Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీల్లో నీరస దీపావళి… తెలుగు వినోద చానెళ్లు బాగా చల్లబడిపోయాయ్…

November 12, 2023 by M S R

రాత్రి దీపాలు వెలిగించాలి, లక్ష్మిపూజలు… పటాకులు కాల్చాలి… పొద్దున్నే హారతులు, పిండివంటలు, పేనీలు, స్వీట్లు… ఎటూ ఇల్లు కదిలే చాన్స్ ఉండదు… చుట్టాలో పక్కాలో వస్తే మరింత పని… ఈ నేపథ్యంలో అందరికీ టీవీయే ఏకైక వినోదంగా మారింది ఈరోజుల్లో…

నిజానికి తెలుగు వినోద చానెళ్లు ప్రతి పండుగకు ఏవో స్పెషల్ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాయి… యాడ్స్, డబ్బులు, హంగామా, రేటింగులు… వాటి బాధ వాటిది… ఉన్న నాలుగు చానెళ్లలో జెమినిని లెక్కలో నుంచి తీసివేయవచ్చు… ఏదో నడుస్తోంది అంటే నడుస్తోంది చానెల్… ఆమధ్య ఏవో ఒకటీరెండు పండుగ స్పెషల్స్ చేసింది గానీ, వాటితోనే దమ్మొచ్చిందో, డబ్బు రాలేదో గానీ మళ్లీ రియాలిటీ షోల జోలికి పోలేదు అది…

ఇలాంటి షోలకు ఈటీవీ ఫేమస్… కానీ కొంతకాలంగా ఏమైందో ఏమో గానీ ఈటీవీ ప్రతి రియాలిటీ షో, అంటే నాన్-ఫిక్షన్ నాసిరకంగా మారి, ప్రేక్షకులతో కనెక్ట్ కావడం లేదు… ఆలీ, సుమ ప్రోగ్రాములే కాదు, బాగా డబ్బులు తెచ్చిపెట్టిన జబర్దస్త్, ఢీ, ఎక్సట్రా జబర్దస్త్, డ్రామా కంపెనీ ఎట్సెట్రా రేటింగుల్లో వెనుకబడిపోయాయి…

Ads

ఈ దీపావళికి ఈ మూడు వినోద చానెళ్లూ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి… పండుగ సంబురాన్ని పెద్దగా అందించలేకపోయాయి… జీటీవీ వాడేమో అవేవో వాళ్ల చానెల్ అవార్డుల కార్యక్రమం ప్రసారం చేశాడు తప్ప దీపావళి స్పెషల్ ఏమీ లేదు… అవి ఇంటి అవార్డులు కాబట్టి వాటికి పెద్దగా ప్రేక్షకాదరణ ఏమీ ఉండదు…

మాటీవీ వాడూ అంతే… స్టార్ మా పరివార్ పేరిట తనదీ సొంత డప్పు ప్రోగ్రామ్ ఏదో ప్రసారం చేశాడు తప్ప దీపావళి స్పెషల్ ఏమీ లేదు… రాత్రేమో తెలుగు మీడియం ఇస్కూల్ అని పెద్దగా పంచ్ లేని ప్రోగ్రామ్ వేశాడు… అది పెద్ద జనరంజకంగా ఏమీ లేదు… ఇక మిగిలింది ఈటీవీ… పొద్దున మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పేరిట ఓ స్పెషల్ షో చేశారు… కానీ గత పండుగల స్పెషల్ తాలూకు జోష్ కనిపించలేదు… బోర్…

diwali

పేరుకు సుమకు ట్రిబ్యూట్ అన్నట్టుగా సాగింది గానీ నిజానికి అది సుమ కొడుకు రోషన్‌కు ప్రమోషన్ షో… సుమ తెలివిగా ఈ షో పెట్టించుకుంది… కొడుకు బబుల్ గమ్ అని ఏదో సినిమా చేశాడు కదా, దానికి ప్రమోషన్ అన్నమాట… ఎందుకో గానీ కొడుకు పెద్ద హీరో మెటీరియల్ అనిపించలేదు… సుమకు డప్పు కూడా ఎక్కువైంది… చంటి, సుమల కోసం ప్రత్యేకంగా రాసిన స్కిట్లు కూడా పేలలేదు… మధ్యమధ్య ప్రోమో పైత్యాలు కూడా…

అన్నింటికీ మించి నరకాసుర వధ పేరిట ప్రసారం చేసిన స్కిట్ పరమ నాసిరకం… ఏ చిన్న స్కూల్‌లోనైనా పిల్లలు ఇంతకన్నా బాగా చేస్తారు… ప్చ్, అస్సలు బాగాలేదు… చమ్మక్ చంద్ర వేసిన సుమ వేషం కూడా నప్పలేదు, సుమ మీద కాబట్టి పెద్దగా డైరెక్టర్ లిబర్టీ తీసుకోలేని తీరు కనిపించింది… కాస్తోకూస్తో శ్రీదేవి డ్రామా కంపెనీ పర్లేదన్నట్టుగా ఉండేది… ఈరోజు అందులోనూ పెద్ద జోష్ లేదు… మాటీవీ వాడు రాత్రి 7 నుంచి 10.30 దాకా బిగ్‌బాస్ వేశాడు… ఎందుకో గానీ ఈరోజు బోరింగ్‌గా సాగింది…

పేరుకు దీపావళి స్పెషల్ అన్నారు గానీ హౌజులో నాలుగు దీపాలు, వేదిక మీద మరో రెండు దీపాలు తప్ప ఇక కార్యక్రమం మొత్తంతో దీపావళికి నయాపైసా లింక్ లేదు… వీకెండ్ షో ఐనా సరే ఫన్ లేదు, గేమ్ లేదు… (హీరో, హీరోయిన్ల సగం సగం మొహాల టాస్క్ ఒకటి కాసేపు పర్లేదు…) విచిత్రంగా హైపర్ ఆది పంచులు కూడా పేలలేదు… హౌజుమేట్స్ కుటుంబసభ్యుల్ని రప్పించారు గానీ హౌజులోకి వెళ్లినప్పుడు వచ్చే ఎమోషన్ వేదిక మీద నుంచి పలకరింపుల్లో కనిపించలేదు…

పేరుకు దీపావళి స్పెషల్… కానీ మూడు వరకూ సినిమా ప్రమోషన్లే… కాజల్, శ్రీలీల, వైష్ణవ్ తేజ తదితరులు ఈ షో కోసం రాలేదు, సినిమా ప్రమోషన్ల కోసం వచ్చారు… పనిలోపనిగా త్వరలో రాబోయే ‘ఊర్వశి-రాక్షసి’ సీరియల్ ప్రమోషన్ ప్రోమో కూడా వేసేశారు… ప్చ్, నీరస టీవీ దీపావళి… చిత్రంగా ప్రస్తుతం థియేటర్లలో చూడబుల్ సినిమాలు కూడా ఏమీలేవు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions