Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సామాన్యులకి ఆహ్వానం, ఆడిషన్స్ అన్నారు… ఏమయ్యారురా బిగ్‌బాస్…?!

September 4, 2022 by M S R

గత మే నెల… బిగ్‌బాస్ టీం అధికారికంగానే ప్రకటించింది… సామాన్యులకు ఆహ్వానం అని చెప్పింది… ఆడిషన్స్ అని పేర్కొంది… ఓహో, యూట్యూబర్స్, టీవీ యాక్టర్స్, మోడల్స్, కమెడియన్స్, సింగర్స్, ఇతరత్రా చిన్నాచితకా సెలబ్రిటీలే గాకుండా సామాన్యులతో కూడా బిగ్‌బాస్ ఆట ఆడిస్తారా అనుకున్నారు ప్రేక్షకులు… గతంలో కూడా ఒకరిద్దరిని ఇలా తీసుకొచ్చారు కూడా… కానీ తీరా చూస్తే… 20 మందిని ప్రవేశపెడితే వారిలో ఒక్క సామాన్యుడూ లేడు…

మరి సామాన్యుల ఎంపిక ఏమయిపోయిందిరా బిగ్‌బాసోడా అనడగాలి… ఆదిరెడ్డి అనే వ్యక్తిని కామనర్ అన్నాడు నాగ్… కానీ తను ఇదే బిగ్‌బాస్ మీద రివ్యూలతో పాపులర్… తనూ ఓ సెలబ్… తన సిస్టర్ కూడా యూట్యూబర్… ఇప్పటివరకూ ఏరకమైన ఎక్స్‌పోజర్ లేని ఒక్క సామాన్యుడు ఈ జాబితాలో లేరు… సో, చీటింగ్ ఆఫ్ ది సీజన్ అన్నమాట…

లాంచింగ్ గురించి మాట్లాడుకుందాం… బీబీ6… #bb6telugu … బిగ్ బాస్… నాగార్జున కాస్ట్యూమ్స్ దరిద్రం… కానీ ట్రెండ్ పేరిట ఆ పిచ్చి గడ్డం పెంచకుండా రక్షించాడు… సీజన్ లాంచింగే సినిమా ప్రమోషన్ తో స్టార్ట్ చేశాడు… బ్రహ్మాస్త్రం హీరో హీరోయిన్స్ రణబీర్, ఆలియా వచ్చారు… ప్రెగ్నెన్సీతోనే తెగ తిరిగేస్తోంది… అంతసేపు ఆమెను నిలబెట్టడం గర్భ హింస కిందకు వసుంది నాగ్… వీళ్లే కంటెస్టెంట్స్, వాళ్ల పరిచయం…

Ads

1) ఫస్ట్ contestant పేరు కీర్తి భట్ (F)… మనసిచ్చిచూడు, కార్తీక దీపం సీరియల్స్ నటి, లైఫ్ లో చాలా విషాదాన్ని ఫేస్ చేసింది… అందర్నీ కోల్పోయి, ఇప్పుడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది… #kirtibhatt

2) సుదీప (F)… అలియాస్ పింకీ… నువ్వు నాకు నచ్చావ్ పాత మూవీలో అల్లరి పిల్ల… పర్లేదు, యాక్టివ్… పేరెంట్స్ డాన్స్ టీచర్స్… ఐనా ఈమె ప్లెయిన్ ఎంట్రీ… Expect చేసిన పేరే… #sudeepa

3) శ్రీహాన్ (M)… లాస్ట్ సీజన్ లో షణ్ముఖ తో రొమాన్స్ నడిపిన సిరి హన్మంతుకు నిజజీవిత ప్రియుడు ఇతను… ఊహించిన పేరే… #srihaan

4) నేహా (F)… ఈమె గురించి పెద్దగా తెలియదు… టీవీ వ్యాఖ్యాత తరహా పర్సనాలిటీ కావొచ్చు… సర్కస్ ఫీట్లు వంటి నాలుగు డాన్స్ గెంతులు వేసింది… #nehachoudary

5) చలాకీ చంటి (M)… పాపులర్ కమెడియన్… జబర్దస్త్ లో ఫేమస్… #ChalakiChanti …

6) శ్రీ సత్య (F)… బెజవాడ… టీవీ నటి… త్రినయని సెట్లలో మాయమై ఈ హౌజులో తేలింది… #SriSatya

7) అర్జున్ కళ్యాణ్ (M)… లెక్కలేనంత మంది గరల్ ఫ్రెండ్స్ ఉన్నారు అట… వర్థమాన వెబ్ నటుడు… #arjunkalyan

😎 గీతు (F)… గలాటా గీతు రాయల్… యూ ట్యూబర్… యాక్టివ్… చిత్తూరు మాండలికంలో గలగలా మాట్లాడుతుంది… 5 కేజీ తక్కువ ఉంటే ఇంకా ప్లస్ అయ్యేదేమో… #geethuroyal

9) అభినయ శ్రీ (F)… చాలా మందికి తెలిసిన సినీ డాన్సర్… 100 మసాలా సాంగ్స్ చేసిందట… చాన్నాళ్లుగా లైమ్ లైట్ లో లేనట్టుంది… Animal lover… #abhinayasree

10) రోహిత్ సాహ్ని, మరీనా ఇబ్రహీం జంట… (F, M) #rohithmarina… ఒకరు పంజాబ్, ఇంకొకరు గోవా… టీవీ, మూవీ యాక్టర్స్…

11) బాల ఆదిత్య (M)… అనూహ్యంగా ఎంపిక… యాక్టర్, రైటర్, కంపెనీ సెక్రటరీ, యాంకర్ ఎట్సెట్రా… ఏవీ అదిరిపోయింది … #balaaditya

12) వాసంతి కృష్ణన్ (F)… ఈ పేరు కూడా అనూహ్యం… టీవీ నటి, మోడల్… నేటివ్ తిరుపతి… కాలీఫ్లవర్ మూవీ ఫేం… #vasanthikrishnan

13) షాని సాల్మన్ (M)… ఎక్స్పెక్ట్ చేయని పేరు… జడ్చర్ల… గరల్ ఫ్రెండ్స్ ఐదుగురు అట… సినీ నటుడు… #shanisalmon

14) ఇనయ సుల్తానా… (F)… #InayaSultana … నటి… హైదరాబాదీ…

15) RJ సూర్య… (M) రాజమండ్రి… మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా… కాస్త ఓవర్ ఆక్షన్… #RJSurya

16) జబర్దస్త్ ఫైమా (F)… ఫుల్ ఆఫ్ ఎనర్జీ… భలే కామెడీ టైమింగ్… కొత్తగా, వివరంగా చెప్పే పని లేదు… #faima

17) ఆదిరెడ్డి… (M)… నాగ్ తనను కామనర్ అన్నాడు గానీ, తను బిగ్ బాస్ మీద you tube లో రివ్యూస్ రాసీ రాసీ తనే సెలబ్ అయిపోయాడు… హౌస్ లోకి రాగానే ఇతర contestants కొందరు గుర్తుపట్టారు… #adireddy

18) రాజశేఖర్… (M)… మోడల్… పెద్దగా పాపులర్ కాదు… కానీ చిన్న కొలువుల నుంచి ఎదిగాడు… #rajashekar

19) అరోహి రావు… (F) టీవీ న్యూస్ రీడర్… పాత వరంగల్ జిల్లా… #arohirao

20) సింగర్ రేవంత్… (M)… #singerrevanth … జగమెరిగిన గాయకుడు… కాస్త ప్లేబాయ్ టైప్ అట… నాగ్ అడిగాడు… హిందీ Indian idol విన్నర్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions