“బ్రాహ్మణ్ ద గ్రేట్”… ఒక కులం మీద రాయబడిన పుస్తకం… రాసింది నియాజ్ ఖాన్… ఇంట్రస్టింగు కదా… బహుశా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన పోస్ట్ అయి ఉంటుంది… వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది… కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి… సంక్షిప్తంగా ఓ లుక్కు వేద్దాం… ఆ బుక్ వచ్చాక మళ్లీ మాట్లాడుకుందాం అందులోని మెరిట్, డీమెరిట్‌ల గురించి…
భారతీయ సమాజంలోని డౌన్ ట్రాడెన్ సెక్షన్‌లో బ్రాహ్మణ వ్యతిరేకత పెరుగుతూ కనిపిస్తుంది… మన సొసైటీ లాభనష్టాలకు బ్రాహ్మణులనే బాధ్యులను చేస్తూ చర్చలు సాగుతూ ఉంటాయి… ఎక్కడ ఓ సోషల్ వివాదం తలెత్తినా మనువాదంతో, బ్రాహ్మణిజంతో ముడిపెట్టి అరివీర భీకరంగా మాట్లాడేవాళ్లు ఉంటారు… వాళ్లను ప్రశంసించేవాళ్లూ ఉంటారు… మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన నియాజ్ ఖాన్ ఈ పుస్తకం రాశాడు… ఏముంది అందులో..?
మునేష్వర్ కుమార్, నవభారత్ టైమ్స్ పాత్రికేయుడు– తను ఈ పుస్తకంపై రచయితతో మాట్లాడాడు… ‘‘దేశంలో బ్రాహ్మణుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంది. మోహన్ భగవత్ వ్యాఖ్యల తరువాత వివాదం, చర్చ మరింత పెద్దదైంది… మీరు బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే కులాధారిత పుస్తకం రాశారు… ఇది ఎందుకు రాశారు.., ఇందులో ఏముంది..?
Ads
నియాజ్ ఖాన్ ఏమంటాడంటే… ‘‘మోహన్ భగనత్ ఈ మధ్యనే ట్వీట్ చేశారు… నేను బ్రాహ్మణులకి సంబంధించి చాలా కాలంగా రిసెర్చ్ చేస్తున్నాను… పుస్తకంలోని విషయమేమిటంటే.., నేను వేదాల్ని అధ్యయనం చేసాను. పురాణాల్ని అధ్యయనం చేసాను. ఉపనిషత్తులను చదివాను. ప్రత్యేకంగా కౌటిల్యుని జీవిత చరిత్ర అధ్యయనం చేశాను. అదీ నా ప్రేరణ…
3 వేల సంవత్సరాల చరిత్రని తిరగేసినప్పుడు బ్రాహ్మణుల విశిష్టత దేశంలో చాలా సుదృఢంగా ఉంది… పూజ, ఆధ్యాత్మిక విద్య, ఇతర సంస్కారాల్ని అందించడంతో పాటు ఉపాధ్యాయులుగా పని చేశారు… అవసరమైన ప్రతి సందర్భంలో దేశానికి సహకరించారు. దేశ సీమలకి బలాన్ని చేకూర్చారు. నాకు ఇది ఒక ప్రత్యేకమైన విషయం అనిపించింది. 3000 సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన ఈ కమ్యూనిటీపైన ఒక పుస్తకం రాయాలని అనిపించింది. ఈ ప్రేరణతోనే బ్రాహ్మణ్ ద గ్రేట్ అనే పుస్తకం రాబోతోంది…
దక్షిణ, ఉత్తర భారత దేశాల బ్రాహ్మలకి సంబంధించి అధ్యయనం చేశాను. ఉపనిషత్తుల విజ్ఞానాన్ని గురించి చదివాను. దధీచి గురించి చదివాను. ఇలా విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేసిన తరువాత గత 50-70 సంవత్సరాల వెనక బ్రాహ్మణుల స్థితి ఎలా ఉంది, 3000 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, స్వాతంత్ర్యం వచ్చాక వీరి స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశాను. తరువాతే ఈ నవల రాసాను.
పాత్రికేయుడు– బ్రాహ్మణులు బ్రహ్మద్వారా సృష్టించబడ్డారని మీరు ఒక ట్వీట్ చేశారు. మీరు బ్రాహ్మణలని ఎందుకు సమర్ధిస్తున్నారనే వ్యాఖ్య కూడా వచ్చింది…
ని.ఖా.- డార్విన్ (Charles Robert Darwin), హార్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer) ద్వారా ప్రతిపాదిత పరిణామ సిద్ధాంతం (Theory of evolution) ప్రకారం కాలంతో పాటు ఏ జీవరాశి అయితే మనగలుగుతుందో అది మాత్రమే భూమిపై జీవించి ఉంటుంది. దీని ఆధారంగానే బలం ఉన్నవాడే జీవిస్తాడు (Survival of the fittest) అనే సిద్ధాంతం వచ్చింది. ఈ విధంగా 3000 సంత్సరాల చరిత్రని తిరగేస్తే అనే భూకంపాలు, తుఫాన్లు వచ్చాయి. విదేశాల నుండి వచ్చి పాలన చేసారు. బ్రాహ్మణుల వ్యవస్థ, పరంపర కొనసాగుతూ వచ్చింది. వేదాలు, వారి సామాజిక గతి నడుస్తూనే ఉంది. ఎన్ని విషమ పరిస్థితులు వచ్చినా బ్రాహ్మణులు జీవిస్తూ వచ్చారు. కేవలం జీవించడం కాదు, దేశ గౌరవాన్ని ముందుకి తీసుకు వెళ్ళారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో బలాన్ని అందించారు. ఈ దేశ గొప్ప సంస్కృతిని నిలిపి ఉంచారు. చరిత్ర తిరగేస్తే వీళ్ళు గొప్పగా రాణించారని, వారికి ఇచ్చిన పనిని గొప్పగా నిర్వర్తించారని చెప్పాను…
పాత్రికేయుడు- మీరు వేదాలు ఇతర గ్రంథాల గురించి ప్రస్తావించారు. ఈ మధ్యనే దేశంలో రామచరిత్ మానస్, మరి కొన్ని పుస్తకాలకి సంబంధించి అనేక వాదోపవాదాలు వస్తున్నాయి…
ని.ఖా : ‘‘నేను ఇటువంటి వివాదాలలో పడదలుచుకోలేదు. నా విషయం భిన్నమైనది. నా అధ్యయనం బ్రాహ్మణుల ఐ.క్యూ., పుట్టుకతో వచ్చిన గుణాలు వాళ్ళ పనితీరుకి సంబంధించినది. దేశంలోని వర్ణ వ్యవస్థ, అసృశ్యత, ద్వేషం లాంటి విషయాలపై నేను ఏ మాత్రం వెళ్ళదలుచుకోలేదు. నేను వీరిని ప్రపంచంలో ఒక గొప్ప మేధావి వర్గంగా ఉన్నారనే అనుకుంటున్నాను. నేను ప్రతిభ చూపిన గొప్ప గొప్ప సాధు, సంతులు, రుషులు, జ్ఞానులు, ఆచార్యులుగా దేశం కోసం ఎంతో చేసిన ఆ వర్గం యొక్క కర్మపైనే నా పుస్తకం… అంతే…
ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఏ పుస్తకాన్ని తీసుకున్నా ప్రతీ వ్యక్తి వాటితోనే సంతృప్తి చెందడు.. ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తాడు. కాబట్టి నేను వీటి లోతుల వైపుకి వెళ్ళను. నేను వర్ణ వ్యవస్థని సమర్ధించను. ద్వేషాన్ని సమర్ధించను. నా పుస్తకంలో ఎటువంటి ద్వేషము కనిపించదు. నాకు తెలిసి మన దేశంలో ఒక గొప్ప జాతిగా (బ్రాహ్మణ) ఉండేది. వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పుడు, అది ఎవరి పట్ల ద్వేషంతో కూడినది కాక సమాజం సౌఖ్యంగా కొనసాగడానికి ఏర్పడిన పని విభజన మాత్రమే. కాలంతో పాటు ద్వేషం విస్తరించింది… బ్రాహ్మలు ద్వేషానికి బదులు దేశం యొక్క ఏకత్వం కోసం పని చేశారు. అందరి కోసం పని చేశారు. ప్రేమ పంచారు. వాళ్ళ ఆశీర్వాదం అందరికీ ఉంటుంది… నా అవగాహన ఇదే…
నా నవల ఒక కాల్పనిక కథ. కానీ ఇది భారతదేశాన్ని దర్శింపజేస్తుంది. మంచి నవల. మంచి కథ ఉంది. బ్రాహ్మణులను కేంద్రంగా పెట్టుకుని నవల యొక్క కథ ముందుకి సాగుతుంది… ఇవాళ కాకపోతే రేపు ఎవరో ఒకరు రాస్తారు. బ్రాహ్మల చరిత్రలో చాణుక్యుడు లాంటి వ్యక్తి, ఉన్నాడు… అతడు వ్యూహకర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ఆచార్యుడు, ఇలా అనేక గుణాలతో నిండిన వాడు. అలాగే దధీచి, పరశురాముడు… వీళ్ళ చరిత్ర చాలా గొప్పది. ఖచ్చితంగా ఈ వర్గం మంచి కథావస్తువు. గొప్ప కథ.
వాస్తవానికి కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నాకు మంచి భావనే ఉంది. బ్రాహ్మలు నిజంగా చాలా బాధని అనుభవించారు. అందుకే సినిమా బాగా ఆడింది, డబ్బు వచ్చింది. కాబట్టి బ్రాహ్మలకి సహాయం అందించడానకి ఆ డబ్బు వెచ్చించడం నైతిక బాధ్యత అనేది నా ఉద్దేశం… దాన్ని కూడా వివాదం చేశారు కొందరు….’’
Share this Article