.
అది బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల చైనా పర్యటన ముగించుకుని, తన అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు… సరిగ్గా విమానం మెట్ల వద్ద ఒక విచిత్రమైన దృశ్యం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది…
అమెరికా వైట్ హౌస్ బృందం, ప్రెస్ పూల్ ప్రతినిధులు తమ చేతుల్లో ఉన్న ఐడెంటిటీ కార్డులు, చైనా అధికారులు ఇచ్చిన అఫీషియల్ డెలిగేషన్ బ్యాడ్జీలు, లాపెల్ పిన్స్, చివరకు అక్కడ వాడిన తాత్కాలిక ‘బర్నర్ ఫోన్లను’ కూడా విమానం మెట్ల పక్కన ఉన్న చెత్తబుట్టలో నిర్దాక్షిణ్యంగా పారేశారు!
Ads
‘నో చైనీస్ ఐటమ్స్ అలౌడ్’.. ఎమిలీ గుడిన్ ట్వీట్ కలకలం! ఈ అసాధారణ దృశ్యాన్ని వైట్ హౌస్ పూల్ రిపోర్టర్, న్యూయార్క్ పోస్ట్ కరస్పాండెంట్ ఎమిలీ గుడిన్ స్వయంగా చూసి ‘X’ వేదికగా పంచుకున్నారు… “చైనాకు సంబంధించిన ఏ ఒక్క వస్తువునూ విమానం లోపలికి అనుమతించలేదు” అని అమెరికా దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి…
అంతర్జాతీయ దౌత్యంలో ఇరు దేశాల అధినేతలు నవ్వుతూ చేతులు కలిపినా, తెరవెనుక ఎంతటి అవిశ్వాసం, గూఢచర్య భయాలు ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ… చైనా ఇంటెలిజెన్స్ ఏ చిన్న పిన్ లేదా బ్యాడ్జ్ ద్వారా అయినా డిజిటల్ గూఢచర్యానికి (Cyber Espionage) పాల్పడే అవకాశం ఉందన్న భయంతోనే యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది…
మస్క్, టిమ్ కుక్‌లతో కూడిన భారీ బిజినెస్ సైన్యం! ఈసారి ట్రంప్ బృందం కేవలం రాజకీయ నాయకులతో మాత్రమే వెళ్లలేదు. అమెరికా టెక్, బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసించే ఒక భారీ సైన్యమే ట్రంప్ వెంట ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కింది.
-
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్
-
యాపిల్ సీఈఓ టిమ్ కుక్
-
ఎన్విడియా చీఫ్ జెన్సెన్ హుంగ్తో పాటు బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి టాప్ కంపెనీల సీఈఓలు ఈ పర్యటనలో భాగమయ్యారు.
గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్స్‌లో జరిగిన స్టేట్ బ్యాంకెట్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ అమెరికన్ కార్పొరేట్ బాసులతో ప్రత్యేకంగా సమావేశమై, చైనాలో వ్యాపారాల కోసం తలుపులు మరింత తెరుస్తామని హామీ ఇచ్చాడు… బోయింగ్ విమానాల కొనుగోలు, సోయాబీన్ దిగుమతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భద్రతా ప్రోటోకాల్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి…
ఫారడే బ్యాగులు.. బ్లైండ్ ఫోన్లు! సైబర్ సెక్యూరిటీ విషయంలో అమెరికా ఎంత భయపడుతుందంటే.. చైనాలో ఉన్న మూడు రోజులూ ట్రంప్ బృందంలోని ఎవ్వరినీ వారి వ్యక్తిగత ఫోన్లను వాడనివ్వలేదు… అవన్నీ సిగ్నల్స్ బ్లాక్ చేసే ప్రత్యేక ‘ఫారడే బ్యాగుల్లో’ (Faraday bags) పెట్టి విమానంలోనే ఉంచేశారు… చైనాలో ఉన్నంతసేపూ కేవలం డేటా లేని ‘క్లీన్ బర్నర్ ఫోన్లు’ మాత్రమే వాడారు… తిరిగొచ్చేటప్పుడు వాటిని కూడా బీజింగ్ ఎయిర్‌పోర్ట్ చెత్తబుట్టలోనే వదిలేశారు…
ఇరాన్ యుద్ధంపై కీలక చర్చలు పశ్చిమ ఆసియాను కుదిపేస్తున్న ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది… ఇరాన్‌కు చైనా సైనిక పరికరాలు సరఫరా చేయకూడదనే అంశంపై షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ గట్టిగా చర్చించినట్లు తెలుస్తోంది… యుద్ధం ముగింపుపై ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ ప్రకటించాడు…
పైకి బిలియన్ డాలర్ల ఒప్పందాలు, నవ్వుల కరచాలనాలు కనిపించినా.. ఎయిర్‌పోర్ట్ చెత్తబుట్టలో పడిన చైనా బ్యాడ్జీలు మాత్రం వాషింగ్టన్ – బీజింగ్ మధ్య ఉన్న అసలైన “కోల్డ్ వార్” తీవ్రతను, గూఢచర్య భయాల్ని ప్రపంచానికి స్పష్టంగా చూపించాయి…
Share this Article