Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!

August 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి . అలాంటి వాటిల్లో ఒకటి ఈ నిరీక్షణ సినిమాలో అర్చన నటించిన తులసి పాత్ర . ఆమె కెరీర్లో ఓ మెచ్చుతునకలాగా నిలిచిపోయిన సినిమా . సినిమా అంతా బ్లౌజ్ లేకపోయినా ఎలాంటి అసభ్యతా , విమర్శలు లేకుండా రాకుండా జనం మెప్పు పొందిన సినిమా …

  • 1985 లో మళయాళంలో హిట్టయిన యాత్ర సినిమాకు రీమేకే 1986 లో వచ్చిన మన నిరీక్షణ .‌ మళయాళంలో మమ్ముట్టి , శోభనలు హీరోహీరోయిన్లుగా నటించారు . ఈ మళయాళం సినిమాకు స్ఫూర్తి జాపనీస్ భాషలో 1977 లో వచ్చిన The Yellow Handkerchief అనే సినిమా . మన తెలుగు సినిమా తమిళంలోకి డబ్ చేయబడింది .

ఈ సినిమాలో రెండు విభిన్న భాగాలు , కోణాలు ఉన్నాయి . ఒక కోణం హీరోహీరోయిన్ల మధ్య అమరప్రేమ , బాలూ మహేంద్ర కెమెరా నుండి సృష్టించబడిన ప్రకృతి అందాలు కలబోసిన దృశ్య కావ్యం . రెండో కోణం విధి వికృత క్రీడ , పోలీసుల దమనకాండ , మానవ హక్కుల హననం వంటి భీభత్స , విషాద సన్నివేశాల మిళితం . డబుల్ మీఠా స్వీట్ + గుంటూరు కారం .

Ads

ఎవరూ లేని ఓ అనాధ సినిమాలో హీరో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భానుచందర్ . ఉద్యోగార్ధం ఓ అందమైన కొండ ప్రాంతానికి వచ్చి ఓ ప్రకృతి సుందరి ప్రేమలో పడిపోతాడు . పెళ్ళి సమాచారాన్ని ఇవ్వటానికి తనకున్న ఒకే ఒక్క మిత్రుడి కోసం వెళ్ళి తీవ్రవాదిగా పొరపాటు పడిన పోలీసుల చేతిలో చిక్కుతాడు . అక్కడ పోలీసుల అఘాయిత్యాలకు తిరగబడి అనుకోకుండా ఒక పోలీస్ మరణానికి కారణం అవుతాడు .

పదేళ్ళు జైలులో కఠిన శిక్షతో పాటు జైలర్ల హింసకు గురవుతాడు హీరో . జైలుకొచ్చిన ప్రకృతి సుందరితో జైలు పోలీస్ అసభ్యతగా ప్రవర్తిస్తే జైలుకు కూడా చూడటానికి రావద్దని ఉత్తరం వ్రాస్తాడు . శిక్ష పూర్తయ్యాక తిరిగి కొండ ప్రాంతానికి వెళ్లి తన కోసమే నిరీక్షిస్తున్న ప్రియురాలిని కలవటంతో సినిమా ముగుస్తుంది .

సినిమాలోని ప్రేమ భాగమంతా మనల్ని తెలియని సుందర లోకాల్లో విహరింపచేస్తుంది . అర్చన నల్లందాలు ప్రేక్షకుల మనసును దోచేస్తాయి . ఆమె కళ్ళు , నటన , చిలిపి అందం ఈరోజుకీ ప్రేక్షకులు మరచిపోలేని విధంగా బాలూ మహేంద్ర లెన్సులో బిగించారు .

ఆయన పనితనం ఊరకపోలేదు . ఉత్తమ సినిమాటోగ్రాఫర్ నంది అవార్డు వచ్చింది . అంత అందంగా నటించిన అర్చనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు వచ్చింది . అర్చనకు ఎలా పేరొచ్చిందో భానుచందరుకి కూడా అంత పేరొచ్చింది ఈ సినిమా ద్వారా . అలాగే పోలీసుల దౌర్జన్యకాండ సినిమా రీళ్ళల్లో , నిజ జీవితంలో , తెనాలిలో మనం నిత్యం చూస్తూనే ఉన్నా అయ్యో అన్యాయం అని అనిపిస్తుంది . ఒకప్పుడు ఓ జైల్లో ఖైదీలను గుడ్డి వాళ్ళను చేసిన సంఘటన గుర్తుకొస్తుంది . అదసలు జరగనే లేదనే వారూ ఉన్నారనుకోండి .

ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవటానికి మరో కారణం ఇళయరాజా మధుర సంగీతం . జానకమ్మ పాడిన ఆకాశం ఏనాటిదో అభిమానం ఆనాటిది పాట శ్రావ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే . గుండెల్ని పిండేసే పాట జేసుదాస్ పాడిన చుక్కల్లె తోచావె వెన్నెల్లె కాచావె పాట . మరో శ్రావ్యమైన పాట విహారయాత్ర లోని విద్యార్థులు పాడే పాట . తీయని దానిమ్మ పాట . అద్భుతమైన కెమెరాతనంతో ఉండే గ్రూప్ డాన్స్ యమునా ఎందుకు నువ్వు అనే పాట . It’s a visual feast . పాటలన్నీ unmissable .

లింగరాజు నిర్మాత . కధను అహిల మహేంద్ర అందించగా స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , ఫొటోగ్రఫీ , దర్శకత్వాలను బాలూ మహేంద్ర నిర్వహించారు . జంధ్యాల సంభాషణలను చేకూర్చారు .

  • అర్చన పుట్టింది విజయవాడే అయినా పెరిగిందంతా తమిళనాడే . ఫిలిం ఇన్స్టిట్యూటులో తర్ఫీదు అయిన ఆమె గొప్ప కూచిపూడి , కథక్ నృత్యకారిణి . తన నాట్య కౌశల్యాన్ని చూపేందుకు ఎలాంటి పాత్ర రాలేదనే ఆవేదన ఉంది ఆమెకు . ఆలీతో సరదాగా వీడియో యూట్యూబులో ఉంది . ఆమె అభిమానులు చూడవచ్చు పూర్తి వివరాలకు . (ఆమె రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డుల గ్రహీత)

నా నల్ల రంగే నా బలం అని ధైర్యంగా చెప్పే ఆత్మాభిమానం కల మహిళ . ఇరవై అయిదు సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చి షష్టిపూర్తి అనే సినిమాలో నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో పి యల్ నారాయణ , జైలరుగా సత్యనారాయణ , రాళ్ళపల్లి , నిర్మలమ్మ , పి జె శర్మ , నర్రా , అల్లు రామలింగయ్య , ప్రభృతులు నటించారు .

సంతోషం ఏమిటంటే బాలూ మహేంద్ర సినిమాను విషాదాంతం చేయలేదు బాలచందర్ మోడల్లో . ముగింపులో ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణానంతర కలయిక ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించినా పోనీలే పాపం కలిసారు అనే నిట్టూర్పుతో థియేటర్లలో నుండి బయటకు వెళతారు .

ఇంతకుముందు చూడనట్లయితే అర్జెంటుగా చూసేయండి . నల్లందాల ప్రేమికులు ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు . కాకపోతే పోలీసుల దౌర్జన్యపు సీన్లను చూడకుండా లాగించేయాలి . ఆ భీభత్సాన్ని ఎక్కడ చూసి చస్తాం ! ఇది ఆర్ట్ ఫిలిమా లేక కమర్షియల్ మూవీయా అంటే చెప్పటం కష్టమే . More a visual and musical splendour than a commercial one . #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions