Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉమ్మడితనంలోనూ విడివిడితనం… యెల్లో కూటమి మర్యాదలే వేరు…

April 30, 2024 by M S R

రాజకీయాల్లో తెర వెనుక చాలా మర్మాలుంటయ్… కానీ తెరపై కనిపించేదే వోటరుకు ప్రధానం… దాన్ని బట్టే తన అభిప్రాయాల్ని ఏర్పరుచుకుంటాడు… ఏపీ పాలిటిక్స్ సంగతే తీసుకుందాం…

గత ఎన్నికల ముందు మోడీ ఓడిపోతాడని భ్రమపడి, తప్పుడు అంచనాలతో… ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని, మోడీ మీద నానా దుర్భాషలాడి, కాంగ్రెస్‌తో జతకట్టి, దానికి డబ్బులిచ్చి, చివరకు భంగపడిన చంద్రబాబు తరువాత ఏం చేశాడు..? జగన్ తొక్కడం నుంచి రక్షణ కోసం అదే మోడీ దయ కోసం, చూపు కోసం, ప్రాపకం కోసం నానా పాట్లూ పడ్డాడు…

సరే, బీజేపీ లోలోపల ఏం ప్లాన్లు వేసుకుందో, లేదా ఎప్పటిలాగే ఏపీకి సంబంధించి ఏ ప్లానయినా సరే శుద్ధ దండుగ అనుకుందో… పవన్ కల్యాణ్ పదే పదే చెప్పగానే… సర్లే సర్లే అనుకుని చంద్రబాబుతో చేతులు కలిపింది… సరే, కలిపారుపో… అది ఉమ్మడి కూటమి కదా, సీట్లు పంచుకున్నారు కదా… కొన్ని సీట్లలో అభ్యర్థులు దొరక్కపోతే ఒకరి నాయకుల్ని ఒకరు అడ్జస్ట్ చేసుకున్నారు కదా… మరి..?

Ads

yellow

ప్రజాగళం పేరిట ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారు… దానికి ఉమ్మడి మేనిఫెస్టో అని పేరు కూడా పెట్టారు… ఆ మేనిఫెస్టో నాణ్యత గురించి ఇక్కడ విశ్లేషించడం లేదు… జగన్ పంచుడుకు బాబు మార్క్ కౌంటర్ పంచుడు అది… ఎవరూ తక్కువ కాదు… నువ్వు పదిస్తే నేను ఇరవై ఇస్తా… అంతకుమించిన విజన్ ఏమీ లేదు ఇద్దరి మేనిఫెస్టోల్లో… వీళ్లూ ఫాఫం తెలుగు ప్రజల రాజనీతిజ్ఞులు..!!

సరే, ఆ మేనిఫెస్టో ఉమ్మడిదే కదా… మరి దానిపై బాబు, పవన్ ఫోటోలు మాత్రమే ముద్రించడం ఏమిటి..? ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి బొమ్మ వేయటానికి మనసొప్పలేదూ అనుకుందా బాబుకు… కనీసం మోడీ బొమ్మయినా ఉండాలి కదా… ఏది..? పవన్, బాబు ప్రసంగాల్లో కూడా ఎంతసేపూ జగన్‌పై విషమే తప్ప మోడీ ప్రస్తావనే ఉండటం లేదు పలుసార్లు…

అంటే ఇది ఉమ్మడితనంలోనూ విడివిడితనమా..? మేనిఫెస్టో రిలీజ్ వీడియో బిట్ ఒకటి వాట్సప్‌లో సర్క్యులేటవుతోంది… బాబు, పవన్ పక్కనే నిల్చున్న బీజేపీ పెద్దాయన సిద్ధార్థ నాథ్ సింగ్ (ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జుల్లో ఒకరు..?) కనీసం ఆ మేనిఫెస్టోను టచ్ చేయడానికి, ఫోటోకోసమైనా పట్టుకోవడానికి ఇష్టపడలేదు… నిరాకరించాడు…

అంటే, మేనిఫెస్టోను కేవలం టీడీపీ, జనసేన మేనిఫెస్టోలా మార్చినందుకా..? మేనిఫెస్టోలో పేర్కొన్న అనేకానేక అలవిమాలిన పంచుడు పథకాల మీద అసంతృప్తా..? అబ్బే, బీజేపీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, అందుకని ఏపీ మేనిఫెస్టోలో వేళ్లు కాళ్లు పెట్టలేదు అనే సమర్థన సరైందిగా లేదు… కలిసి వోట్లు అడుగుతున్నప్పుడు, కలిసే మేమేం ఉద్దరిస్తామో చెప్పాలి కదా…

కామన్ మినిమం ప్రోగ్రాం అంటూ ఏదీ లేని యెల్లో కూటమిలో బాబు ఏది చెబితే అదే ఫైనల్… అది పూర్తిగా టీడీపీ మేనిఫెస్టో… కనీసం జనం కోసమైనా ‘మాది ఉమ్మడి ఎన్నికల ప్రణాళికే’ అని చెబుతున్నట్టు కనిపించాలి కదా… రాజకీయాలంటేనే ప్రజల్ని భ్రమల్లో పడేయడం, గంతలు కట్టడం కదా.,. అదిక్కడ విస్మరించి, కలివిడివిడితనాన్ని చూపిస్తూనే కలిసి వోట్లు అడుగుతారట… భలే దొరికారయ్యా… ఫాఫం మోడీ…!! దేశానికి, ప్రపంచానికి పనికొచ్చే ఆయన ఫోటో షూట్లు తన మిత్రపొత్తుడు చంద్రబాబుకు మాత్రం కొరగాకుండా పోయాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions