట్టు..? ఏం భరోసా కల్పిస్తున్నట్టు…? అదీ కేవలం స్టంట్లు వేసే పనికి… నిమ్స్‌లో కార్డియాలజీ విభాగానికి స్టంట్లు వేయడం అనేది మంచినీళ్లు తాగినంత ఈజీ పని… ఈ చిన్న చికిత్సకు కూడా ఆయనకు తన హాస్పిటల్ మీద భరోసా లేకుండా పోయిందా..?
కార్డియాలజీయే కాదు, వైద్యానికి సంబంధించిన దాదాపు ప్రతి విభాగంలోనూ మెరికలున్నారు అక్కడ… ఎటొచ్చీ ఇలాంటి బాసులు ఉండటమే దానికి చికిత్స లేని వ్యాధి… రామబ్రహ్మం పోస్టు ఓసారి యథాతథంగా చదవండి…
Ads
కార్పోరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో వైద్యం అందించే వైద్య నిపుణులు, పరికరాలు ఉన్న ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రికి అధిపతిగా ఉండి… తాను మాత్రం కార్పొరేట్ ఆస్పత్రిలోని సేవల కోసం వెళ్ళాడు అంటే … ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారికి జరిగిన అవమానమే కాదు… మొత్తం నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టకు జరిగిన తీవ్ర అవమానం.
– మాదివాడ రామబ్రహ్మం,
మాజీ అధ్యక్షుడు, నిమ్స్ ఉద్యోగుల సంఘం.
అపోలోలో తన కుటుంబ వైద్యుడు ఎవరో పనిచేస్తున్నారట, అందుకని అక్కడ చికిత్సకు చేరాడట… (నిమ్స్‌కే రప్పించుకుని, చేయించుకోవచ్చు కదా లోపాయికారీగా…) ఈ సమర్థన ప్రయత్నం కూడా ఇంకా అబ్సర్డ్… ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి…!!
Share this Article