పొన్నియిన్ సెల్వన్ సినిమాపై మొత్తం ప్రపంచవ్యాప్త తమిళజనం ప్రేమ కురిపించింది… ఓన్ చేసుకుంది… సినిమా బాలేదంటే తగాదాలు పెట్టుకుంది… కారణం, అది తమిళంలో ప్రసిద్ధిపొందిన ఓ నవలకు సినిమారూపం… మొత్తం నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించడమే పెద్ద టాస్క్… ఆ పనిని మణిరత్నం విజయవంతంగా చేయగలిగాడు…
అంతేకాదు, హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్యా రాయ్‌ను తీసుకున్నాడు… (అఫ్ కోర్స్, ఐశ్వర్య పట్ల మణిరత్నానికి అభిమానం ఎక్కువ…) కార్తి, విక్రమ్, త్రిష, ఇంకో తమిళ ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితర భారీ తారాగణం ఉంది… కాకపోతే అందరూ తమిళమే… పైగా ఆ పాత్రల పేర్లు, ఆ కథ మిగతా భాషల్లోని ప్రేక్షకులకు అర్థం కాలేదు, ఎక్కలేదు… మణిరత్నం మీద నమ్మకం, అభిమానం ఉన్నా సరే, పొన్నియిన్ సెల్వన్ చూడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు, సాహసం చేయలేదు… అది మణిరత్నం ఫెయిల్యూరే…
ఫస్ట్ పార్ట్‌లో ఎక్కువగా పాత్రల పరిచయానికే ఎక్కువ టైమ్ తీసుకుంది… పాన్ ఇండియా రేంజులో విడుదల చేశారు కానీ తమిళనాడులో తప్ప ఇంకెక్కడా పెద్దగా నడవలేదు… హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో పూర్ రెస్పాన్స్… ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే దాదాపు సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు కాబట్టి, ఇంకా చెప్పాల్సిన కథ మిగిలిపోయింది కాబట్టి… సెకండ్ పార్ట్ విడుదల చేయకతప్పదు… తమిళంలో మళ్లీ జనం విరగబడి చూస్తారు కూడా… కానీ..?
Ads
ఎటొచ్చీ ఇతర భాషల్లోనే బయ్యర్లు దొరకడం లేదు… తెలుగునే తీసుకుందాం… దాదాపు 10 కోట్ల దాకా బిజినెస్ జరిగితే… కష్టమ్మీద 15 రోజులు దాటాక ఆ మార్క్ చేరుకుంది… చేతులు కాలలేదు కానీ బ్రేక్ ఈవెన్ అయ్యేదాకా తెలుగు బయ్యర్ల గుండెలు దడదడలాడిపోయాయి… సో, ఈసారి బయ్యర్లు అసలు కొనే సాహసం చేయడం లేదు… సేమ్, హిందీ, కన్నడ మార్కెట్ కూడా అలాగే ఉంది…
ఫస్ట్ పార్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లను దాటి వసూళ్లు సాధించిన సినిమా సీక్వెల్‌కు ఇదీ దురవస్థ… ఆ కథాకథనాలే గందరగోళం అనుకుంటే సంగీతం అసలు ఏమాత్రం ఇతర భాషా ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు… మణిరత్నంలో ఉన్న దుర్గుణం ఇదే… తమిళంలో పాటలు బాగా వస్తే చాలు అనుకుంటాడు… మిగతా భాషల్లోకి డబ్ చేసే సమయంలో కూడా సంగీత జాగ్రత్తలు తీసుకోవాలనే సోయి కనిపించదు… వెరసి ఇతర భాషా ప్రేక్షకుల్లో ఇజ్జత్ పోగొట్టుకున్నాడు…!!
ఏమాటకామాట… మణిరత్నం తన మ్యాజిక్ కోల్పోయాడు… ఇది తన లైఫ్ యాంబిషన్ అన్నాడు… తనూ డబ్బులు పెట్టాడు… తన కల నెరవేరింది… అంతే… ఇక తరువాత కాలంలో మణిరత్నం మళ్లీ సినిమా తీస్తాడా అనేది డౌటే…!
Share this Article