Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Pooja Hegde…! ఈమె కాళ్ల మీదేనా అంతటి సిరివెన్నెల కలం పారేసుకున్నది..?!

December 30, 2023 by M S R

మొన్నొక వార్త… స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందనీ… తరువాత రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తీసివేయబడిందనీ…! తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 40 శాతం వరకూ పూర్తయ్యాక మరీ అంతటి పాపులర్ హీరోయిన్ తప్పుకుందనే సమాచారం ఆశ్చర్యపరిచింది…

సరే, ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయి… అసలు గుంటూరు కారం సినిమా జర్నీయే అంత సజావుగా అనిపించడం లేదు… మరి రవితేజ సినిమా నుంచి ఎందుకు వెళ్లిపోయినట్టు..? అంటే… ఆమె సినిమాలు అంగీకరించడం, చేయడంలోనే ఏదో లోపం కనిపిస్తోంది… అది గతంలో లేదు, ఉంటే ఆ స్థాయికి ఎదిగేది కాదు… మరేమైంది ఆమెకు..?

నిజానికి ఆమెను ప్రభాస్ సినిమా ‘రాధేశ్యాం’లో చూస్తుంటే జాలేసింది… ఈమె కాళ్ల మీదేనా అంతటి సిరివెన్నెల సైతం ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ దండకం రాసింది… ఆ కాళ్ల మీద తన కలం పారేసుకున్నది… ఈమేనా భారతీయ యువత కలల సామ్రాజ్ఙి అయిపోయింది… అలా విస్మయం అనిపించింది…

Ads

pooja

ఒకప్పుడు… ‘డీజే’ తర్వాత ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేశ్’, ‘అల వైకుంఠపురంలో’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టింది పూజా హెగ్దే… ఆ ‘రాధే శ్యామ్’ మూవీతోనే పూజా లక్ రివర్స్ కొట్టింది… బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రాధే శ్యామ్’ భారీ డిజాస్టర్‌ కాగా, ఆ తర్వాత పూజా చేసిన ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది…

పోనీ, హిందీకి వెళ్లి అక్కడేమైనా బావుకుందా..? అదీ లేదు… తెలుగు నుంచి హిందీకి వెళ్లి  ‘సర్కస్’, ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమాలు చేసింది పూజా హెగ్దే… ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు… నిజానికి ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఫేవరెట్… అందుకే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది… అయితే దాదాపు 40 శాతం షూటింగ్ అయ్యాక, పూజా హెగ్దే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది…

‘గుంటూర్ కారం’ సినిమాకు ఆమె ఇచ్చిన షాక్‌తో తెలుగులో ఇక పూజా హెగ్దేకి ఛాన్సులే రావని అనుకున్నారు… అయితే ‘డీజే’ మూవీతో పూజా లక్కు మార్చిన హరీశ్ శంకర్, రవితేజతో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీలో హీరోయిన్‌గా తొలుత ఆమెనే తీసుకోవాలని అనుకున్నాడు…

pooja

చేతిలో సినిమాలు లేకపోయినా రూ.3.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట పూజా హెగ్దే… దీంతో పూజా ప్లేస్‌లో కొత్త హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సేని తీసుకున్నారు… ఎక్కడి పూజా, ఎక్కడి భాగ్యశ్రీ… అదేదో ఒక్క సినిమా చేసిన భాగ్య నిజానికి ఓ మోడల్… ఆ భాగ్యశ్రీ గనుక క్లిక్ అయితే పూజాకి ఛాన్సులు రావడమే పూర్తిగా తగ్గిపోవచ్చు కూడా… మరి అంతగా ఎగిరి ఎగిరి, తిరిగి విరిగిపడిన ఆ పూజా ఏం చేస్తోంది ఇప్పుడు..? ప్రస్తుతం బాలీవుడ్‌లో షాహీద్ కపూర్‌తో ‘దేవ’ అనే మూవీ మాత్రమే చేస్తోందిట… అలాగే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్టు సమాచారం… అవునూ, ఒక వెబ్ సీరీస్‌కు హీరోయిన్‌కు మూడు కోట్లు ఇస్తాడా ఎవడైనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions