పోతారు… చచ్చిపోతారు… దక్షిణాప్రికాలో ఓ కొత్త కరోనా వైరస్ కనిపించింది… అది చాలా ఫాస్ట్‌గా వ్యాపిస్తుంది… ఒకసారి సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందే… బీకేర్ ఫుల్………… ఇదీ చైనా శాస్త్రవేత్తల పేరిట విడుదలైన హెచ్చరిక… ప్రస్తుతం ప్రపంచమంతా ఒమిక్రాన్ వ్యాప్తిలో మునిగాక, దేవుడిచ్చిన వేక్సిన్ అది, ఇక కరోనా బెడద తొలగినట్టే అనుకుని ఆంక్షలు కూడా సడలిస్తున్నవేళ… నో, నో, మేం ఒప్పుకోం అన్నట్టుగా చైనా ఈ కొత్త ప్రచారానికి దిగింది… ప్రపంచం మీద చైనా కసి ఇంకా తీరలేనట్టుంది… ఎక్కడైతే కరోనా పుట్టిందో, ఆ వుహాన్ సైంటిస్టులే ఈ కొత్త ప్రచారానికి పూనుకున్నారు…
నిజమేనా..? ఈ నియో-కోవ్ వైరస్ ఇండియాలోకి వచ్చిందా..? ఒమిక్రాన్‌కన్నా వేగంగా వ్యాపిస్తుందా..? ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందేనా..? ఇది ఓసారి పరిశీలించాలి… ఓసారి దక్షిణాఫ్రికా కేసులు చూస్తే కొత్త కేసులు విపరీతంగా తగ్గిపోయినయ్, మరణాలు తగ్గిపోయినయ్… అసలు కరోనాను ఆ దేశం జుజుబీ అని లైట్ తీసుకుంటోంది ఇప్పుడు… మరి ఈ కొత్త కరోనా వేరియెంట్ అక్కడి నుంచే వ్యాప్తి చెందనుందీ అనే ప్రచారం దేనికి..? అదీ కరోనాను పుట్టించిన చైనా ఈ కొత్త డప్పు స్టార్ట్ చేయడం ఏమిటి..?
నిజానికి కోవిడ్ వైరస్ అనేది ఓ పేద్ద వైరస్ కుటుంబం… అందులో కూడా అనేక రకాలుంటయ్… ఇప్పుడు చెబుతున్న నియో-కోవ్ నిజానికి కొత్తదేమీ కాదు… 2012, 2015లో శాస్త్రవేత్తలు కనిపెట్టిందే… ఇది మెర్స్ రకం… అంటే మిడిల్ ఆసియా రకం… ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన కోవిడ్ సార్స్ రకం… నిజానికి ఇప్పుడు చైనా వాళ్లు కొత్తగా ప్రచారం చేస్తున్న ఈ నియో-కోవ్ ప్రధానంగా జంతువుల్లో వ్యాప్తి చెందుతుంది… గబ్బిలాలు మెయిన్ వాహకాలు… మనుషుల్లోకి వ్యాప్తి చెందడం గతం నుంచీ లేదు… అందులో కొత్త వేరియెంట్ గనుక పుట్టుకొస్తే, అది వ్యాప్తి చెందితే మాత్రం డేంజర్ సుమా అనేది ఇప్పుడు ప్రచారం… అసలు మనుష్యులకు ఇన్నేళ్ళు సోకని ఆ వైరస్ ఇప్పుడు ఎందుకు సోకుతుంది..? ఆ కొత్త వేరియెంట్ రానుందని ఊహాగానాలు దేనికి…?
Ads
2012 నుంచి కూడా ఈ నియో-కోవ్ ప్రమాదకరంగా ఎక్కడా, ఏమీ వ్యాప్తి చెందలేదు… bioRxiv అని ఓ వెబ్‌సైట్ ఉంది… అది ప్రధానంగా ఈ వైరస్‌లు, బ్యాక్టీరియా తదితర సూక్ష్మ జీవుల గురించి, వ్యాప్తి గురించి, పాండెమిక్ గురించి సాధికారికంగా వార్తలు పబ్లిష్ చేస్తుంది, పరిశోధనల వివరాలు జతచేస్తుంది… అది కూడా ఈ నియో-కోవ్ జంతువుల్లో వ్యాప్తి చెందుతుందని మాత్రమే చెప్పింది… ఈ నియో-కోవ్ గురించి మొదట్నుంచీ చెబుతున్నది ఆ సైటే… నిజానికి ఇప్పుడు WHO కావచ్చు, రష్యన్ వెబ్‌సైట్ స్పుత్నిక్ కావచ్చు, ‘ఈ నియో-కోవ్ ప్రభావాన్ని, ఉనికిని ఇంకా పరిశీలించాలి, అంచనా వేయాలి’ అంటున్నవే తప్ప… ప్రతి ముగ్గురిలో ఒకరు ఖతం అనే చైనా ప్రచారాన్ని ఎండార్స్ చేయడం లేదు…
కానీ చైనా తన ప్రచారాన్ని ఆపదు, ఫార్మా మాఫియా దాన్ని ఎగదోస్తుంది… పనిలోపనిగా మీడియా మాఫియా సరేసరి… ఒమిక్రాన్ తరువాత ఫ్లోరినా, డెల్టాక్రాన్ అనే పేర్లనూ ప్రచారంలోకి తెచ్చింది… ఫ్లూ, కరోనా వైరస్ కలిస్తే ఫ్లోరినా… డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్… నిజానికి అవేవీ కొత్త వేరియంట్లు కావు… సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… చైనా వాడు బెదిరించగానే బెంబేలెత్తాల్సిన పనిలేదు… అలాగని ఈ కరోనా కొత్త వేరియంట్లు రావొద్దని కూడా ఏమీలేదు… మనిషిలోని ఇమ్యూనిటీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది రకరకాల వైరసులతో… అచ్చు కరోనాను పోలిన నియో-కోవ్‌ను కూడా ఎదుర్కుంటుంది… ఒకవేళ అది జంతువుల నుంచి మనషుల్లోకి కూడా వ్యాప్తి చెందితేనే సుమా…!!
Share this Article