.
ఒక వార్త… దాదాపు మొత్తం జాతీయ మీడియాలోనూ ఒకేరకం హెడింగుతో… కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అక్టోబరు 23న ‘సర్’ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనబోతున్నాడు… ఇదీ వార్త…
చాలామంది సోషల్ మీడియాలో రాస్తున్నారు… ‘‘అసలు ఏమిటీ ఈ అన్యాయం..? తనకంటూ ఓ ఐడెంటిటీ లేదా..? బహుశా ఆమెకన్నా ఎక్కువ చదివి ఉంటాడు తను… ఆయన తండ్రి పరకాల శేషావతారం 45 ఏళ్ల క్రితమే మంత్రి… ఐనా సరే, ఇప్పటికీ ప్రభాకర్ పేరు రాసేటప్పుడు నిర్మలా సీతారామన్ భర్త అంటున్నారు…’’
Ads
మీడియా కోణంలో… తను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అని రాయడమే ఆప్ట్… అదే జర్నలిస్టిక్ టచ్… ఎందుకంటే..? సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రి భర్త స్వయంగా ఈ ‘సర్’ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నాడు అని రాస్తేనే దాని ఇంపాక్ట్, దాని పంచ్… కేవలం ఓ పరకాల ప్రభాకర్ అని రాస్తే అందులో పంచ్ ఏముంది..?
చూశారా, ఓ కేంద్ర మంత్రి భర్త కూడా ‘సర్’ను వ్యతిరేకిస్తున్నాడు అనే బలమైన పాయింట్ కన్వే కావాలంటే ఆయన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అని సంబోధించడమే కరెక్టు… సరే, ఇద్దరూ విడివిడిగా బతుకున్నారా..? సొంత బిడ్డకే రాలేదట, నిజమేనా..? ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతం… ఇప్పటికైతే అధికారికంగా భార్యాభర్తలే కదా…
ఐడెంటిటీ విషయానికి వద్దాం… పరకాల ప్రభాకర్ జాతీయ స్థాయిలో ఎవరికి తెలుసు..? ఆయన తండ్రి నేపథ్యం ఎవరికి తెలుసు..? ఢిల్లీలోని ఒక జర్నలిస్టుకు తను కేవలం నిర్మలా సీతారామన్ భర్తగానే తెలుసు… అదీ తెలుగు జర్నలిస్టులకు, మిగతా భాషల జర్నలిస్టులకు అదీ అక్కర్లేదు… తను కొంతకాలం సీఎం మీడియా సలహాదారుగా పనిచేశాడు, తరువాత అదీ లేదు…
ఇప్పుడు ‘సర్’ వ్యతిరేక అందోళనే కాదు… మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్, అక్రమాల కారణంగానే ఏపీలో టీడీపీ కూటమికి అన్ని సీట్లు వచ్చాయని బోలెడు మీడియా డిబేట్లలో చర్చిస్తున్నాడు… సరే, ఒక ప్రకాశ్ రాజ్, ఒక పరకాల ప్రభాకర్… Who Cares..? నిష్ఠురంగా ఉన్నా సరే, ఇదే నిజం…

ఐడెంటిటీ విషయాన్ని మరో కోణంలో చూద్దాం… ఏం..? ఒక మహిళ భర్త అని రాస్తే అదేమైనా చిన్నతనమా..? నామర్దా అవుతుందా..? మహిళలు తమ పేర్ల తరువాత తండ్రుల పేర్లను పెట్టుకోవడం లేదా..? పెళ్లయ్యాక తెలుగు కుటుంబాల్లో భర్తల పేర్లను యాడ్ చేసుకోవడం లేదా..? తద్వారా ఆయా మహిళలకు భర్తల పేర్లతో విలువ అని ఆక్షేపించాలా..? భర్తల పేర్లు జతకలవకపోతే, ఎంత ఎదిగినా సరే, ఇక వాళ్లకు సొంత ఐడెంటిటీ లేనట్టేనా..? అదెందుకు మాట్లాడరు..? అసలు ఎందుకు ఈ వాదన..?
నిష్ఠురంగా, కటువుగా, పరుషంగా ఉన్నా సరే… ప్రస్తుతానికి పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి జస్ట్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త… అంతకుమించి తనకు జాతీయ స్థాయిలో ఏ ఐడెంటీటీ వాల్యూ లేదు…!!
Share this Article