.
వేదిక మీద కత్తులు కటార్లు పెట్టుకుని తిరిగినా… ఎంత హైప్ క్రియేట్ చేసినా… మార్కెటింగ్ జోరుతో ఎంత బజ్ క్రియేట్ చేసినా… పవన్ కల్యాణ్ ఈరోజుకూ తెలుగు హీరో మాత్రమే… నార్త్ బెల్ట్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ జనం కూడా తనను పాన్ ఇండియా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు…
ఇప్పటికే 200 కోట్ల వసూళ్లు సాధించిన ఓజీ సినిమా తొలి ఫలితాల్ని విశ్లేషిస్తే… ఈ వ్యాఖ్య నిజమని స్పష్టమవుతుంది… వినడానికి, చదవడానికి, జీర్ణం చేసుకోవడానికి కటువుగానో, పరుషంగానో అనిపించినా ఇది రియాలిటీ…
Ads
నాలుగు రోజుల్లో 200 కోట్లు… ఓవర్‌సీస్ 50 కోట్లు, తెలంగాణ, ఆంధ్రా 150 కోట్లు… మరి తమిళం, హిందీ, కన్నడం..? ఉత్తదే… పరిగె ఏరుకున్నట్టు అరకొర… మరీ తీసికట్టు యవ్వారం… చెప్పుకుంటే నగుబాటు… అవును, ఒక ఊరి పట్వారీ మరో ఊరిలో మస్కూరిలా…
హిందీ మార్కెట్‌లో నాలుగు రోజుల్లో మరీ 2 కోట్లే, అదీ గ్రాస్… వాటాలు గట్రా తీసేస్తే ఒక కోటి… కన్నడం అయితే మరీ దారుణం…. రోజుకు 3 లక్షలు, 5 లక్షలు… నాలుగో రోజూ అదీ లేదు, తీసేశారు… పోనీ, తమిళం చూద్దామా..? నాలుగు రోజుల్లో 76 లక్షల గ్రాస్… సో, ఓజీ అనేది పాన్ ఇండియా కాదు, జస్ట్, ఓ తెలుగు సినిమా… అంతే…
ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… సోకాల్డ్ సినిమా పండితులు ఎంతమేరకు బయ్యర్లకు అమ్మారు, నికరంగా ఎన్ని వసూళ్లు వస్తే సినిమా సక్సెసో ఫ్లాపో నిర్ధారించేస్తున్నారు… అది తప్పు… నిర్మాణ వ్యయం ఎంత..? బయ్యర్లకు ఎంతకు అమ్మారు..? వాళ్లకు ఎంత వచ్చింది..? ఓటీటీ గట్రా కలిపితే మొత్తానికి నిర్మాత మునిగాడా తేలాడా అనేది చూడాలి…
అలాగే వసూళ్ల ప్రచారాలు చాలాసార్లు ఉత్త హంబగ్… అసలు లెక్కలు వేరు… గ్రాస్‌లో చాలా మైనసులు తీసేస్తే నికరంగా మిగిలేదీ తక్కువే… సాధారణంగా తొలివారం సినిమా హైప్ కోసం అబద్ధపు వసూళ్ల లెక్కల్ని కూడా పబ్లిసిటీకి వాడుతుంటారు… ఓజీ అని కాదు, సాధారణంగా పెద్ద సినిమాలన్నింటికీ ఇదే కథ…
సరే, ఇదే సందర్భంగా మరొకటీ చెప్పుకుందాం… హరిహర వీరమల్లు… అసలు ఫ్యాన్స్‌కే నచ్చలేదు… జనం గుడ్డితనం మీద నమ్మకంతో వదిలిన ఓ నాసిరకం సరుకు అది… మొత్తం 115 కోట్ల వసూళ్లు అయితే అందులో తెలుగు వాటాయే 87 కోట్లు… నిర్మాణవ్యయంతో పోలిస్తే డిజాస్టర్ అది… ఇక హిందీ ప్రేక్షకులు 11 రోజుల్లో ఇచ్చింది జస్ట్ 33 లక్షలు… కన్నడంలో అయిదే రోజులు, అయిదే లక్షలు, ఫట్… తమిళంలో 8 రోజులు, 19 లక్షలు… మలయాళం అయితే మరీ ఘోరం… ఆరే రోజులు, 15 లక్షలు… ఖేల్ ఖతం…
అంటే, పవన్ కల్యాణ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా ఇతర భాషా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు… ఒక ప్రభాస్, ఒక జూనియర్, ఒక రాంచరణ్, ఒక యశ్… చివరకు నిఖిల్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, తేజ సజ్జా కూడా పాన్ ఇండియాకు ఘనంగానే పరిచయం అయ్యారు… ఇదే కాదు, అసలు అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కల్యాణ్ ఇదీ నా సినిమా అని కాలరెగరేసే సినిమా ఏది అసలు..?!ఏక్‌సేఏక్ ఫ్లాప్..!!
Share this Article