సింబా అని ఓ సినిమా… చిన్న చిన్న నటులతోనే తీయబడిన ఓ చిన్న సినిమా అయి ఉంటుంది… అనసూయ ప్రధాన నాయిక, జగపతిబాబు ఓ మెయిన్ కేరక్టర్ అట… ట్రైలర్ లాంచ్‌కు కూడా ఓ మీడియా మీట్ నిర్వహించాడు నిర్మాత… సరే, తనిష్టం… కాకపోతే ఆ మీట్‌లో అడగబడిన కొన్ని ప్రశ్నలు, చెప్పబడిన కొన్ని జవాబులు ఆసక్తినే కాదు, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తించాయి…
అనసూయ అంటే తెలుసు కదా… తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు… అంతే, ఆమె అలాగే ఉంటుంది… అదే ఆమెను వివాదాల తెరపై ఉంచుతుంది, అఫ్‌కోర్స్, అలాగైనా ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకుంటుందేమో… ఎవరో లేడీ విలేకరి అడిగింది… అనసూయ గ్లామర్ షో, ఎక్స్‌పోజింగ్ గురించి… నిజానికి అనసూయ నుంచి మరీ అంత ఎక్స్‌పోజింగ్ ఏమీ ఉండదు… కాకపోతే ఈ వయస్సులోనూ నా గ్లామర్ చూశారా అని చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి… మరీ ఇకారంగా ఏమీ ఉండవు, పర్లేదు…
ఈ మీడియా ప్రశ్నకు ఆమె జవాబు కూడా అదే… స్ట్రెయిట్‌గా… ఎంతకాలం నేను మెయింటెయిన్ చేయగలనో అప్పటివరకూ డ్రెసప్ చేసుకుంటాను, ప్రదర్శిస్తాను, అందులో నేను సిగ్గుపడేదేమీ లేదు… ఇది నా బాడీ అని చెప్పుకొచ్చింది… అంతే కదా మరి, దటీజ్ అనసూయ, అంతే…
ఏడు సినిమాలకు సైన్ చేస్తే రెండు ఆన్ గోయింగ్ అట, రిపిటీషన్ ఆఫ్ రోల్స్ అనిపించి కొన్ని కథలు రిజెక్ట్ చేస్తోందట… పవన్ కల్యాణ్‌తో ఓ ఐటమ్ సాంగ్ చేసినట్టు ఏదో టీవీ షోలో రివీల్ చేసింది… ఐటమ్ సాంగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి అంటే, ఆమెకు తెరపై ప్రదర్శించేంత అందం ఉన్నట్టేనని నిర్మాతో దర్శకుడో భావిస్తున్నారన్నమాట… గుడ్, అప్రిసియేషనే…
Ads
ఇది ఒకటైతే… విజయ్ దేవరకొండతో వివాదం గురించి మళ్లీ అపరిపక్వ లేదా అతి పరిపక్వ మాటలు… ఆ దర్శకుడు కూడా విజయ్ దేవరకొండ – అనసూయ వివాదం గుర్తొచ్చేలా ఓ డైలాగ్, ఓ సీన్ పెట్టాడు సినిమాలో… ప్రోమోలో ఉంది… కావాలనే ఈ ప్రశ్న అడిగించారో (వివాదాస్పద ప్రశ్న అడిగిస్తే, దానికోసమైనా సినిమాకు ప్రచారం తప్పక వస్తుందనే భావన కొందరిలో ఉంటుంది) లేక ఏదో ఒకటి గోకాలనే విలేకరి తపనో గానీ… వివాదం సమసిపోయినట్టేనా అనేది ప్రశ్న…
చిత్రవిచిత్రమైన జవాబు చెప్పింది ఆమె… ఎవరికీ అంతుపట్టని ఆమె తత్వంలాగే… అప్పట్లో మితిమీరిన ఒక ధోరణిని మీరు అడగలేకపోయారు, కాబట్టే నేను అడిగాను అంటోంది… అక్కడికి మీడియా విస్మరించిన ప్రతి అంశాన్ని తనే నెత్తికెత్తుకున్నట్టు… పైగా ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అంటోంది… ఇందులో ఉల్టా చోర్ ఎవరు..? మీడియానా..? ఎవరిని కరిచింది..? అనసూయనా..? ఆమె కొత్వాలా..? ఏం మాట్లాడుతున్నామో, ఏం అర్థమో సోయి లేకపోతే ఇలాంటి జవాబే వస్తుంది…
ఈ మీడియా మీట్ తాలూకు వీడియో లింక్ ఇది… (తుపాకీ సైట్ సౌజన్యంతో)
నిర్మాతేమో ఈ సినిమా హరితహారం స్పూర్తితో తీశాను అంటాడు… అంటే రేవంత్ రెడ్డికి మీరేమైనా సందేశం ఇస్తున్నారా ఈ సినిమాతో అని ఓ ప్రశ్న వచ్చింది… సరే, ఆ ప్రశ్న నాణ్యత పక్కన పెడితే… చెట్లు పెంచడం అందరి బాధ్యత, రేవంత్ రెడ్డిది మాత్రమే కాదు కదా అని అనసూయ జవాబు… హేమిటో… చిత్రమైన కేరక్టర్… అవునూ, ప్రకృతి పరిరక్షణ బాధ్యత అని చెప్పే సినిమా కదా… ఇదే అనసూయ 111 జీవో పరిధిలో భూమి ఎందుకు కొన్నదో మరి… ఆ భూముల్లో కట్టే నిర్మాణాలు సహజ నీటిప్రవాహాలకు అడ్డంకులు కాదా..?!
Share this Article