Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశంలో పథక ప్రచారం… ఆచరణలో డొల్లతనం… ఆంధ్రజ్యోతి కాగ్ పాత్ర…

January 21, 2023 by M S R

కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ…

ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్‌ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా నమస్తే సాక్షి అయిపోయింది… మించిపోయింది… చదవబుల్ వార్తొక్కటీ లేదేమని పాఠకజనం తిరస్కరిస్తుంటే, ఛీత్కరిస్తుంటే, పత్రికలో పనిచేసే వాళ్లందరమూ తలా పది పేపర్లు అమ్ముకుందామనే బృహత్ సంకల్పం తీసుకుంది… ఇక  ఏనాడో వెన్ను వంగిపోయిన ఈనాడు గురించి చెప్పుకోవడం ఉత్త దండుగమారి ప్రయాస… అదిప్పుడు నిప్పులు (ప్రొఫెషనల్ ఫైర్) ఆరిపోయి, కనిపిస్తున్న ఓ బూడిద వార్తల కుప్ప…

ఎస్… పత్రిక అంటే భజన కాదు… అవసరమైనప్పుడు అది ‘కాగ్’ పాత్ర పోషించాలి… అవసరంగా మారి ఫ్యాక్ట్ ఫైండింగ్ మెకానిజంగా మారాలి… దర్యాప్తులు చేయాలి… గూఢచర్యం కూడా తప్పదు… జనం వెంట నిలవాలి… ప్రభుత్వాల పథకాల్లోని డొల్లతనాన్ని, ఫాయిదా దందాను బయటపెట్టాలి… ఈ ఆంధ్రజ్యోతి కథనం అదే… కేసీయార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ, భ్రమాత్మక తెలంగాణ మోడల్‌కే హైలైట్ అని చెబుతూ… దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి వర్తింపజేస్తానంటున్న దళితబంధు ఆచరణ తీరు ఎలా ఉందో తేటతెల్లం చేసింది…

Ads

aj

ఈరోజుకూ దళితబంధు మీద స్పష్టమైన మార్గదర్శకాల్లేవు… అప్ప్పటికప్పుడు పొలిటికల్ ఫాయిదా కోసం ఉద్దేశించిన పథకం కదా… ఉద్యోగులకే సమయానికి జీతాలివ్వలేని దురవస్థలో… ఇక దళితబంధుకు నిధులేవీ..? లబ్ధి దరఖాస్తుదారులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి… ఇతర పార్టీల వారికి సారీ, వర్తింపజేయరు… అంతంత మాత్రం అమలు జరిగే ఈ పథకానికి బడ్జెట్‌లో ఘనంగా 17,700 కోట్లు కేటాయించింది… పేరు గొప్ప… అంకెల్లో గొప్ప… బడ్జెట్ పరిమాణంలో గొప్ప… పటాటోపంలో గొప్ప…

తీరా చూస్తే ఆ కేటాయింపులో ఖర్చుల్లేవు… ఇదీ ఆంధ్రజ్యోతి కథన సారాంశం… ఇలాగే తవ్వితే కాలేశ్వరం అసలు ప్రయోజనాలు, కల్యాణలక్ష్మి అమలు తీరు, నిజమైన రైతుకు దక్కని రైతుబంధు, 24 గంటల సాగు కరెంటు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు… వాట్ నాట్..? బోలెడు అంశాలు… కానీ ఇతర పత్రికలు చేస్తున్నదేమిటి..? అదుగో ఈశాన్యంలో పాగా… జోర్‌దార్ యాక్షన్ ప్లాన్… బీఆర్ఎస్‌పై దేశం చూపు… చేరికలు, విలీనాలకు పార్టీల వెంపర్లాట… అంటూ కేసీయార్ పాదముద్రల్లో పూలు జల్లుతూ పునీతం అవుతున్నాయి… ఇలాంటి కీర్తికీర్తనలు అంతిమంగా తనకు ప్రజల్లో కౌంటర్ ప్రొడక్ట్స్ అవుతాయనే సంగతిని కేసీయార్ ఎలా విస్మరిస్తున్నాడో మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions