.
అదుగో ఆ చెరువులో కొమ్ములు కనిపిస్తున్నాయా..? అవి మాంచి కోడె కొమ్ములు… దిట్టంగా ఉంటుంది అది… లక్ష రూపాయలు ధర… కొమ్ములు చూస్తే అంచనా వేయలేవా కోడె దారుఢ్యాన్ని…..
ఈ బేరాల్లాగే ఉంది హరీష్ రావు ట్వీట్… కాకపోతే రివర్స్ యవ్వారం… అధికారంలో ఉన్నవాడి మీద ఏదో ఒకటి గాలి నుంచి బురద క్రియేట్ చేసి చల్లేయడం… కడుక్కునే పని కాంగ్రెస్ తీట… అచ్చం అలాగే ఉంటున్నయ్ కేటీయార్, హరీష్ ట్వీట్లు, విమర్శలు, ఆరోపణలు…
Ads
ప్రాణహిత- చేవెళ్ల ఖర్చు మీద హరీష్ రావు చేసింది అక్షరాలా అర్థరహితమైన ట్వీట్… పైన చెప్పిన బాపతే… సాధారణంగా ఏదో ఒకటి నమస్తే తెలంగాణలో రాయిస్తుంటారు, దాన్ని జతచేసి ట్వీట్లు వదులుతుంటారు… దాంతో దానికి ఏదో సాధికారత, విలువ వచ్చినట్టు…
ఇప్పుడు నమస్తే చదివేవాడు లేడు, మడత విప్పేవాడు లేడు, చదివినా నమ్మేవాడు లేడు కదా… నమస్తేకు తెలంగాణలో ప్రతిరూపంగా మారిన నమస్తే సాక్షిలో రాయించేసి, దాని ఆధారంగా ట్వీట్లు కొట్టడం అన్నట్టుగా ఉంది హరీష్ రావు ఈరోజు ట్వీట్… ఏమనీ అంటే..?
మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే… జస్ట్ తమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట!
కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 TMC మాత్రమేనట! కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట! 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం… అమోఘం… కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం… ఇది కదా అసలైన మార్పంటే?
ఆహా, నేను మస్తు సెటైర్ వేశాను అనుకున్నాడు… సేమ్, కేటీయార్ నేనెందుకు తగ్గాలి అనుకుని తనూ కామెంట్స్ చేశాడు… ఈ వార్త ఆధారంగానే… ఆఫ్టరాల్ ఈ మాత్రం ప్రాజెక్టుకు 35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అంతటి బృహత్తర కాళేశ్వరానికి 92 వేల కోట్లు ఖర్చు పెట్టడంలో తప్పేముంది అంటున్నాడు… (ఆలమట్టి 5 మీటర్లు పెంచడానికి 75 వేల కోట్లు ఖర్చు చేయబోతోంది, అంతటి కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఓ లెక్కా అంటున్నాడు)…
నిజానికి ఆ వార్తే పెద్ద ఊహాగానం… ప్రాణహిత- చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తుతో కట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు టీమ్ వెళ్లాల్సి ఉంది… వాళ్లు అంగీకరించాలి… ప్రి ఫీజుబులిటీ రిపోర్టు దగ్గరే ఉంది ఇంకా…
రూ.35 వేల కోట్ల వ్యయం అని తేల్చడానికి డీపీఆర్ లేదు, ఆమేరకు అనుమతులూ లేవు… అసలు ఆలూ లేదు, చూలూ లేదు… ఆ వ్యయం సదరు జర్నలిస్టు వేసిన ఓ అంచనా… అదీ అభినవ విశ్వేశ్వరరావు కేసీయార్ రీఇంజినీరింగులో తీసేసిన 9 ప్యాకేజీలు కలిస్తే ఆమేరకు ఖర్చవుతుందని ఆ పత్రిక ఎస్టిమేట్స్…
ఎస్, తుమ్మడిహెట్టి దగ్గర బరాజ్ కట్టి, 80 టీఎంసీల వరకూ ఎల్లంపల్లికి మళ్లించాలనేది ప్రభుత్వ నిర్ణయమే… ఎక్కువ గ్రావిటీతోనే నీటి తరలింపు ఉంటుంది… బహుశా మధ్యలో ఒకచోట ఎత్తిపోయాల్సి ఉంటుందేమో… అంతే… ఈ రఫ్ ప్రతిపాదనలపై వచ్చిన వార్తను బేస్ చేసుకుని… ఆల్రెడీ అంతా అయిపోయింది అన్నట్టుగా బీఆర్ఎస్ రెండు పెద్ద తలలూ కారెడ్డం (సెటైర్) ఆడుతున్న తీరు విచిత్రమే…!!
Share this Article