Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ ఒక యోగీ సీఎం కాదు- ఒక సజ్జనార్‌ అసలే లేడు… మరి..?!

July 8, 2026 by M S R

.

ఒకాయన అడిగాడు సీరియస్‌గానే..! ఎందుకు ప్రశ్నించవు అని..!! తను అడిగిన ఘాతుకం, పైశాచికం ఏమిటంటే… తన బాధలో అర్థముంది కూడా… రాజస్థాన్‌లో శ్రీగంగానగర్ జూన్ 18న ఓ 13 ఏళ్ల బాలికను దుండగులు మాయమాటలతో ఎత్తుకెళ్లి, పలు హోటళ్లలో దాచి, వరుసగా రోజుల తరబడీ అత్యాచారం చేశారు…

14 మందిని అరెస్టు చేశారు, మరో 18 మంది దొరకాలి… వాళ్లను బజారులో ఊరేగిస్తూ, జనానికి దేహశుద్ధి చేసే అవకాశం కల్పించారు… ఖుంగార్, జాయ్ ఇన్, సఫైర్ ఇన్ హోటళ్లను బుల్‌డోజర్లతో కూల్చేశారు… అంతేనా..? అవును, అదే ఎక్కువ… అక్కడ యోగీ కాదు సీఎం… ఎవడో సోది భజన్ లాల్ శర్మ… అక్కడెవరూ సజ్జనార్‌లు లేరు…

Ads

ఆఫ్టరాల్ ఓ 13 ఏళ్ల బాలిక… ఎవడికి కావాలి… ఆ పైశాచిక ఘటనకు స్పందించేది ఎవరు..? మన న్యాయవ్యవస్థ అడ్డమైన సూమోటో కేసులు తీసుకుంటుంది, కానీ ఇవి పట్టవు… ఎందుకంటే..? ఏ కపిల్ సిబల్, ఏ ప్రశాంత్ భూషణ్ ఆమెకు మద్దతు రాడు కదా… యాకూబ్ మెమన్, అఫ్జల్ గురు అయితే సుప్రీంకోర్టు తలుపుల్ని అర్థరాత్రి తెరిపించడానికి..!!

అత్యంత కిరాతకమైన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులోనే మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షల్ని ఖరారు చేయడానికి హైకోర్టుకు ఏళ్లూపూళ్లూ పట్టింది… ఇంకా సుప్రీం, అప్పీళ్లు, ధర్మాసనాలు, క్షమాభిక్ష పిటిషన్లు గట్రా పూర్తయ్యేసరికి ఎంచక్కా ప్రజాధనంతో కడుపు నిండా తింటూ బతికే ఉంటారు ఆ పిశాచాలు…

ఎస్, ఈ రాజస్థాన్ కేసులో మన న్యాయవ్యవస్థ అంతకుమించి సాధించేది ఏమీ ఉండదు… నిజం ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది… హోటళ్లు కూల్చేస్తే, బజారులో ప్రజలతో కొట్టిస్తే ఒరిగేదేమిటి సీఎం..? ఏమో, వాళ్లు బెయిల్ తెచ్చుకుని మళ్లీ సమాజంలో తిరుగుతూ, ఈసారి 13 ఏళ్లలోపు  బాలికలపై కన్నేస్తారు… అవును, మన న్యాయవ్యవస్థ ఏ అన్యాయానికీ జవాబుదారీ కాదు కదా, పైగా బెయిల్ జన్మహక్కు అంటుంది…

అన్నింటికీ మించి… టెర్రరిస్టులు, మతపిశాచాలు, ‘రావణ్’లకు మద్దతుగా నిలిచే యూట్యూబర్ల జాతి ఒకటి ఉంది కదా దేశంలో… తెలుగు రాష్ట్రాల్లో సంగతి తెలుసు కదా.., జర్నలిజం ముసుగులో చెలరేగిపోయే పర్వర్టెట్ జాతివ్యతిరేక సంతతి… ఈ దేశంలో సగటు మనుషులకు, బాధితులకు మానవ హక్కులు ఉండవు కదా, ‘రావణ్’లకు తప్ప..!! ఎవడికీ, ఎవతికీ నొప్పి తీవ్రత తెలియదు కదా..!! బాధితులు కాదు కదా..!!

మన కోర్టులు ఇంతే… మన న్యాయవ్యవస్థ ఇంతే… మన ఘనత వహించిన జర్నలిజమూ (?) ఇంతే… అందుకే మిత్రమా, నువ్వు దుఖపడకు… ఈ దేశం ఇంతే… పిశాచాల రాజ్యమిది…! కర్మ సిద్ధాంతంతో జరిగేది జరగక మానదు అనుకో.., ఏ బాధా ఉండదు… బీఎన్ఎస్ సాక్షిగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions