అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది… తెలంగాణలో కూడా ఓ సర్కారు ఉంటే బాగుండునని..! సినిమాలు, మాల్స్, హాస్పిటల్స్, కాలేజీలు… ఏ ప్రైవేటు సంస్థ చూసినా సరే దోపిడీ… నియంత్రణే లేకుండా పోయింది… ప్రైవేటు బస్సుల విషయానికొస్తే పూనం మాలకొండయ్య రవాణా శాఖ చూసినప్పుడు ఒక్కొక్కడి తాట తీసింది… ఇప్పుడు అసలు రవాణా శాఖకు కార్యదర్శే లేనట్టుగా ఉంది పరిస్థితి…
మార్నింగ్ స్టార్ అనబడే బస్ సర్వీసుతో బహుపరాక్… ఆ సర్వీసు, బస్సుల కండిషన్ మన్నూమశానం సంగతి గురించి కాదు చెప్పుకునేది… అసలు ఒకసారి టికెట్ బుక్ చేస్తే ఇక కేన్సిల్ చేయరట… రైలు సర్వీసు, విమాన సర్వీసు, ఇతర సంస్థల బస్సులు… ఏదైనా సరే, టికెట్ బుక్ చేసుకున్నాక ఎంతోకొంత చార్జి కట్ చేసి, మిగతా డబ్బు వాపస్ ఇస్తారు కేన్సిల్ చేసుకుంటే…
అది వినియోగదారుడి హక్కు… కానీ మన స్వర్ణతెలంగాణలో ఇలాంటి హక్కులు గిక్కులు జాన్తానై కదా… పైగా ఆయనెవరో అస్మదీయుడేనట… ఇంకేం..? అసలు టికెట్ కేన్సిల్ చేసుకుంటే పైసా కూడా వాపస్ ఇవ్వనుపో అంటున్నాడు… నిజం… స్వీయ అనుభవమే… అదేమంటే నీ టికెట్ పైనే రాసి ఉంది చూసుకోపో అంటున్నాడు… (ఈ-టికెట్)…
Ads
ఇప్పుడు రెడ్ బస్ వంటి థర్డ్ పార్టీ టికెట్లు బుక్ చేస్తూ ఉంటుంది కదా… టికెట్ కేన్సిలేషన్ గట్రా మీరూ, ఆ బస్సు వాడు చూసుకొండి, మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తాయి అవి… ఈ బస్ ఆపరేటర్ దొరకడు కదా… మధ్యలో కస్టమర్ కేర్ నంబర్ పొరపాటున తగిలితే ఎవరో అర్ధజ్ఞాని తగుల్తాడు… టికెట్ పైనే రాశాం కదా అనే మాటకు కట్టుబడి ఉంటాడు… వాడికిి తెలుసు కదా, ఈ చిన్న మొత్తాలకు మనం కోర్టులకు వెళ్లి, వాడిని ఎలాగూ బోనులో నిలబెట్టలేం… డబ్బు, అధికారం మద్దతు ఉన్నవాళ్లు కాబట్టి వాళ్లు ఏం చేసినా చెల్లుబాటే కదా…
అదేమిట్రోయ్, అసలు టికెట్ పై అలా రాయడం, కేన్సిలేషన్ హక్కునే రద్దు చేయడం అన్యాయం కదా అనడిగాం అనుకొండి… మేమేమీ చేయలేం అని ఠక్కున ఫోన్ కట్ చేసేస్తాడు… ప్రైవేటు బస్సువాడికి ప్రయాణికుడు లోకువ అంటే ఇదే మరి… వాళ్ల వెబ్‌సైట్లకు వెళ్లి చదివితే ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ సర్వీస్ ఇదే అన్నట్టుగా బిల్డప్పు ఉంటుంది… అందులో కేన్సిలేషన్ పాలసీ కూడా ఉంటుంది… తీరా చూస్తే ఇదీ దందా అసలు స్వరూపం… మళ్లీ చెబుతున్నా, తెలంగాణలో పాలన ఉంటే బాగుండు… కనీసం రవాణాశాఖకు ఓ కార్యదర్శో, ఓ కమిషనరో ఉన్నా బాగుండు…
Share this Article